1) ‘ఫాదర్ ఆఫ్ లోక్‌సభ’ అని ఎవరిని అంటారు?
జ: జి.వి. మౌలాంకర్.
2) శూన్య సమయాన్ని (జీరో అవర్) ఎప్పటి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు?
జ: 2004.
3) ‘ఎమ్‌డెన్ ఆఫ్ లోక్‌సభ’ అని ఎవరిని పేర్కొంటారు?
జ: ఎ.ఎస్. అయ్యంగార్.
4)లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌కు ఏ రకమైన బిల్లులపై సాధారణ ఓటు (మొదటిసారి) వేసే అధికారం ఉండదు?
జ: లోక్‌సభ సమావేశాలకు అధ్యక్షత వహించినప్పుడు అన్ని రకాల బిల్లులపై.
5)MPLAD స్కీంలో కొంత మంది ఎంపీలు అవినీతికి పాల్పడటాన్ని ‘స్టార్ న్యూస్’ ఏ పేరుతో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి బయటపెట్టింది?
జ: ఆపరేషన్ చక్రవ్యూహ్.
6)1989లో కేంద్రంలో తొలిసారిగా హంగ్ లోక్‌సభ ఏర్పడింది. ఆ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ ఏది?
జ: కాంగ్రెస్ (ఐ) .
7)భారత లోక్‌సభ ఎన్నికల చరిత్రలో అత్యధికంగా 6,96,321 ఓట్ల మెజారిటీతో ప్రీతం ముండే ఏ నియోజకవర్గం నుంచి(2014లో) లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు?
జ: బీడ్.
8)పార్లమెంటరీ పరిభాషలో ‘డెడ్‌లాక్’ అంటే ఏమిటి?
జ: సాధారణ బిల్లు విషయంలో పార్లమెంట్ రెండు సభల మధ్య వైరుధ్యం ఏర్పడటం.
9)పార్లమెంట్‌ను సమావేశ పరచడాన్ని ఏమంటారు?
జ:సమన్ .
10)లోక్‌సభ కస్టోడియన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
జ: స్పీకర్.
11)లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ హోదా పొందాలంటే కనీసం ఎంత శాతం సీట్లను పొందాలి?
జ: 10%.
┅┅◆◆┅┅
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment