Skip to main content

జిరాక్స్‌(XEROX) మెషిన్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా???🤔



ఏ డాక్యుమెంటుకైనా నకలును సృష్టించే జిరాక్స్‌ (xerox)మెషిన్ ఒక భౌతిక శాస్త్ర అద్భుతం ...ఇందులో క్షణాల్లో జరిగే అద్భుతాన్ని తెలుసుకోవాలంటే భౌతిక శాస్త్ర సూత్రాన్ని అర్థం చేసుకోవాలి...

గాలి వూదిన బెలూన్‌ను రుద్దితే అది చిన్న చిన్న కాగితం ముక్కల్ని ఆకర్షిస్తుంది.. దీనికి కారణం బెలూన్‌ ఉపరితలంపై స్థిర విద్యుత్‌ (static electricity) ఏర్పడడమే... విద్యుదావేశాలు (electric charges) రెండు రకాలు. ధనావేశం(positive charge) ఒకటైతే, రుణావేశం (negative charge) మరొకటి. భిన్న ఆవేశాలు ఆకర్షించుకుంటాయని మనకి తెలుసుకదా? ఈ సూత్రంపైనే జిరాక్స్‌ యంత్రం పనిచేస్తుంది..


జిరాక్స్‌ మెషిన్ లో ఓ ప్రత్యేకమైన డ్రమ్ము బెలూన్‌లాగే పనిచేస్తుంది. అంటే దానిపై స్థిరవిద్యుత్‌ను కలిగించవచ్చన్నమాట.. ఇంకా ఈ యంత్రంలో ఉండే టోనర్‌లో అతి సన్నని నల్లటి పొడి ఉంటుంది. స్థిరవిద్యుత్‌ ఏర్పడిన డ్రమ్ము ఈ నల్లటి పొడిని ఆకర్షిస్తుంది. డ్రమ్ముపై అక్కడక్కడ మాత్రమే స్థిరవిద్యుత్‌ ఏర్పడేలా చేయవచ్చు. అప్పుడు ఆయా ప్రాంతాలు మాత్రమే నల్లటి పొడిని ఆకర్షిస్తాయి...

 అలా డ్రమ్ముపైన మనకు కావలసిన విధంగా స్థిరవిద్యుత్‌తో కూడిన ఒక ప్రతిబింబాన్ని ఏర్పరచే వీలుంటుంది. అంటే ఒక డాక్యుమెంటులో ఎక్కడెక్కడ నల్లగా ఉంటుందో అక్కడ మాత్రమే స్థిరవిద్యుత్‌ ఏర్పడి నల్లటి పొడి అంటుకునే విధంగా డ్రమ్మును మార్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ డ్రమ్ము ద్వారా ముద్రితమయ్యే కాగితంపై ఆ డాక్యుమెంటు నకలు యధాతధంగా వస్తుంది. డ్రమ్ముపై మనం అనుకున్న చోటనే స్థిరవిద్యుత్‌ ఏర్పడేలా చేయడానికి కాంతి తోడ్పడుతుంది. అందుకే ఈ యంత్రాన్ని 'ఫొటో కాపీయర్‌' అని కూడా అంటారు..

డ్రమ్ముని ఫొటోవిద్యుత్‌ వాహక (photo conductive) పదార్థం (కాడ్మియం లేదా సెలీనియం)తో నింపుతారు. కాంతి ప్రసరించినప్పుడు ఈ డ్రమ్ము ఉపరితలమంతా ధనావేశం ఏర్పడుతుంది. యంత్రంలో మనం ఒక డాక్యుమెంటును పెట్టినప్పుడు దానిపై శక్తివంతమైన కాంతి కిరణాలు ప్రసరించే ఏర్పాటు ఉంటుంది. అవి డాక్యుమెంటులోని తెల్లని ప్రాంతాల ద్వారా పరావర్తనం చెంది డ్రమ్ము మీద పడతాయి. ఆ కిరణాలు పడిన ప్రాంతాల్లో మాత్రం డ్రమ్ములోని పదార్థం నుంచి ఎలక్ట్రాన్లు వెలువడి డ్రమ్ము ఉపరితలంపై ఆయా ప్రాంతాల్లో ఉన్న ధనావేశాన్ని తటస్థపరుస్తాయి. ఫలితంగా డాక్యుమెంటులో ఎక్కడెక్కడ నల్లని అక్షరాలు, చిత్రాలు ఉన్నాయో, అక్కడక్కడ మాత్రమే డ్రమ్ముపై ధనావేశం నిలిచి ఉండి, ఆ ప్రాంతాలే టోనర్‌లోని నల్లని పొడిని ఆకర్షిస్తాయి. ఇప్పుడు ఆ డ్రమ్ము ఉపరితలం మీదుగా వేరే తెల్ల కాగితాన్ని ప్రయాణించేలా చేయడం వల్ల టోనర్‌ పొడి కాగితంపై అంటుకుంటుంది. కాగితం బయటకి వచ్చే మార్గంలో ఉండే ఉష్ణవిభాగం ద్వారా కలిగే అత్యధిక వేడి వల్ల ఆ పొడి కాగితానికి గాఢంగా అంటుకుపోయి నకలు కాపీ ప్రింట్ బయటకు వస్తుంది...

లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺