Skip to main content

చరిత్రలో ఈ రోజు ఏమి జరిగింది....


👉 20 జులై  2020
👉 సోమవారం
👉 సంవత్సరములో 202వ రోజు 29వ వారం
👉 సంవత్సరాంతమునకు ఇంకా 164 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)
〰〰〰〰〰〰〰〰
_గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మాహార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్ర. చరిత్ర అంటే అనేక సంఘటనల సమహారం...అనేక మార్పులకు ...ప్రగతికి..పోరాటాలకు.. పరిణామ క్రమానికి..మంచి చెడులకు సాక్ష్యం.. అలాంటి సంఘటనలెన్నో...మార్పులెన్నో మానవాళి పరిణామ క్రమంలో ఆ వివరాలు మీకోసం అందిస్తున్న సమాచారం.._
〰〰〰〰〰〰〰〰
🔴 ప్రత్యేక  దినాలు
🚩 1810 : కొలంబియా దేశం స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకొంది.
🚩 అంతర్జాతీయ చెస్ రోజు
[చదరంగం ఇద్దరు ఆటగాళ్ళ మధ్య ఒక వినోద, పోటీ రేపెట్టే ఆట. కొన్ని సార్లు దీనిని పాశ్చాత్య లేదా అంతర్జాతీయ చదరంగం అని కూడా వ్యవహరిస్తుంటారు.' అని అంటారు. ఈ పేర్లు తతిమ్మా (పూర్వపు) చదరంగం వంటి ఆటలను భిన్నంగా గుర్తించడానికి తోడ్పడతాయి. చదరంగం ఆడడం బుద్ధికి కసరత్తుగా కొంతమంది గుర్తిస్తారు. చదరంగం ఆటలో మేధా శక్తి, విజ్ఞాన పరిజ్ఞానం, వ్యూహాత్మకత, కళానైపుణ్యం కలిసి ఉంటాయని చెప్పవచ్చును.
Chess is thought to be a descendant of the game Chaturanga, which was developed in India around the 6th century AD. Eventually evolved into the modern form favored by philosophers, poets, and kings in late medieval Europe. Chess has been used to teach war strategy and sharpen the intellect. It is played by people worldwide. Chess is one of the most iconic games of all time.
Key Words:
World Chess Federation: Garry Kasparov: Bobby Fischer; Magnus Carlsen: Wilhelm Steinitz: Chaturanga; Shatranj: Deep Blue: Chess960: Shannon number: centaur chess
Pendulum's Pick:
From Chaturanga came Shatrani And from Shatranj came Chess; Now humans, Als, and centaurs alike Play to see who can play best!]
〰〰〰〰〰〰〰〰
🏀 సంఘటనలు
✴1872: అమెరికన్ పేటెంట్ కార్యాలయం, వైర్‌లెస్ టెలిగ్రఫీ మొదటి పేటెంట్ మహ్లాన్ లూమిస్ అనే వ్యక్తికి ఇచ్చింది.
✴1878: హవాయిలో మొట్టమొదటి టెలిఫోన్ ని ప్రవేశ పెట్టారు.
✴1903: ఫోర్డ్ మోటార్ కంపెనీ తన మొట్టమొదటి కారును ఎగుమతి చేసింది.
✴1930: వాషింగ్టన్, డి.సి. (జిల్లా రికార్డ్) 106 డిగ్రీల ఫారెన్ హీట్ (41 డిగ్రీల సెంటిగ్రేడ్).
✴1934: అయొవా రాష్ట్రం రికార్డు. అయొవా రాష్ట్రంలో ఉన్న 'కియోకుక్' లో 118 డిగ్రీల ఫారెన్ హీట్ (48 డిగ్రీల సెంటిగ్రేడ్).
✴1944: రాస్తెన్ బర్గ్ లో జరిగిన మూడవ హత్యా ప్రయత్నం నుంచి, అడాల్ఫ్ హిట్లర్ తప్పించుకున్నాడు.
✴1960: సిరిమావో బండారు నాయకే, సిలోన్ (నేటి శ్రీలంక) ప్రధానిగా ఎన్నికైంది. ఈమె ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని (ప్రభుత్వాధినేత్రి).
✴1960: రోదసీలోకి వెళ్ళిన రెండుకుక్కలు తిరిగి భూమిమీదకు (యు.ఎస్.ఎస్.ఆర్) తిరిగి వచ్చాయి. రోదసీలోకి వెళ్ళి తిరిగివచ్చిన మొదటి జీవాలు ఇవే.
✴1969: భారత రాష్ట్రపతిగా వరాహగిరి వేంకటగిరి పదవీ విరమణ.
✴1969: భారత రాష్ట్రపతిగా ఎం.హిదయతుల్లా పదవిని స్వీకరించాడు.
✴1975: 'ది టైమ్స్', 'ది డెయిలీ టెలిగ్రాఫ్', 'న్యూస్ వీక్' పత్రికా విలేకరులను, భారత ప్రభుత్వపు సెన్సార్ నిబంధనలను పాటించే పత్రంపై సంతకం చేయటానికి నిరాకరించటం వలన, భారత ప్రభుత్వం వారిని బహిష్కరించింది (అది అత్యవసర పరిస్థితి - ఎమెర్జెన్సీ కాలం)
✴1976: 'వైకింగ్ 1' అనే రోదసీ నౌక కుజగ్రహం మీద దిగింది. అపొల్లో 11 రోదసీ నౌక చంద్రుడిమీద దిగి ఏడు సంవత్సరాలు అయిన సందర్భంగా, అమెరికా ఈ 'వైకింగ్ 1' ని ప్రయోగించింది. మొదటిసారిగా కుజుడి నేలమీద 'క్రిస్ ప్లానిటియా' అనే చోట (కుజుడి నేల మీద ఉన్న ఒక స్థలం పేరు) ఈ వైకింగ్ దిగింది.
✴1976: అమెరికా తన సైనిక దళాలను థాయ్‌లేండ్ నుంచి ఉపసంహరించింది (వియత్నాం యుద్ధం కోసం అమెరికా ఈ సైనిక దళాలను ఇక్కడ ఉంచింది)
✴1989: బర్మాను పాలిస్తున్న సైనికా జుంటా ప్రభుత్వము, ప్రతిపక్ష నాయకురాలు 'దా అంగ్ సాన్ సూ క్యి' ని గృహ నిర్బంధం (ఇంటిలో నుంచి బయటకు రాకుండా) లో ఉంచారు.
〰〰〰〰〰〰〰〰
🌐 జననాలు
❇1785: మహముద్ II ఒట్టొమాన్ సుల్తాన్, సంస్కర్త, పాశ్చాత్యీకరణ చేసిన వాడు.
❇1822: గ్రెగర్ జాన్ మెండెల్, ఆస్ట్రియా సన్యాసి, వృక్షశాస్త్రజ్ఞుడు. 'లాస్ ఆఫ్ హెరెడిటీ' జీవుల అనువంశికత సూత్రాలు కనుగొన్నాడు.
❇1864: ఎరిక్ కార్ల్‌ఫెల్డ్, స్వీడన్. కవి. ( 1918 లో నోబెల్ బహుమతి తిరస్కారము. 1931 లో నోబెల్ బహుమతి మరణానంతరం ఇచ్చారు).
❇1892: కవికొండల వెంకటరావు, తెలుగు కవి, జానపద, నాటక రచయిత. (మ.1969)
❇1919: ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కాడు. (మ.2008)
❇1920: లెవ్ అరోనిన్, యు.ఎస్.ఎస్.ఆర్. ప్రపంచ చదరంగపు ఆటగాడు (1950)
❇1933: రొద్దం నరసింహ, భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత.
❇1941: వ్లాదిమిర్ ఎ ల్యాఖోవ్, రోదసీ యాత్రికుడు (సోయుజ్ 32, టి-9)
❇1947: గెర్డ్ బిన్నింగ్ ఫ్రాంక్‌ఫర్ట్, ఫిజిసిస్ట్ (టన్నెలింగ్ మైక్రోస్కోప్ - నోబెల్ బహుమతి గ్రహీత 1986)
❇1969: గిరిజా షెత్తర్, తెలుగు సినిమా నటి.
❇1980: గ్రేసీ సింగ్, భారతీయ సినీనటి
〰〰〰〰〰〰〰〰
⚫ మరణాలు
◾1937: గూగ్లి ఎల్మో మార్కోని, రేడియోని కనుగొన్న శాస్త్రవేత్త. (జ.1874)
◾1951: జోర్డాన్ రాజు, అబ్దుల్లా ఇబిన్ హుస్సేన్, ని జెరూసలెంలో హత్య చేసారు.
◾1972: గీతా దత్, భారతీయ నేపథ్య గాయకురాలు. (జ.1930)
◾1973: బ్రూస్ లీ, ప్రపంచ యుద్ధ వీరుడు. (జ.1940)
◾1980: పర్వతనేని బ్రహ్మయ్య, పేరొందిన అకౌంటెంట్. (జ.1908)
◾2019: షీలా దీక్షిత్, దేశ రాజధాని ఢిల్లీకి ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు.(జ. 1938) 🙏🏻

లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺