Skip to main content

కలుగోడు అశ్వత్థరావు కవి గురించి ...




బడగనాడు శాఖకు చెందిన మధ్వ బ్రాహ్మణ కుటుంబములో వెంకోబరావు, లక్ష్మమ్మ దంపతులకు కలుగోడు అశ్వత్థరావు (జూలై 25, 1901 - జూలై 19, 1972) [1] 1901 వ సంవత్సరం జూలై 25 వ తేదీన జన్మించాడు. కేవలం నాలుగవ తరగతి వరకే చదివిన ఇతడు సహజంగా అబ్బిన విద్యతోపాటు స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. రాయదుర్గం తాలూకా కలుగోడు లోను, కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా తళుకు గ్రామంలోను కరణముగా పనిచేశాడు. ఈ రెండు గ్రామాలలోను ఇతనికి చాలినన్ని భూములున్నాయి. ఇతని జీవితం హాయిగా గడచింది. ఇంటికి వచ్చిన అతిథులను గొప్పగా సత్కరించేవాడు. తన గ్రంథాలను ప్రచురించుకొనడానికి స్వంతంగా రాయదుర్గంలో కవిరాజ ముద్రాక్షరశాలను నెలకొల్పాడు. తన చివరి దశలో దీనిని రాయల పరిషత్తుకు ఉచితంగా ఇచ్చివేశాడు


జననం
కలుగోడు అశ్వత్థరావు
1901 జూలై 25
భారతదేశం కలుగోడు గ్రామం, గుమ్మగట్ట మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర

మరణం
1972 జూలై 19

వృత్తి
కరణము

ప్రసిద్ధి
ప్రముఖ తెలుగు,కన్నడ కవి

మతం
హిందూ

🖋️రచనలు🖋️

సర్వజ్ఞునివచనములు - కన్నడభాష నుండి తెలుగులోనికి అనువాదం
ವೇಮನ ರತ್ನಗಳು - వేమన పద్యాలను కన్నడ భాషలోనికి అనువాదం
అనుభవామృత సారము - మహాలింగ రంగ కన్నడలో వ్రాసిన అనుభవామృత అనే అద్వైత వేదాంత గ్రంథానికి తెలుగు అనువాదం
సోమేశ్వర శతకము - పాల్కురికి సోమనాథుని కన్నడ శతకానికి తెలుగు అనువాదం
హరిభక్తసారము - కనకదాసు కన్నడరచనకు తెలుగు సేత
ಭಾಗವತ ಗೀತಿಗಳು - పోతనభారతంలోని గజేంద్రమోక్షము, రుక్మిణీకళ్యాణము, ప్రహ్లాదచరిత్ర, వామనచరిత్ర ఘట్టాల కన్నడానువాదము
ಶೃಂಗಾರ ವರೂಧಿನಿ - మనుచరిత్ర కన్నడానువాదము
ಕಂದಪದ್ಯ ರಾಮಾಯಣ - స్వతంత్ర కన్నడ రచన
ಶ್ರೀಕೃಷ್ಣಲೀಲೆ (ಬೈಲು ನಾಟಕ) - స్వతంత్ర కన్నడ వీధి నాటకము
ಸುಭದ್ರಾಪರಿಣಯ ನಾಟಕ - స్వతంత్ర కన్నడ రచన
గధాయుద్ధము - రన్న కవిచే రచింపబడిన ಸಾಹಸ ಭೀಮ ವಿಜಯ అనే కన్నడ కావ్యానువాదము
దండకరామాయణము
అశ్వత్థ భారతము (ఆది చతుష్కము మాత్రము)
అశ్వత్థేశ త్రిశతి (కందములు)
మూడు శతకములు
మయూరధ్వజము (నాటకము)
యువతీ వివాహభాగ్యోదయము (నాటకము)
అక్కమహాదేవి వచనములు
బ్రాహ్మణుడు
గురుదక్షిణ

లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺