1)మురికివాడల్లో నివసించే ప్రజల గృహ అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన పథకం?
జ: రాజీవ్ ఆవాస్ యోజన.
2)మహిళా ఉద్యమదారులను ప్రోత్సహించడానికి మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ప్రత్యక్ష ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యవస్థ?
జ: మహిళా ఈ-haat.
3)నిర్లక్ష్యానికి గురైన, అణగారిన వర్గాల మహిళల అభ్యున్నతికి కృషిచేసిన మహిళలు, సంస్థలకు ఇచ్చే జాతీయ స్థాయి అవార్డు?
జ: నారిశక్తి పురస్కార్.
4)ఆహార కేటరింగ్ యూనిట్లు ప్రారంభించిన మహిళా ఉద్యమదారులకు ఏ పథకం ద్వారా పరపతి లభిస్తుంది?
జ: అన్నపూర్ణ.
5)వ్యవసాయం, రిటైల్, చిన్న వ్యాపారాలలో నిమగ్నమై 18 నుంచి 45 సంవత్సరాల వయో వర్గంలోని మహిళా ఉద్యమదారులకు ఏ పథకం ద్వారా రూ.1లక్ష వరకు పరపతి లభిస్తుంది?
జ: ఉద్యోగిని పథకం.
6)ప్రధానమంత్రి మంత్రిత్వ సహయోగ్‌ను 2017లో ఏ విధంగా పేరు మార్చారు?
జ:ప్రధానమంత్రి మాతృవందన యోజన.
7)పిల్లలు, తల్లుల కోసం అంగన్‌వాడీలను కమ్యూనిటీ సెంటర్‌సగా రూపొందించే లక్ష్యంగా 2015 జూన్ 24న ప్రారంభమైన పథకం?
జ: నంద్-Ghar యోజన.
8)మహిళలకు ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలకు సంబంధించిన సమాచారం అందించడానికి 2018లో ప్రారంభమైంది?
జ: నారి వెబ్‌పోర్టల్.
9)నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక 2019 ప్రకారం 2017లో దక్షిణాది రాష్ట్రాలలో మహిళలపై నేరాలు అధికంగా నమోదైన రాష్ట్రం ఏది?
జ: ఆంధ్రప్రదేశ్.
10)మహిళల పునరావాసానికి సంబంధించిన పథకం ఏది?
జ: స్వధార్ Greh.
┅┅◆◆┅┅
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment