Skip to main content

కృష్ణ ద్రవ్యము (Dark Matter) అంటే ఏమిటి❓

🌸జవాబు: ఈ విశాల విశ్వంలో, బ్రహ్మాండాలను (గెలాక్సీలను) ఒకటిగా ఉంచడానికి, అవి గుంపులుగా కదలడానికి ఎంత ద్రవ్యరాశి (Matter)కావాలో గణనలు చేయడం ద్వారా శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. కానీ.. వారు గమనించిన ద్రవ్యం, విశ్వంలో ఉన్న ద్రవ్యంలో 4 శాతం మాత్రమే. కాబట్టి.. ఆ కనిపించని, వెలుగునీయని ద్రవ్యాన్ని డార్క్‌మేటర్‌ (కృష్ణ ద్రవ్యము) అంటారు. ఈ ద్రవ్యము నల్లని మేఘాలు, ధూళి లేక కాలం తీరిన నక్షత్రాల (Dead Stars) రూపంలో ఉందనుకోవడం సరికాదు.

👉 అతి నల్లని ద్రవ్యాన్ని కనుగొనే శాస్త్ర పరికరాలున్నప్పటకీ, ఈ కృష్ణ ద్రవ్యాన్ని కనుగొనడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మహా విస్ఫొటనం (బిగ్‌ బ్యాంగ్‌) తర్వాత జరిగిన కేంద్రక చర్యల (Nuclear reaction) ఆధారంగా విశ్వంలో ఎంత ద్రవ్యం ఉందనేదాన్ని శాస్త్రజ్ఞులు కచ్చితంగా లెక్కకట్టగలరు. ఈ లెక్కల వల్ల తేలిందేమంటే, ఇప్పుడు విశ్వంలో ఉన్న మొత్తం ప్రోటాన్ల, న్యూట్రాన్ల ద్రవ్యరాశి, మొత్తం విశ్వంలో ఉండాల్సిన ద్రవ్యరాశి కన్నా అతి తక్కువ అని. ఈ తప్పిపోయిన ద్రవ్యాన్వేషణ విశ్వజ్ఞాన శాస్త్రజ్ఞుల (Cosmolodist)ను కణభౌతిక శాస్త్రజ్ఞులను ఒక చోటికి చేర్చింది.

👉 ఈ కృష్ణ ద్రవ్యరచన న్యూట్రాన్లు, న్యూట్రినోలు, పెక్సియన్‌ కణాలతో జరిగి ఉండొచ్చని శాస్త్రజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు. కాని వాటి ఉనికిని ఇంతవరకు కనిపెట్టలేదు. కారణం ఈ మూడు రకాల కణాలలో విద్యుదావేశం శూన్యం కాబట్టి, అవి వాటిపై పడే కాంతిని శోషణం (absorb) చేయడం కాని, పరావర్తనం (reflection) చేయడంగాని చేయలేవు. అందువల్లనే ఆ కణాలతో నిర్మితమైన ఆ ద్రవ్యం కనిపించదు. కానీ కృష్ణద్రవ్యం మహా విస్ఫోటన ధాటికి తట్టుకుని విశ్వంలో నిశ్చలంగా ఉంది.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

TET and DSC Very important topics...

Lakshya Educational Groups