Skip to main content

నేటి మోటివేషన్... తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి...

తల్లి తండ్రులకు కంటనీరు పెట్టించిన వారు 
ఎంత దురదృష్టవంతులో 
ఆనంద భాష్పాలు తెప్పించిన వారు
అంతటి అదృష్టవంతులు 

వాళ్ళు ఉన్నంత కాలము మనము ఉంటాము
మనం ఉన్నతం కాలము వాళ్ళు ఉండరు 

బిడ్డలు శక్తి సామర్ధ్యాలు పొందే కాలంలో 
తల్లి తండ్రులకు శక్తి సామర్ధ్యాలు తగ్గిపోతాయి 

బిడ్డలకు ఉన్నతమైన భవితపై ఆశలు చిగురించే సమయంలో
తమ భవితపై అంతులేని అనిశ్చితికి లోనయ్యే సమయం వారిది 

బిడ్డలకు కొత్త కొత్త ప్రపంచాలు ఏర్పడే కాలంలో 
బిడ్డలే తమ ప్రపంచంగా మారే కాలం తల్లి తండ్రులది 

రేపటి అంతులేని ఆశ బిడ్డలది 
రేపటిపై అర్ధంకాని అయోమయం తల్లి తండ్రులది 

తమ జీవితాలని పెట్టు బడిగా పెట్టి 
పిల్లల భవితను తీర్చి దిద్దిన తల్లితండ్రులకు 
కొంత ప్రేమ మరికొంత ఆసరా ఇంకొంత ధైర్యం
కలిగించవలసినది ఆ బిడ్డలే .. 

తమకంటూ ఏమి మిగుల్చుకొని తల్లి తండ్రుల 
త్యాగాలను గుర్తించకున్నా బాధ పడని తల్లితండ్రులు 
ఏవోవో కోరికలతో అత్యాశలతో స్థాయికి మించి పిల్లల కోరికలతో
నిష్టురంగా మాట్లాడితే కలిగే బాధ వర్ణనాతీతము 

జీవితాన్నిచ్చిన తల్లితండ్రులకు 
రెండు పూటలా తిండితో పాటు
రెండు మాటలు ప్రేమతో మాట్లాడితే 
ఎంత ఆనందిస్తారో ...

ఏ తల్లి తండ్రులు బిడ్డలకు భారంగా మారాలని కోరుకోరు
తమ పనులు తాము చేసుకుంటూ దాటిపోవాలనే ఆశిస్తారు 
అలా జరగనప్పుడు వారి ఆఖరి ప్రయాణానికి 
అంతులేని ప్రేమను పంచి ఆనందంగా ముగించటం
బిడ్డలా బాధ్యత 

ఆ దేవుడు కూడా మెచ్చుకొనేది అటువంటి జీవులనే 
తల్లి తండ్రులను గౌరవించని వాడు
ఎన్ని పూజలు చేసినను ఆ దేవదేవుడు స్వీకరించడు

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺