Skip to main content

నేటి మోటివేషన్... తూకం తప్పకూడదు...!

Moral story....

ఒకానొక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతడి గురువు వచ్చాడు. 
‘‘గురూజీ! నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి’’ అని అభ్యర్థించాడు వ్యాపారి. ‘‘దేవుడు నీ వ్యాపారంలో వృద్ధివికాసాలు ప్రసాదించుగాక. కానీ, నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయతీగా వ్యవహరించు’’ అని సూచించాడు గురువు.

ఎప్పుడూ తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకున్నాడు. న్యాయంగా తూచడం మొదలుపెట్టాడు. అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది. ధాన్యాన్ని తూచడానికి బంగారంతో తూనిక రాళ్లను చేయించాడు. దీంతో ఎక్కడెక్కడివారో వచ్చి ఆ తూనిక రాళ్లను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు.

ఒకరోజు అతడు ఆ తూనిక రాళ్లను తీసుకొని తన గురువు దగ్గరికి వెళ్లాడు. ‘‘గురువు గారూ! మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది. బంగారు తూనికరాళ్లతో ధాన్యాన్ని తూచేంత వృద్ధి సాధించాను’’ అన్నాడు వ్యాపారి. ‘‘ఆ బంగారపు తూనికరాళ్లను తీసుకెళ్లి ఏటిలో పడవేయ్‌’’ అని గురువు ఆజ్ఞాపించాడు.
గురువాజ్ఞ మేరకు బంగారం విలువ గురించి కూడా ఆలోచించకుండా వాటిని ఏరులో పడవేసి ఇంటికి చేరుకున్నాడు. 

ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కొందరు రైతులు తమ ధాన్యాన్ని అమ్మడం కోసం పట్టణానికి వస్తున్నారు. రైతులు ఏరు దాటుతుండగా బంగారు తూకం రాళ్లు వారికి దొరికాయి. వాటిని చూడగానే.. ఇవి ఫలానా వ్యాపారివి అని గుర్తించారు. అతడి మంచితనం తెలిసిన రైతులు.. అలాంటి ఉత్తముడి సొమ్ము తీసుకోవడం భావ్యం కాదనుకున్నారు. తూకంరాళ్లను తీసుకెళ్లి ఆ వ్యాపారికి ఇచ్చేశారు.

 మళ్లీ తన దగ్గరికి చేరిన తూకంరాళ్లను గురువు దగ్గరికి తీసుకెళ్లాడు వ్యాపారి. ‘‘నేను వీటిని ఏరులో పారేశాను. మళ్లీ నా దగ్గరికి వచ్చాయి గురువు గారూ’’ అని విన్నవించుకున్నాడు. ‘‘నీవు ఎప్పుడైతే తూకంలో మోసం చేయడం మానేశావో.. దైవం నీ సంపదలో వృద్ధిని ప్రసాదించాడు. 
నిజాయతీగా సంపాదించావు కనుకనే.. నీ సొమ్ము మళ్లీ నీ దగ్గరికి చేరింద’’న్నాడు గురువు.🍁

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

RRB NTPC 8050 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.  మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు  https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

RRB JE Recruitment: రైల్వేలో 2,570 జూనియర్ ఇంజినీర్, మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు

భారతీయ రైల్వే (Indian Railway).. 2,570 పోస్టులతో మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 05/ 2025) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 2,570 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆర్ఆర్బీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ 31వరకు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఆఫీసియల్ వెబ్సైటు లింక్ https://www.rrbcdg.gov.in/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ