సంఘటనలు🔍
🌸1099: మొదటి క్రూసేడ్ (మతయుద్ధం) : జెరూసలెమ్ రాజ్యాన్ని రక్షించడానికి 'బౌలియన్' కి చెందిన 'గాడ్‌ఫ్రే' ఎన్నికయ్యాడు.
🌸1298: ఇంగీషు సైన్యం 'ఫాల్కిర్క్ యుద్ధం' లో 'స్కాట్స్' ని ఓడింఛింది.
🌸1456: యూరప్ లో ఒట్టోమన్ యుద్ధాలు - బెల్‌గ్రేడ్ ముట్టడి. హంగరీ రాజప్రతినిధి, జాన్ హున్యాది, ఒట్టోమన్ రాజ్యానికి చెందిన 'మెహ్మెత్ II' ని ఓడించాడు.
🌸1461: మూస:ఫ్రాన్సు రాజైన ఛార్లెస్ VII, (1422-61) తన 58వ ఏట మరణించాడు.
🌸1587: ఇంగ్లీషు వారి రెండవ వలస 'రోనోక్ దీవి' (నార్త్ కరోలినా) లో వెలిసింది.
🌸1686: 'అల్బనీ' ( న్యూయార్క్), మునిసిపాలిటీగా ఏర్పడింది.
🌸1763: 'కేథరిన్ II' విదేశీయులను రష్యా లో శాశ్వత నివాసానికి ఆహ్వానించింది. చాలామంది జర్మన్ రైతులు రష్యాలో నివాసానికి తమ సమ్మతి తెలిపారు.
🌸1775: జార్జ్ వాషింగ్టన్ అమెరికన్ సైన్యం అధిపతి అయ్యాడు.
🌸1796: జనరల్ మోజెస్ క్లీవ్ లాండ్, ఓహియో రాష్ట్రంలో, 'క్లీవ్‌లాండ్' నగరాన్ని స్థాపించాడు. క్లీవ్‌లాండ్, కనెక్టికట్ లాండ్ కంపెనీ అనే సర్వే కంపెనీ, అధిపతిగా ఉండే వాడు.
🌸1812: 'సలమాంకా యుద్ధం' (స్పెయిన్) - ఆర్ధర్ వెలెస్లీ నాయకత్వంలోని (తరువాత వెల్లింగ్టన్ డ్యూక్) బ్రిటిష్ సైన్యం, ఫ్రెంచి సైన్యాన్ని ఓడించింది.
🌸1854: గ్రహశకలం (అస్టరాయిడ్) #30 యురేనియాని 'జె.ఆర్. హింద్' కనుగొన్నాడు.
🌸1898: బెల్జియన్ సిబ్బంది (బెల్జికా క్రూ అని వీరికి పేరు), అంటార్కిటికా పరిశోధనకు వెళ్ళారు. వారంతా, బయలు దేరిన, 1600 గంటల తరువాత, అంటార్కిటికా శీతాకాలంలో, సూర్యోదయాన్ని చూసారు.
🌸1908 : అమి వాండెర్‌బిల్ట్. ఈమె 'కంప్లీట్ బుక్ ఆఫ్ ఎటికెట్ (ఎటిక్వెట్) రాసింది. ఎటికెట్ అంటే మర్యాదలు అనుకోవచ్చును. ఎందుకంటే ఇంగ్లీషులో కూడా ఈ పదాన్ని సరిగా నిర్వచించలేదు.
🌸1908 : విలియం లారెంజ్ గ్రహశకలం (ఆస్టరాయిడ్) '#665 సబినె (సబిన్) ' ని కనుగొన్నాడు.
🌸1912 : స్పెయిన్ లోని స్టాక్ హోమ్ లో 5వ ఒలింపిక్ గేమ్స్పూర్తి అయ్యాయి.
🌸1917 : అలెగ్జాండర్ కెరెన్‌స్కీ రష్యా కి ప్రధాన మంత్రి అయ్యాడు
🌸1917 : ఎమ్. వుల్ఫ్ మూడు గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) ను కనుగొన్నాడు. ఆ మూడింటి పేర్లు '#879 రికార్డా', '#880 హెర్బా', '#881 అథెనె'.
🌸1926 : 'వాటర్‌బరి' (కనెక్టికట్) రాష్ట్రం లోని ఉష్ణోగ్రత రికార్డు. 105 డిగ్రీల ఫారెన్ హీట్, 41 డిగ్రీల సెంటిగ్రేడ్.
🌸1926 : 'ట్రాయ్' (న్యూయార్క్) రాష్ట్రం ఉష్ణోగ్రత రికార్డు. 108 డిగ్రీల ఫారెన్ హీట్, 42 డిగ్రీల సెంటిగ్రేడ్.
🌸1930 : '#1306 స్కిథియా' అనే పేరుగల గ్రహశకలా న్ని (ఆస్టరాయిడ్) 'జి. న్యూజ్మిన్' కనుగొన్నాడు.
🌸1930 : హెండ్రిక్ వాన్ జెంట్ రెండు గ్రహశకలాల(ఆస్టరాయిడ్) ను కనుగొన్నాడు. వాటి పేర్లు '#1666 వాన్ జెంట్', '#1752 వాన్ హెర్క్'. అలాగే చంద్రుడి అవతలి భాగంలో ఉన్న ఒక క్రేటర్ కి ఇతని పేరు మీద 'వాన్ జెంట్' అని పేరు పెట్టారు.
🌸1933 : విలీ పోస్ట్ ఒంటరిగా 15,596 మైళ్ళు 7 రోజుల 18 గంటల 45 నిమిషాలలో విమానంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి.
🌸1935 : సి. జాక్సన్ రెండు గ్రహశకలాల ను (ఆస్టెరాయిడ్స్) కనుగొన్నాడు. అవి #1359 ప్రియెస్కా, #1360 తార్కా.
🌸1939 : మొదటి నల్లజాతి న్యాయాధికారిణి (స్త్రీ) పేరు జేన్ మటిల్డా బోలిన్, న్యూయార్క్.
🌸1942 : యూదుల నువార్సా ఘెట్టో నుంచి టెబ్లింకా కు ఒక పద్ధతిగా (రోజుకి 6 వేల నుంచి 7 వేల మందిని) చేరవేయటం (వారిని చంపటానికి. అలా చనిపోయిన వారు ఎంత తక్కువగా చూసినా 3 లక్షలమంది ఉంటారు) మొదలైన రోజు.
🌸1944 : పోలాండ్ లిబరేషన్ డే.
🌸1947: పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణపతాకం భారత జాతీయజెండా గా ఆమోదించబడింది.
🌸1962 : శుక్ర గ్రహాని కి పంపటానికి తయారు చేసిన అమెరికన్ రోదసీ నౌక మారినర్ 1, ప్రయోగించేదశలోనే పడిపోయింది
🌸1963 : బీటిల్స్ (నలుగురు గాయకుల గుంపు) 'ఇంట్రడ్యూసింగ్ ది బీటిల్స్' అనే మొదటి ఆల్బంని విడుదల చేసారు.
🌸1969 : యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) స్పుత్న్కి 50, మొల్నియల్-12 అనే రెండు కమ్యూనికేషన్ ఉపగ్రహాలను రోదసీలోకి పంపింది.
🌸1972 : రష్యా ప్రయోగించిన వెనెరా 8 పేరు గల రోదసీ నౌక శుక్ర గ్రహం మీద నెమ్మదిగా దిగింది.
🌸1983 : డిక్ స్మిత్ హెలికాప్టర్ మీద ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొదటి వ్యక్తి.
🌸1987 : సోయుజ్ టి.ఎమ్-3 అనే రోదసీ నౌకను ముగ్గురు రోదసీయాత్రికులతో (అందులో ఒకడు సిరియా దేశస్థుడు) రష్యా ప్రయోగించింది.
🌸1988 : ఫ్రెంచి గయానా (కౌరు) నుంచి ఇన్సాట్ 1-సి ప్రయోగించారు.
🌸1999 : మైక్రోసాప్ట్ కంపెనీ ఎమ్.ఎస్.ఎన్. మెసెంజర్ మొదటి వెర్షన్ (మొదటి తరం) ని విడుదల చేసింది.
🌼జననాలు🌼
💝1822: గ్రెగర్ మెండల్, జన్యుశాస్త్రం లో జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన శాస్త్రవేత్త. (మ.1884)
💝1887: గుస్టావ్ లుడ్విగ్ హెర్ట్‌జ్, జర్మన్ క్వాంటమ్ శాస్త్రవేత్త (1925 లో నోబెల్ బహుమతి గ్రహీత). ఇతని బంధువైన హీన్‌రిఛ్ రుడాల్ఫ్ హెర్ట్‌జ్ పేరుతో రేడియో తరంగాలకు (హెర్ట్‌జ్) గా పేరు పెట్టారు.
💝1916: నిడమర్తి అశ్వనీ కుమారదత్తు, కార్మిక నాయకుడు, పత్రికా నిర్వాహకుడు. (మ.1977)
💝1923: ముకేష్, భారతీయ హిందీ సినిమారంగ నేపథ్య గాయకుడు. (మ.1976)
💝1922: పుట్టపర్తి కనకమ్మ, సంస్కృతాంధ్ర కవయిత్రి, సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు భార్య. (మ.1983)
💝1925: దాశరథి కృష్ణమాచార్య, తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి. (మ.1987)
💝1940: యూరి పి అర్త్యుఖిన్, రోదసీయాత్రికుడు (సోయుజ్ 14).
💝1965: రాగతి పండరీబాయి, తెలుగు వ్యంగ్య చిత్రకారులు, కార్టూనిస్టులలో ఏకైక మహిళా కార్టూనిస్ట్. (మ.2015).
💝1959: బోయినపల్లి వినోద్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యుడు, న్యాయవాది.
💝2002: నకరకంటి దివ్య, ముకుందపురం, సూర్యపేట జిల్లా, తెలంగాణ.
💐మరణాలు💐
🍁1826: గియుసెప్పె పియజ్జి, మొదటి గ్రహశకలాన్ని(ఆస్టరాయిడ్) కనుగొన్న శాస్త్రవేత్త.
🍁1987: ఎ.జీ. కృపాల్ సింగ్, భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు. (జ.1933)
🍁2003: 'ఉదయ్', ఖుసే హుస్సేన్', సద్దాం హుస్సేన్ కుమారులు. ఉత్తర ఇరాక్ లో జరిగిన యుద్ధంలో, తుపాకీ కాల్పులకు మరణించారని అమెరికా ప్రకటించింది.
🇮🇳జాతీయ / దినాలు🇮🇳
👉 1944: పోలండ్ జాతీయదినోత్సవం.
👉 మ్యాంగో డే.
Comments
Post a Comment