Skip to main content

నేటి మోటివేషన్... స్వర్గం, నరకం

ఒకసారి తమకు దగ్గరలోనే ఒక గొప్ప జెన్‌ గురువు ఉన్నాడని జపాన్‌ చక్రవర్తికి వార్తాహరుల ద్వారా తెలిసింది. ఆ గురువును ప్రజలందరూ పొగుడుతున్నారనీ, తండోపతండాలుగా వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారనీ, ఆయనతో సంభాషించిన తరువాత సంతోషంగా, సంతృప్తిగా తిరిగి వస్తున్నారనీ చక్రవర్తికి ఎందరో చెప్పారు. ఆ గురువును కలుసుకోవాలని చక్రవర్తి మనసు తొందర చేసింది. ఇక ఉండలేక, ఒక రోజు సంధ్యా సమయంలో, మందీ మార్బలంతో గురువు వద్దకు వెళ్ళాడు. ఎంతో కాలంగా నరకం గురించీ, స్వర్గం గురించీ చక్రవర్తికి సందేహాలు ఉన్నాయి. 


గురువును కలిసిన వెంటనే ‘‘నరకం అంటే ఏమిటి? స్వర్గం అంటే ఏమిటి?’’ అని ప్రశ్నించాడు.

‘‘ఓయీ మూర్ఖుడా! నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఇంతటి పనికిమాలిన ముఖాన్ని నేను ఇంతవరకూ చూడనే లేదు’’ అన్నాడా గురువు. 

అలాంటి మాటలు వింటే సామాన్యులకే ఎంతో కోపం వస్తుంది. అంతమంది ప్రజల మధ్య, తన పరివారం ఎదుట తన గురించి అలాంటి మాటలు విన్నప్పుడు చక్రవర్తికి కోపం రాకుండా ఉంటుందా? చక్రవర్తి ఆగ్రహంతో పళ్ళు కొరుకుతూ, తన ఒరలో కత్తిని తీసి ఆ గురువు తల నరకడానికి చెయ్యి పైకెత్తాడు. 


చక్రవర్తి కళ్ళలోకి గురువు సూటిగా చూస్తూ ‘‘ఆగు!’’ అని అరిచాడు. 

ఆయన మాటల్లో ఎలాంటి శక్తి ఉందో కానీ, చక్రవర్తి ఎత్తిన చెయ్యి స్తంభించిపోయింది.

‘‘అదిగో, అదే నరకం అంటే!’’ అన్నాడు గురువు.

కోపంతో ఊగిపోతూ, రక్తం మరిగిపోతున్నట్టున్న తన స్థితిని చక్రవర్తి గమనించుకున్నాడు. గురువు వైపు చూశాడు. గురువు ముఖంలో కదులుతున్న చిరునవ్వు చక్రవర్తిలో మార్పు తెచ్చింది. అతనిలో ఒక విధమైన ప్రశాంతత ఆవరించింది. తన చేతిలోని ఖడ్గాన్ని అవతల పారేసి, గురువు పాదాల మీద పడ్డాడు చక్రవర్తి. అతని భుజాలమీద తన చేతుల్ని ఉంచి, ‘‘స్వర్గం అంటే ఇదే! 

👉స్వర్గం, నరకం అనేవి ఎక్కడో లేవు. పక్క పక్కనే... మనలోనే ఉన్నాయి. మీరు ఒక్క క్షణంలోనే స్వర్గాన్నీ, నరకాన్నీ అనుభవించారు. మీ ప్రశ్నకు సమాధానం గ్రహించారు కదా!’’ అన్నాడు గురువు నవ్వుతూ.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺