జవాబు: చలికాలంలో చాలా దేశాల్లో సరస్సులు గడ్డ కడతాయి. అయితే గడ్డ కట్టిన భాగం పైనే ఉంటుంది. కానీ సరస్సు అడుగు భాగంలో నీరు గడ్డకట్టకుండానే ద్రవస్థితిలో ఉంటుంది. ఇందుకు కారణం నీటికున్న అసంబద్ధ (anomolous)లక్షణమే. నీటి సాంద్రత, మంచు సాంద్రత కన్నా ఎక్కువ. ఇలా ద్రవస్థితిలో ఎక్కువ సాంద్రత, ఘనస్థితిలో తక్కువ సాంద్రత ఉండటం వల్లే మంచు గడ్డలు నీటిపైన తేలుతాయి.
అంతే కాదు ఇలాంటి పదార్థాల మీద బరువు పెట్టినట్టయితే వాటికి ఘనీభవనస్థానం మామూలు కన్నా తక్కువ అవుతుంది. సరస్సుల్లో గడ్డ కట్టిన ఐసు గడ్డలు బరువులాగా ఉండటం వల్ల కిందున్న నీరు అల్ప ఉష్ణోగ్రత ఉన్నా ఘనీభవించకుండా ద్రవ రూపంలో ఉంటుంది. కాబట్టి జలచరాలు యాథావిధిగా సంచరిస్తూ జీవన కార్య కలాపాలు సాగించగలవు. కిందున్న నీటిలో జంతుజాతులతో పాటు వృక్ష జాతులయిన నాచు, ప్లాంక్టిన్, క్లామిడోమోనాస్, యుగ్లీనా వంటి సూక్ష్మ హరిత జీవులు ఉంటాయి. అవి కిరణజన్య సంయోగ క్రియలో విడుదల చేసే ఆక్సిజన్ జీవులకు సరిపోతుంది. పైగా అక్కడక్కడా మంచు గడ్డల చీలికల్లోంచి వాతావరణంలోని ఆక్సిజన్ అందుతుంది.
Comments
Post a Comment