Skip to main content

కరెంట్ అఫైర్స్ బిట్స్ - JULY 2021

1.కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి? (సి)✅

1.తాజా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో అన్ని దేశాలు తిరోగమించాయి

2.ఈ సూచీలో అగ్రస్థానంలో స్వీడన్‌ ఉంది

3.ఈ సూచీలో ఫిన్‌లాండ్‌ అగ్రస్థానంలో ఉంది

4.భారత్‌ 120వ స్థానంలో ఉంది

ఎ) 1, 4 బి) 1, 2, 4
సి) 1, 3, 4 డి) 2, 4

వివరణ: సుస్థిరాభివృద్ధి సూచీని సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌వర్క్‌ విడుదల చేసింది. భారత్‌ 60.1 స్కోర్‌ను సాధించి ఈ జాబితాలో 120వ స్థానంలో ఉంది. మొత్తం 165 దేశాలకు ఆ సంస్థ ర్యాంకింగ్‌ ఇచ్చింది. 2015 నుంచి ఈ సూచీకి సంబంధించి ర్యాంక్‌లు ఇస్తుండగా తొలిసారి అన్ని దేశాలు తిరోగమనాన్ని చూపాయి. కొవిడ్‌ కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఫిన్‌లాండ్‌ ఉంది. 2, 3 స్థానాల్లో వరుసగా స్వీడన్‌, డెన్మార్క్‌లు నిలిచాయి.

2.ఎన్‌ఐఎస్‌హెచ్‌టీహెచ్‌ఏ (నిష్తా) అనేది ఒక? (ఎ)✅

ఎ) ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం
బి) కొత్త సాఫ్ట్‌వేర్‌ సి) కరోనా పరీక్ష విధానం
డి) ఏదీకాదు

వివరణ: ఎన్‌ఐఎస్‌హెచ్‌టీహెచ్‌ఏ (నిష్తా) అంటే నేషనల్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ స్కూల్స్‌ హెడ్స్‌ అండ్‌ టీచర్స్‌ హోలిస్టిక్‌ అడ్వాన్స్‌మెంట్‌. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు సమీకృత శిక్షణ ఇస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం. 2019-20లో దీనిని ప్రారంభించారు. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. ఇటీవల గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు సామర్థ్య పెంపునకు ఒక అవగాహన కుదిరింది.

3.‘పుస సాంబ 1850 ఇటీవల’ వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (సి)✅

ఎ) కరోనాను వేగంగా గుర్తించే పరీక్ష
బి) కొత్త వేరియంట్‌
సి) కొత్త బియ్యపు రకం డి) ఏదీకాదు

వివరణ: పుస సాంబ 1850 పేరుతో కొత్త బియ్యపు రకాన్ని ఇండియన్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసింది. సాంబ మసూరీని మరింతగా వృద్ధి చేసి ఈ కొత్త రకాన్ని అందుబాటులోకి తెచ్చారు. అధికంగా దిగుబడి రావడంతో పాటు ఎలాంటి క్రిమి సంహారకాలు వినియోగించాల్సిన అవసరం ఈ పంటకు లేదు. దీనిని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, బీహార్‌ రాష్ర్టాల్లో పండిస్తున్నారు.

4.ప్రపంచంలో అతి ఎక్కువ మంది శరణార్థులను కలిగి ఉన్న దేశం? (డి)✅

ఎ) బంగ్లాదేశ్‌ బి) సిరియా
సి) ఆఫ్ఘనిస్తాన్‌ డి) టర్కీ

వివరణ: ప్రపంచంలో అతి ఎక్కువ మంది శరణార్థులు టర్కీ దేశంలో ఉన్నారు. యునైటెడ్‌ నేషన్స్‌ హై కమిషనర్‌ ఫర్‌ రిఫ్యూజీస్‌ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. 2020లో ప్రపంచ వ్యాప్తంగా 82.4 మిలియన్‌ ప్రజలు శరణార్థులుగా ఉన్నారు. ప్రపంచంలో అతిపెద్ద శరణార్థుల శిబిరం కుతుపలాంగ్‌. ఇది బంగ్లాదేశ్‌లో ఉంది. ఏటా జూన్‌ 20న ప్రపంచ శరణార్థుల రోజుగా నిర్వహిస్తారు. 1951లో ఐక్యరాజ్యసమితిలో ఒక సమావేశం నిర్వహించారు. ఇది రిఫ్యూజీస్‌కు లేదా శరణార్థులకు సంబంధించింది. ఈ సమావేశం జరిగిన 50 సంవత్సరాల తర్వాత జూన్‌ 20న వరల్డ్‌ రిఫ్యూజీ డేగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఇతివృత్తం-టుగెదర్‌ ఉయ్‌ హీల్‌, లెర్న్‌, అండ్‌ షైన్‌.

5.‘ది రేస్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ అనేది ఏ క్రీడాకారుడి ఆత్మకథ? (బి)✅

ఎ) అయూబ్‌ ఖాన్‌ బి) మిల్కాసింగ్‌
సి) రొనాల్డో డి) పీటర్‌

వివరణ: ‘ది రేస్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ అనేది మిల్కాసింగ్‌ ఆత్మకథ. ఆయన స్ప్రింట్‌ దిగ్గజం. ఇటీవల మృతిచెందారు. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగులో త్రుటిలో పతకాన్ని కోల్పోయారు. తుదిపోరులో ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. 1956, 1964 ఒలింపిక్స్‌ పోటీల్లో కూడా ఆయన భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించారు. ఫ్లయింగ్‌ సిఖ్‌గా ఆయనకు పేరు ఉంది. 1959లో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. మిల్కాసింగ్‌ గోవిందపూర్‌ అనే గ్రామంలో జన్మించారు. ఇప్పుడు ఆ ప్రాంతం పాకిస్థాన్‌లో ఉంది.

6.కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి? (సి)✅

1.ఓపెన్‌ సొసైటీ ప్రైజ్‌ను గెలుచుకుంది కేకే శైలజ

2.యునైటెడ్‌ నేషన్స్‌ ల్యాండ్‌ ఫర్‌ లైఫ్‌-2021 ప్రైజ్‌ను రాజేశ్వర్‌ పాఠక్‌ దక్కించుకున్నారు

3.యునైటెడ్‌ నేషన్స్‌ ల్యాండ్‌ ఫర్‌ లైఫ్‌-2021 ప్రైజ్‌ను శ్యాం సుందర్‌ జైనీ దక్కించుకున్నారు

4.పై వాక్యాల్లో సరైనది

ఎ) 1 బి) 1, 2 సి) 1, 3 డి) 3

వివరణ: ప్రజా ఆరోగ్య కార్యక్రమాల్లో విశేష సేవలు అందించినందుకుగాను సెంట్రల్‌ యూరోపియన్‌ యూనివర్సిటీ ‘ఓపెన్‌ సొసైటీ ప్రైజ్‌’ను కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి శైలజకు ఇచ్చారు. కరోనా కట్టడికి సమర్థంగా చర్యలు తీసుకున్నందుకు ఆమెకు ఈ అవార్డ్‌ దక్కింది. అలాగే పర్యావరణవేత్త శ్యాం సుందర్‌ జైనీ ‘యునైటెడ్‌ నేషన్స్‌ ల్యాండ్‌ ఫర్‌ లైఫ్‌-2021 అవార్డ్‌’కు ఎంపికయ్యారు. ఫ్యామిలియన్‌ ఫారెస్ట్రీ అనే ఒక సామాజిక పథకాన్ని ప్రారంభించి రాజస్థాన్‌లో 2.5 మిలియన్‌ మొక్కలను నాటడంలో క్రియాశీలక పాత్ర పోషించినందుకు ఆయనకు ఈ అవార్డ్‌ లభించింది.
7.ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? (ఎ)✅

ఎ) రోమ్‌ బి) పారిస్‌
సి) నైరోబి డి) న్యూయార్క్‌

వివరణ: ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ ఇటలీలోని రోమ్‌ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థకు సంబంధించిన 42వ సమావేశం ఇటీవల వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించారు. ఈ సంస్థ తన సమావేశాలను రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుంది. తన విధానాలు, బడ్జెట్‌, ఆహార, వ్యవసాయ సంబంధ అంశాలపై నిర్ణయాలు ఈ సమావేశాల్లోనే తీసుకుంటారు. భారత వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఇందులో పాల్గొన్నారు. దేశంలో అమలవుతున్న పీఎం కిసాన్‌, కిసాన్‌ రైలు, ప్రధాన మంత్రి కృషి సించయ్‌ యోజన తదితర పథకాలను వివరించారు.

8.గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ ఏ దేశంలో ఉంది? (డి)✅

ఎ) దక్షిణాఫ్రికా బి) పెరూ
సి) అర్జెంటీనా డి) ఆస్ట్రేలియా

వివరణ: ప్రపంచంలోనే అతి పెద్దదైన గ్రేట్‌ బారియర్‌ పగడపు దీవి లేదా గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ ఆస్ట్రేలియాలో ఉంది. దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ‘ప్రమాదంలో ఉన్న’ విభాగంలో చేర్చాలని ఇటీవల యునెస్కో సూచించింది. పగడాల సంఖ్య తగ్గడమే దీనికి కారణం. ప్రస్తుతం ఈ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా 53 ప్రదేశాలు ఉన్నాయి. కార్బన్‌ ఉద్గారాల కట్టడిలో ఆస్ట్రేలియా తీరువల్లే ఈ పరిస్థితి వచ్చిందని పర్యావరణవేత్తల ఆరోపణ. ఈ దీవుల వల్ల ఏటా ఆ దేశం నాలుగు మిలియన్‌ అమెరికన్‌ డాలర్లను ఆర్జిస్తుంది. పర్యాటక నగదుగా దీనిని చెప్పొచ్చు. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో దీనిని 1981లో చేర్చారు.


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺