ఒక్కొక్కరికి ఒక్కో ఎమోషన్..
కొందరి.. జీవితాల్లో. హీరో అయితే
ఇంకొందరి..జీవితాల్లో..విలన్..
ఒకడి జీవితంలో..దేవుడు.
ఇంకొడీ జీవితంలో దయ్యం..
ఒకడికి కష్టం ఇంకొడికి ...నష్టం.
ఒకడికి..దైర్యం. ఇంకోడికి..భయం..
చిన్నప్పుడు నాన్నల ఆసలు..అవ్వకూడదు ..
అనుకుంటాం..కానీ మళ్ళీ నాన్నలానే.. ఆలోచిస్తాం..
కొందరి.. జీవితాల్లో.. నాన్న అనే బంధం.. గొప్పది..
కానీ ఆ బంధానికి..విలువ ..లేకుండా చేసుకున్న వాల్లే ఎక్కువ లోకంలో
ఒకడి..జీవితం బాగుపడాలన్న.. (spoil) అవ్వడానికి..కారణం..నాన్నే..
పోలేరమ్మ జాతరవ్వాలన్న...నాన్నే కారణం..
ఎంత సేపు మీ చెప్పు చేతల్లో.. చెప్పుకునే స్టేజ్ లో ఉండాలి.
చెప్పి వెళ్లాలి చెప్పులేసుకోని..వెళ్లాలి..అనే.. ఆలోచనల్ని పక్కన పెట్టి
కొంచం టైం ఇవ్వండి..
తప్పు చేస్తే సరిదిద్దుకునే టైం ..ఇవ్వండి.
కొడుకంటే..కట్నాలు కానుకలు.. లేదా కార్పొరేట్.. జాబ్
ఇది కాదు మిడిల్ ..class అబ్బాయి
నీ కొడుకు వెనకాల....చీకటి కోణం..
వాడి
ప్రతీ బాధ్యత వెనక
చంపుకున్న లక్ష్యం ఒకటుంటుంది.
వాడి
ప్రతీ చిక్కటి నవ్వు వెనక
చీకటి గాయం ఒకటుంటుంది
వాడి
కాలుస్తున్న ప్రతీ సిగరెట్ వెనక
లోపల వాన్ని కాలుస్తున్న సమస్య ఒకటుంటుంది (గుర్తించండి)
వాడి
ప్రతీ ఖర్చు వెనక
చంపుకున్న ఆనందం ఒకటుంటుంది( గమనించండి)
వాడి
ప్రతీ కోరిక వెనక
గతం తాలూకు సంబరం ఒకటుంటుంది
వాడి కలల్లో కూడా compramise అయ్యే
కటిక ధనవంతుడు నాన్న.
నీ కొడుకు..
Comments
Post a Comment