Skip to main content

కుతుబ్‌షాహీల పరిపాలన వ్యవస్థ

👉 కేంద్రప్రభుత్వం

రాజు/సుల్తాన్‌: ఆ కాలపు రాజ్యాలన్నిటిలాగానే గోల్కొండ కూడా రాచరికపు పద్ధతినే అనుసరించింది. సుల్తాన్‌ రాజ్యపు సర్వాధికారి. అయితే ఉదారుడు, నీతిమంతుడుగా ఉండాలని మతగ్రంథాలు ఆదేశిస్తాయి. రాజు దైవాంశ సంభూతుడని హిందూ శాస్ర్తాలు
ఘోషిస్తున్నాయి.

అలాంటి భావనే పాశ్చాత్యులకూ ఉండేది. మహమ్మదీయులూ సుల్తానుకు ప్రజలకు పాలించే దైవికమైన హక్కు ఉందని భావిస్తారు. తమను ‘జిల్లుల్లా’గా భావించుకునేవారు. అంటే వారు దైవానికి ప్రతిరూపాలు. ఈ విశేషణాన్ని సుల్తాన్‌ మహమ్మద్‌ తన కవితానామముద్రగా ఉపయోగించుకున్నాడు.

హైదరాబాద్‌ సమీపాన ఓ గ్రామాన్ని జిల్లుల్లాగూడగా కూడా పిలుచుకున్నాడు. కుతుబ్‌షా సుల్తానుల జీవనశైలి గొప్పగా ఉండేది. అతడెప్పుడో అరుదుగా కానీ తన మందిరాలను వదిలి బయటకు రాడు. బయటకు వచ్చినప్పుడు ఏర్పాట్లు ఎంతో దర్పాన్ని ప్రదర్శించేటట్లుగా ఉంటాయి.
పాలించే సుల్తాన్‌ మరణించిన వెంటనే అధికజాప్యం జరగకుండా కొత్త సుల్తానును ప్రకటించడం జరిగేది. అందువల్ల దైనందిన పరిపాలన కుంటుపడకుండా ఉండటమే కాక, అవాంఛనీయ పరిస్థితులకు అవకాశం కల్పించకుండా ఉండటం జరుగుతుంది. అయితే ఇబ్రహీం కుతుబ్‌షా మరణం తర్వాత పదిహేనేండ్లు కూడా నిండని మహమ్మద్‌ కులీకుతుబ్‌ షాకు పట్టం కట్టడానికి కారణం దర్బారు కుట్రలే అంటారు చరిత్రకారులు.

అధికారం కోసం పడే తపన వల్ల హత్యలు జరిగి రక్తపుటేరులు ప్రవహిస్తాయి. ఆ కాలంలో ఇది సామాన్య విషయమే. సింహానం అధిష్టించే సమయంలో పొరుగురాజులు స్నేహపూర్వకంగా తమ దూతలను పంపుతారు. సుల్తాన్‌ కులీ హత్య తర్వాత జంషీద్‌ పాలకుడైనప్పుడు తనను అభినందించిన ఒకే ఒక్క దక్కనీ సుల్తాన్‌ నిజాంషాహీ బుర్హాన్‌ నిజాం షా. అతడు తన ప్రతినిధిగా ‘షా తాహీర్‌’ను గోల్కొండకు పంపాడు.

ఆ తర్వాత జంషీద్‌ ఇబ్రహీంలు బీజాపూర్‌పై కంటే అహ్మద్‌ నగర్‌ పట్ల మొగ్గు చూపడానికి అది నాంది అయ్యింది. పట్టాభిషేకం కోసం కొలువుదీరిన దర్బారుకు రాజ్యంలోని ప్రముఖులు, పౌర, సైనిక అధికారులు హాజరవుతారు. నగరంలో ఏనుగులపై, ఒంటెలపై తిరుగుతూ సందేశ వాహకులు ఎలుగెత్తి కొత్త సుల్తాన్‌ పేరును ప్రకటిస్తారు.

కుతుబ్‌షాహీల దర్బారులు ఎంతో విలాసంగా అలంకరించి ఉండేవి. సుల్తాన్‌ కులీ జీవితకాలంలో దర్బార్‌ నిరాడంబరంగా ఉండేది. ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో ఓ పెద్ద దర్బార్‌ ‘దౌలత్‌ ఖానా అలీ’ని నిర్మించారు. అది 200 అడుగుల పొడవు ఉండేది. దానిచుట్టూ ఎన్నో స్తంభాలు, కమానులు ఉండేవి. దాని ప్రవేశ ద్వారం హిందూశైలి నిర్మాణంతో ఉండేది. దాని ఎత్తు 20 గజాలుండేది. దాని ఉపనిర్మాణం పెద్ద స్తంభాలపై నిలబడి ఉండేది. ఈ హాలు పక్కన సచివాలయం ఉండేది. హైదరాబాద్‌ నగర నిర్మాణం జరిగి దాద్‌ మహల్‌, ఖుదాదాద్‌ మహల్‌ లాంటి అద్భుత కట్టడాలు వెలిశాక, అక్కడ కూడా దర్బార్‌ జరిగేది. సుల్తాన్‌, మంత్రులు, పండితులతో సలహాసంప్రదింపులు జరిపే సభా భవనాలు కూడా ఉండేవి.
అబ్దుల్లా కుతుబ్‌ షా కాలంలో ఆరు తరఫ్‌లుండేవి డచ్‌ కంపెనీ రికార్డుల వల్ల రాష్ర్టాల పాలకులు 1630 తర్వాత తరఫ్‌దార్‌లు సుల్తాన్‌ ఆదేశాలను ధిక్కరించారని, ఫర్మానాలు సరిగ్గా అమలు చేయలేదని, కేంద్ర ఆదేశాలను లెక్కచేయలేదని, మచిలీపట్నం సిమ్త్‌ అధికారి సుల్తాన్‌ పంపిన కానుకలను, వస్ర్తాలను తిరిగి సుల్తాన్‌కే పంపి, ఫర్మానాలను అమలు చేయలేదని, హైదరాబాద్‌కు రావాల్సిందిగా సుల్తాన్‌ ఆదేశించగా, దాన్ని బేఖాతర్‌ చేశాడని పేర్కొన్నాడు. బెల్లంకొండ, వినుకొండ, కొండపల్లి, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం లాంటి 22 సిమ్త్‌ లేదా సీమలు వీరి రాజ్యంలో ఉన్నాయని సమకాలీన చరిత్రకారులు పేర్కొన్నారు.

అబుల్‌ హసన్‌ తానీషా కాలంలో మొత్తం 37 సర్కారులు, 517 పరగణాలు ఉండేవని తెలుస్తుంది. రేవు పట్టణంలో ఉన్నతాధికారిని ‘షాబందర్‌’ అనేవారు. భూమిశిస్తు వసూలు అధికారాన్ని వేలం పాటలో అందరి కంటే ఎక్కువ డబ్బు చెల్లించడానికి సిద్ధపడినవారికే ఇచ్చేవారు. ఈ రకమైన హక్కులను కొన్నవారిని ‘ముస్తజీర్లు’ అనేవారు. ముస్తజీర్లుగా హిందువులనే ఎక్కువ సంఖ్యలో నియమించారు.

👉 స్థానిక పాలన

పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ర్టాలను సర్కార్‌లుగా విభజించారు. వీరి అనేక ఫర్మానాల్లో దేశ్‌పాండే, తానేదార్‌, దేశ్‌ముఖ్‌ మొదలైన రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల పేర్లు ప్రస్తావించారు. వీరికాలంలో గ్రామమే పరిపాలనా వ్యవస్థకు తొలిమెట్టు. గ్రామస్థాయిలో పెద్ద మఖుద్దమ్‌. కులకర్ణి గ్రామ అకౌంటెంట్‌. దేశ్‌పాండే పరగణ స్థాయి అకౌంట్స్‌ అధికారి.

👉 పాలక మండలి/మజ్లిస్‌ దివాన్‌దారీ/మజ్లిసెఖాన్‌

మొదట్లో సుల్తాన్‌ క్లిష్ట సమయంలో తన ఇష్టులు, సమర్థులు అనుకున్న అమీరులతో సంప్రదింపులు జరిపేవాడు. ఆ తర్వాత అది ఓ పాలక మండలి ఏర్పాటుకు దోహదపడింది. ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలోని సలహామండలిని ‘మజ్లిసె-కింగాష్‌’ అనేవారు. అత్యవసర విషయాల్లో నిర్ణయం తీసుకోడానికే సుల్తాన్‌ ఆ మండలిని సమావేశపరిచేవాడు.

అబ్దుల్లా కుతుబ్‌ షా కాలంలో ‘మజ్లిస్‌-ఇ-దివాన్‌-దారీ’ పరిపూర్ణత సాధించి కొందరిని సుల్తాన్‌ రాయబారులుగా నియమించేవాడు. యూసఫ్‌షా అనే సభ్యుడు ‘ఐన్‌-ఉల్‌-ముల్క్‌’ సైనిక వ్యవహారాలు నిర్వహించే మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తర్వాతి కాలంలో ఇతడు మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ దర్బార్‌లో కుతుబ్‌షాహీ దూతగా పనిచేశాడు. కేంద్రప్రభుత్వంలో పీష్వా ఐన్‌-ఉల్‌-ముల్క్‌, మీర్‌ జుమ్లా మొదలైనవారు విశేషాధికారాలుగలవారు.

👉 పీష్వా/వకీల్‌/ప్రధానమంత్రి

గోల్కొండ రాజ్యంలో సుల్తాన్‌ తర్వాత శక్తిమంతమైన మంత్రి పీష్వా లేదా దివాన్‌. ఇతడు సుల్తాన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడై ఉండేవాడు. మేధావి, పరిపాలనా వ్యవహారాల్లో పూర్తి అనుభవం ఉన్న వ్యక్తులనే ఈ ఉన్నత పదవిలో సుల్తాన్‌ నియమించేవాడు. గోల్కొండ రాజ్య పీష్వాలుగా పనిచేసినవారిలో ‘ముస్తాఫాఖాన్‌ అర్బిస్తానీ (ఇబ్రహీం కుతుబ్‌షా కాలం), షేక్‌ మహమ్మద్‌ ఇబ్నేఖాతూన్‌ (అబ్దుల్లా కుతుబ్‌షా కాలం)లు విశేష గౌరవం పొందారు. పీష్వా జీతం 12 వేల హొన్నులు. చివరి గోల్కొండ సుల్తాన్‌ అబుల్‌ హసన్‌ తానీషా కాలం నాటి పీష్వా పదవి ‘దివాన్‌’గా మారింది. ‘మాదన్న’ చివరి గోల్కొండ సుల్తాన్‌ దివాన్‌గా బాధ్యతలు నిర్వహించాడు.

పీష్వా తన హోదాకు తగినట్లుగా సువిశాల భవనంలో విలాసవంతమైన జీవితం గడిపేవాడు. అతని కింద అనేకమంది ఉద్యోగులు, అధికారులు, దాసీజనం పనిచేసేవారు. పీష్వా సలహాలను సుల్తాన్‌ గౌరవించేవాడు. పీష్వా సుల్తాన్‌ పేరున రాచవ్యవహారాలు చక్కబెట్టడమే కాక, పండితులు, కవులు, అమీరులతో పరివేష్టించి ఉండేవాడు. రాజ్యంలో వారపు సెలవుదినం మంగళవారం.
🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺