Skip to main content

చరిత్రలో ఈ రోజు జులై / - 21

🔎సంఘటనలు🔍

🌸0356 బి.సి. : హెరోస్ట్రేటస్ అనే యువకుడు, ప్రపంచపు 7 వింతలలో ఒకటైన, ఎఫెసిస్ లో ఉన్న ఆర్టెమిస్ ఆలయానికి, నిప్పు పెట్టాడు.

🌸1588: స్పానిష్ ఆర్మడాని ఇంగ్లీష్ వారి నౌకాదళం ఓడించింది.

🌸1667: బ్రేడా సంధి జరిగింది. దీనివలన రెండావ ఆంగ్లేయులు-డచ్చిదేశస్తుల మధ్య జరిగిన రెండవ యుద్ధం అంతమైంది.

🌸1718: పస్సరోవిట్జ్ సంధి, ఒట్టోమన్ సామ్రాజ్యానికి, ఆస్ట్రియాకి, రిపబ్లిక్ ఆఫ్ వెనిస్ కి మధ్య జరిగింది.

🌸1831: నెదర్లాండ్ నుంచి బెల్జియమ్ స్వాతంత్ర్యం పొందింది. లియోపోల్డ్ I రాజు అయ్యాడు.

🌸1873: అయోవా (పశ్చిమ అమెరికా) రాష్ట్రంలోని అడేర్ దగ్గర జెస్సె జేమ్స్, జేమ్స్ యంగర్ ముఠా మొదటిసారిగా రైలు దోపిడీ చేసారు.

🌸1904: కేమిల్లె జెనాట్జీ కారుని గంటకు 65.79 మైళ్ళ వేగంతో ప్రయాణించి, ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

🌸1931: సి.బి.ఎస్. టెలివిజన్ చానెల్, అమెరికా లో, తన 7 రోజుల రోజు వారీ ప్రసారాలను, క్రమం తప్పకుండా ప్రసారం చేయటం మొదలుపెట్టింది.

🌸1934: గల్లిపొలిస్ (అమెరికాలోని ఓహియో రాష్ట్రం) లో 113 డిగ్రీల ఫారెన్‌హీట్ (45 డిగ్రీల సెంటిగ్రేడ్). ఇది ఓహియోరాష్ట్రంలో నమోదు అయిన రికార్డు.

🌸1940: ఎస్తోనియా, లాత్వియా, లిథూనియా దేశాలను, సోవియట్ యూనియన్, తనలో కలిపి వేసుకుంది.

🌸1944: జపాన్ ఆక్రమించిన 'గువామ్' అనే ప్రాంతాన్ని, అమెరికన్ దళాలు విడిపించాయి. (రెండవ ప్రపంచ యుద్ధం).

🌸1949: అమెరికన్ సెనేట్ నార్త్ అట్లాంటిక్ సంధిని (నాటో)ని82-13 ఓట్లతో రద్దు చేసింది.

🌸1954: జెనీవా సమావేశంలో వియత్నాం దేశాన్ని, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం దేశాలుగా విడదీసారు.

🌸1954: ఫ్రాన్స్, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం దేశాలకు స్వాతంత్ర్యం ఇచ్చుటకు, జెనీవాలో ఒప్పుకున్నది.

🌸1959: ప్రపంచంలో మొట్టమొదటిగా అణుశక్తితో నడిచే వాణిజ్య నౌక 'సవన్నా' జల ప్రవేశం చేసింది.

🌸1960: సిరిమావొ బండారునాయకె, శ్రీలంక (నాటి సిలోన్) ప్రధాన మంత్రి (ణి) గా పదవిని చేపట్టి, ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానిగా, మొదటి మహిళా దేశాధినేత్రిగా గుర్తింపు పొందింది. (1960 జూలై 20 అని కూడా అంటారు)

🌸1960: అఫ్రికాలో కటం(తం)గా దేశంగా ఆవిర్భవించింది.

🌸1961: మెర్క్యురీ 4 (మెర్క్యురీ - రెడ్‌స్టోన్ 4 మిషన్) అనే రోదసీ నౌకను (లిబర్టీ బెల్ 7) గుస్ గ్రిస్సాం (రోదసీ యాత్రికుడు) తో అమెరికా ఆకాశంలోకి పంపింది. ఇతడు రోదసీలోకి వెళ్ళిన రెండవ అమెరికన్( సబ్-ఆర్బిటల్ మిషన్ అంటే రోదసీ లోనే తక్కువ ఎత్తులో, కక్ష్యలో, ప్రయాణించటం). (మెర్క్యురీ ప్రోగ్రాం)

🌸1965: పాకిస్తాన్, ఇరాన్, టర్కీ దేశాలు ప్రాంతీయ సహకార సంధిని చేసుకున్నాయి.

🌸1978: ప్రపంచంలోనే అత్యంత బలమైన, 80 కె.జి. ల బరువున్న, 'సెయింట్ బెర్నార్డ్' జాతికి చెందిన కుక్క, 2909 కే.జి.ల బరువును 27 మీటర్ల దూరం లాగింది. ఈ జాతి కుక్కల గురించిన చరిత్ర, కధలు చదవండి.

🌸1980: జీన్ క్లాడ్ డ్రోయెర్, పారిస్ లోని ఈపిల్ టవర్ని 2గంటల 18 నిమిషాలలో ఎక్కాడు.

🌸1983: పోలిష్ ప్రభుత్వం 19 నెలల మార్షల్ లాని ఎత్తివేసింది.

🌸1983: ప్రపంచంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత వోస్తోక్ స్టేషను, అంటార్క్‌టికా ఖండంలో (-89.2 డిగ్రీల సెంటిగ్రేడ్ -128.6 డిగ్రీల ఫారెన్ హీట్) రికార్డ్ అయ్యింది.

🌸1984: తూర్పు జర్మనీకి చెందిన 'మారిటా కోచ్' 200 మీటర్లను 21.71 సెకండ్లలో సాధించి మహిళల ప్రపంచ రికార్డును నెలకొల్పింది.

🌸1988: ఏరియేన్ -3 రాకెట్ ద్వారా 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను పంపారు. అందులో ఒకటి భారత దేశానికి చెందినది.

🌸1990: తూర్పు బెర్లిన్లో బెర్లిన్ గోడని తీసివేసినందుకు ఆనందంగా రాక్ కన్సర్ట్, 1,50,000 మంది ఒక పండుగలా జరుపుకున్నారు.

🌸2005: లండన్లో బాంబు పేలుళ్ళు. అంతకు ముందు జూలై 7 న కూడా బాంబు పేలుళ్ళు జరిగాయి.

🌸2007: జె.కె. రౌలింగ్ రాసిన హారీ పాటర్ వరుస నవలలో చివరిదైన హారీ పాటర్ అండ్ ది డెత్లో హాలోస్ విడుదలైంది.

🌼జననాలు🌼

💝1899: ఎర్నెస్ట్ హెమింగ్వే, అమెరికన్ నవలా రచయిత. నోబెల్ బహుమతి గ్రహీత

💝1923: పోణంగి శ్రీరామ అప్పారావు, నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (మ.2005)

💝1940: శంకర్ సిన్హ్ వాఘేలా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.

💝1947: చేతన్ చౌహాన్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

💝1961: అమర్ సింగ్ చంకీలా, పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు.(మ.1988)

💝1966: అనురాధ (నటి), తెలుగు నృత్యతార, సుమారు 35 చిత్రాలలో నటించింది.

💝1969: పసునూరు శ్రీధర్ బాబు, పాత్రికేయుడు, కవి.
💐మరణాలు💐

🍁1796: రాబర్ట్ బర్న్స్, స్కాటిష్ కవి.

🍁1948: అర్షిలె గోర్కీ, అబ్‌స్ట్రాక్ట్ ఎక్ష్‌ప్రెషనిస్ట్, 43వ ఏట.

🍁1957: బెర్నార్డ్ స్పూనర్, అమెరికాలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్నువ్యక్తి.

🍁1998: అలాన్ షెపార్డ్, అమెరికాకు చెందిన మొదటి రోదసీ యాత్రికుడు. అపొలో-14 రోదసీ నౌకను నడిపి చంద్రుడిని చేరి, చంద్రుడి మీద నడిచిన 5వ మనిషి.

🍁2009: గంగూబాయ్ హంగళ్, హిందుస్తాని గాయని, పద్మభూషణ్, పద్మవిభూషణ్ గ్రహీత.

🍁2013: గిడుగు రాజేశ్వరరావు, తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (జ.1932)

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉 1831 : బెల్జియం జాతీయ దినోత్సవము.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

TET- PSYCHOLOGY REVISION BITS PART - 2

101. ప్రజ్ఞ అంటే? — సమస్య పరిష్కార సామర్థ్యం   102. ప్రజ్ఞను తీర్పు శక్తిగా నిర్వచించినవాడు? — బినెట్   103. వ్యక్తిత్వం అంటే? — సమగ్ర లక్షణాల సమాహారం   104. Trait Theory ఎవరిది? — ఆల్పోర్ట్   105. 16 Personality Factors ఎవరిది? — క్యాటెల్   106. Introvert ఎవరు? — ఒంటరిగా ఉండేవాడు   107. Extrovert ఎవరు? — సమాజంలో కలిసేవాడు   108. Ambivert అంటే? — రెండు లక్షణాల సమ్మేళనం   109. Learningను ప్రభావితం చేసేది? — ఆసక్తి   110. Behaviourను ప్రభావితం చేసేది? — వైఖరి   111. అభిరుచి అంటే? — ప్రత్యేక ఆకర్షణ   112. Aptitude ఏమి సూచిస్తుంది? — భవిష్యత్ విజయం   113. Achievement Test ఏమి కొలుస్తుంది? — నేర్చుకున్నది   114. Aptitude Test ఏమి కొలుస్తుంది? — భవిష్యత్ సామర్థ్యం   115. Personality Test ఏమి కొలుస్తుంది? — వ్యక్తిత్వం   116. Inkblot Test ఎవరిది? — రోర్షాక్   117. TAT రూపొందించినవాడు? — ముర్రే   118. Creativity ప్రధాన లక్షణం? ...

TET special ప్రజ్ఞా లబ్ది మరియు శిశు వికాస సిద్ధాంతాలపై పూర్తి వివరణ మరియు ప్రాక్టీస్ బిట్స్...

శిశు వికాస సిద్ధాంతాలు & ప్రతిపాదకులు (Child Development Theories & Founders) విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు: ఎడ్వర్డ్ లీ థోర్న్‌డైక్ (Edward L. Thorndike) ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు: విలియం జేమ్స్ (William James) ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు: విల్హెల్మ్ వుండ్ట్ (Wilhelm Wundt) మానసిక విశ్లేషణ సిద్ధాంతం (Psychoanalytic Theory): సిగ్మండ్ ఫ్రాయిడ్ (Sigmund Freud) ప్రముఖ వికాస సిద్ధాంతాలు సంగ్రహణాత్మక వికాస సిద్ధాంతం (Cognitive Development Theory) ప్రతిపాదకుడు: జీన్ పియాజే (Jean Piaget) వికాస దశలు జ్ఞానేంద్రియ చలన దశ (0-2 సంవత్సరాలు) పూర్వ కార్యాచరణ దశ (2-7 సంవత్సరాలు) నిర్దిష్ట కార్యాచరణ దశ (7-11 సంవత్సరాలు) అమూర్త కార్యాచరణ దశ (11+ సంవత్సరాలు) సాంఘిక-సాంస్కృతిక వికాస సిద్ధాంతం ప్రతిపాదకుడు: లెవ్ వైగోట్‌స్కీ (Lev Vygotsky) ముఖ్య భావనలు Zone of Proximal Development (ZPD) Scaffolding (ఆధార బోధన) నైతిక వికాస సిద్ధాంతం ప్రతిపాదకుడు: లారెన్స్ కోల్‌బర్గ్ (Lawrence Kohlberg) స్థాయిలు పూర్వ సంప్రదాయ స్థాయి సంప్రదాయ స్థాయి అనంతర సంప్రదాయ స్థాయి మనోసాంఘిక వికాస సి...

త్వరలోనే అకౌంట్లోకి తల్లికి వందనం.. ఈ మూడు పనులు చేయకపోతే డబ్బులు కట్..

ప్రభుత్వం అలర్ట్ వచ్చే నెలలో నిధులను జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు లబ్దిదారుల జాబితా సిద్దం చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మూడు చేయకపోతే డబ్బులు కట్ ఒకటి తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. ఇక ఎన్‌పీసీఐ (Aadhaar Seeding) పూర్తయి ఉండాలి. ఇక మూడో విషయం బ్యాంక్ కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకుని ఉండాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి పెండింగ్‌లో ఉన్నా నిధులు పొందటంలో అవాంతరాలు ఎదురయ్యే అవకాశముంటుంది. దీంతో అన్నీ వివరాలు సరిగ్గా ఉండేలా అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. చాలామంది విద్యార్థుల వివరాలు ఎన్‌పీసీఐ లాగిన్‌లో తెరుచుకోవడం లేదు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రలు బ్యాంక్ ఖాతా వివరాలను విద్యార్థుల పేర్లతో నమోదు చేయించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సమాచారం అందించాలని సూచించింది. బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎన్‌పీసీఐ యాక్టివేషన్ కాకుంటే ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ తెరిపించాలని, దానికి ఎన్‌పీసీఐ లింకింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే జాబితా విడుదల త్వరలోనే తల్లికి వందనం అర్...