🌸జవాబు: ఊసరవెల్లి ఏకకాలంలో అన్ని వైపులా చూస్తుంది. ఎదురుగా ఆహారం కోసం వెతుకుతూనే.. వెనకనుంచి పొంచి ఉన్న శత్రువును పసిగట్టగలదు. ఇదెలా సాధ్యం.? దీనికేం ఒళ్లంతా కళ్లు ఉండవు.. మనలాగే రెండే ఉంటాయి . కానీ.. కనుగుడ్డు దేనికదే అటు ఇటు తిరుగు తుంది. ఒక కన్ను పైకి చూస్తుంటే, మరొకటి ఎదురుగా గానీ, కిందకు గానీ చూస్తూ ఉంటుంది. ఏదైనా ఆహారం, పురుగు దృష్టిలో పడినప్పుడు మాత్రం రెండు కళ్లు దాని మీదే చుపు కేంద్రీకరిస్తుంది.
మరో విశేషం...
ఊసరవెల్లిది బైనాక్యులర్ విజన్!
ఈ చూపుతో లక్ష్యన్ని సూటిగా గురిచూసి తన పొడవాటి నాలుకను బాణంలా విసురుతుంది. దీనికుండే జిగురుకు కీటకం అతుక్కుపోతుంది. మరుక్షణమే నోటిలోకి లాగేసుకుని గుటుక్కున మింగేస్తుంది.
Comments
Post a Comment