Skip to main content

నేటి మోటివేషన్... గ్లాసుడు నీళ్ళు (అనుశ్రుత గాథ)

🍁 ఒక సన్న్యాసి అదృష్ట వశాత్తూ భగవంతుడిని కలుసుకున్నాడు. భగవంతుడి చిరునవ్వు నవ్వి నీకేం కావాలి నాయనా అని అడిగాడు.

🍁 ఆ సన్న్యాసి నాకు సత్యాన్ని తెలుసుకోవాలని వుంది.సత్యాన్ని బోధించండి అన్నాడు. దానికి భగవంతుడు చూడు బాబూ!యిప్పుడు చాలా వేడిగా వుంది కదా ఒక గ్లాసుడు నీళ్ళు తెచ్చిపెట్టు.నీరు త్రాగి నీకు బోధిస్తాను అన్నాడు.

🍁 అక్కడికి దగ్గరగా గ్రామం కానీ,ఇళ్ళు కానీ లేవు. చాలా దూరం నడిచి వెళ్లి ఒక యిల్లు కనబడితే వెళ్లి తలుపు తట్టాడు.లోపలినుండి ఒక అందమైన కన్య వచ్చింది.

🍁 సన్నటి నడుము, కలువరేకుల్లాంటి కళ్ళు , చంద్రబింబం లాంటి ముఖం. అతను అంత అందమైన అమ్మాయిని అతను యింతవరకూ చూడలేదు.

🍁 అతని వైపు చూసి అందంగా చిరునవ్వు నవ్వింది. అలా నవ్వుతూ వుంటే యింకా అందంగా కనిపించింది. అంతే తాను వచ్చిన పని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. ఆ కన్య అంగీకారంగా తల వూచింది.

🍁 వారిద్దరూ వివాహం చేసుకున్నారు.రోజులు గడిచిపోతున్నాయి చాలా మంది పిల్లలు కలిగారు.ఎంతకాలం గడిచి పోయిందో వాళ్లకి తెలియనేలేదు.

🍁 ఇలా వుండగా ఒకరోజు పెద్ద గాలీ వాన ఒకటే ధార.ఊరూ వాడ ఏకమై పోయాయి. చెట్లు పడిపోయాయి, ఇళ్ళు కూలిపోయాయి. భార్యా పిల్లలతో అతడు ప్రవాహములో నడుచుకుంటూ పోతున్నాడు.

🍁 ప్రవాహం వేగంగా వుంది. ఎక్కడా గట్టు దొరకడం లేదు.అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు. 'భగవంతుడా రక్షించు' అని మొర పెట్టుకున్నాడు. భగవంతుడు అతడి మొర విని నేను అడిగిన గ్లాసుడు నీళ్లేవీ? అని అడిగాడు.

🍁 ప్రతిమానవుడు సత్యాన్వేషణ రేపో ఎల్లుండో చేద్దామని కాలం లో చిక్కుకుంటాడు. కాలం లో చిక్కుకొనినివసించడం అలవాటయి పోయింది. కాలం రెండు విధాలు

1.గడియారం సూచించే కాలమానం

 2.మనస్సు కల్పించే మానసిక కాలం.

🍁 నిన్న,ఈ రోజు,రేపు అనేవి మనస్సు నిర్మించిన. నిన్న జరిగిన సంఘటనలు యిప్పుడు లేవు. "నిన్న''గతించినట్లే అవి గతించాయి. కానీ ఆ సంఘటనలు జ్ఞాపకం చేసుకొని యిప్పుడు జరుగుతున్నట్టే భావించి ప్రవర్తించే వాళ్ళు చాలామంది వున్నారు. రేపు యింకా రాలేదు కానీ ఈ రోజున జరిగిన సంఘటనలు రేపు కూడా
జరుగుతాయేమోనని ఊహించుకొని భయపడే వాళ్ళూ చాలా మందే వున్నారు.

🍁 నిజానికి నిన్నా లేదు, రేపూ లేదు, వర్తమానమే ఎప్పుడూ వుండేది. మానసిక కాలమే మిథ్య.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups