అరటిపండును తొక్క తీసి తింటాం.
సపోటాను తొక్క తీసి, గుజ్జు తిని గింజ ఊసేస్తాం
మామిడిపండు తోలూ, గుజ్జు తిని, టెంక పారేస్తాం
సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తింటాం. పై చర్మం, లోపలి గింజలు వదిలేస్తాం.
యాపిల్ కండ తిని, వెన్ను వదిలేస్తాం జామ పండును మొత్తం తినేస్తాం ఒకదాన్లో టెంక మనకు అక్కర్లేదు ఇంకోదాన్లో గింజను కాదనుకుంటాం. మరోదాన్లో తోలు, ఇంకోటి తొక్క ఏ పండు తిన్నా, మనకు ఆరోగ్యమే.
ఒక్కోటి ఒక్కో రుచి తీపి, పులుపు, వగరు ఇందులోనే కాస్త తేడాలతో ఎన్నో రుచులు ! ప్రతిది మనకు ఇష్టమే. అయితే, పండును తింటున్నప్పుడు అందులో మనకు కావల్సిన మంచి గుర్తుంటుంది గానీ “చెడు' గుర్తుండదు
మనకు కావల్సింది తీసుకుని, అక్కర్లేనిది పారేస్తామంతే అలాగే, మనుషులు కూడా పండ్లలాంటివారే...
కుటుంబంలోని అందరూ ఒక్కోరకం వండు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్వభావం
*భార్యలా భర్త ఉండడు.
*తమ్ముడిలా అన్న ఉండకపోవచ్చు
*అమ్మ వేరుగా ఉంటుంది.
*నాన్న ఇంకోలా ఉంటాడు
*చెల్లికీ అక్కకూ పోలిక ఉండకపోవచ్చు అయితే, అందరూ పండ్లలాగే మనకు మంచి చేసేవాళ్లే.
కానీ మనిషి విషయంలో వాళ్లు చేసిన మంచికంటే, వాళ్లు చూపించిన కోపమో,
చిరాకో, ఆసహనమో,
విసుగో మనకు ఎక్కువ
గుర్తుంటుంది
పండులో మనకు అక్కర్లేని గింజ కూడా భాగమే అనుకుంటాం
కాబట్టి, దాన్ని ద్వేషించం.
ఆ పండులాగే కోపతాపాలు, ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం అని ఎందుకు అర్థం చేసుకోం!
ఇది గుర్తించగలిగితే, ఆ మనిషిని ద్వేషించకుండా సంపూర్ణంగా ప్రేమిస్తాం
◆ఎ మిక్సీడ్ బ్యాగ్ ఆఫ్ ఫ్రూట్స్ దట్స్ వాట్ మేక్స్ ఎ హ్యాపీ ఫ్యామిలీ..◆
Comments
Post a Comment