Skip to main content

నేటి మోటివేషన్... తండ్రి గారి దీవెన

ఒక ఊరిలో ఒక వ్యాపారి వున్నాడు అతనికి భార్య, కొత్తగా పెళ్లిఅయిన కూతురు కావ్య వున్నారు. 

వ్యాపారి, వ్యాపారం నిమిత్తమై దూరప్రాంతానికి వెళుతుంటే కూతురు వచ్చి తండ్రి కాళ్లకు నమస్కరించింది. 
తండ్రి అమ్మాయి తో నీగడప కున్న పసుపుకుంకం చెరిగిపోవాలి, నీ వాకిట్లో ముగ్గు చేదిరిపోవాలి, నీ ఇల్లు చెత్త చెదారంతో నిండిపోవాలి, నీకు శాంతం పోవాయి కోపం రావాలి, అంటూ ఇలాగే ఎవేవో అంటుంటే కూతురుకి తండ్రి అన్నమాటలకి బాధకలిగి తన గదిలోకివెళ్ళి తలుపు వేసేసుకుంది.

ఆ తర్వాత ఏప్పుడు తండ్రి ఫోన్చేసినా మాట్లాడేదికాదు. తండ్రి వ్యాపారానికి వెళ్లిన 9 నెలలకి కావ్యకి కొడుకు పుట్టాడు.  

బోర్లాపడడం, ఆతరువాత పాకడం మొదలుపెట్టాడు. కావ్య శుక్రవారం గడపకి పసుపురాసి కుంకుమ బొట్లు పెట్టింది. కొడుకు పాక్కుంటు వెళ్లి పసుపుకుంకం మొత్తం చెరిపేసి ఒళ్ళంతా పట్టించేసు కున్నాడు. మర్నాడు గడపదాటి బైటవేసిన ముగ్గు మొత్తం చేరిపేసాడు. నడవడం వచ్చేసరికి అల్లరి ఎక్కువై పోయి, ఇల్లంతా బొమ్మలతో చింపేసిన కాగితాలతో చెత్త చెత్త చేసేసాడు. 

తల్లిపనై కూర్చోగానే వెనక నుంచి వచ్చి జుట్టు పట్టుకుని లాగడం మొదలుపెట్టాడు. దాంతో కావ్యకి శాంతం పోయి కోపమొచ్చి, కొడుకుని ఒక్కదెబ్బకొట్టింది. వాడుఏడుస్తుంటే వెళ్లి సముదాఇంచింది.

ఈరోజు ఆదివారము కదా నువ్వు అల్లుడుగారుబాబుని తీసుకొని రండి అని తల్లి నుండి ఫోన్ వస్తే తల్లిగారి ఇంటికి వెళ్లారు.

ఏమిచేస్తున్నాడు మనువడు అంటు అమ్మమా పిల్లాడిని తీసుకుని ఎత్తుకునేసరికి, కావ్య కొడుకు చేసే అల్లరి పనులన్నీ ఏకరవు పెడుతుంటే తల్లి వింటూ నవ్వుతుంటే, తల్లికేసి విచిత్రం గా! చూసింది.

వ్యాపారానికి వెళుతూ తండ్రిఅన్న మాటలు గుర్తుకువచ్చాయి. వేంటనే పశ్చాత్తాపం తో అమ్మ ఫోన్ ఇలా ఇయ్యి నాన్నగారికి ఫోన్ చేస్తాను అంది.

ఇప్పుడు మీనాన్న గారు వస్తారు. అందుకే మీకు ఫోన్ చేసాను అంది తల్లి. తండ్రి వస్తూనే ఏడి నా గడుగ్గాయి మనవడు అంటూ, మనవడిని ఎత్తుకుని తండ్రి మురిసిపోతుంటే! 

నాన్న నన్ను క్షమించండి. మీమాటలు ఆశీస్సులు అని అర్ధం చేసుకోలేకపోయాను.
అని తండ్రిభుజం మీదవాలి బాధపడుతున్న కూతురి
తలనిమిరి, ఈసారి నీ నటింటా సిరులు లోలికించు శ్రీమహాలక్ష్మి లాంటి చూడచక్కని చుక్క అందమయిన కూతురుపుట్టాలి అని తండ్రి దివించగా కూతురు ముఖం లో నవ్వుల పువ్వుల వర్షం కురిసింది.

అందుకే పెద్దల మాటలు ముత్యాల మూటలు, అవి ఏప్పటికి తరగని నిధులు అని అన్నారు. వాటిని మురిపెంగా దాచుకోవాలి కాని అసహ్యం తో విసరివేయరాదు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺