🌼జననాలు🌼
💖1887: తాపీ ధర్మారావు నాయుడు, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు. (మ.1973)
💖1905: చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్, భాగవతార్ సుప్రసిద్ధ హరికథా కళాకారుడు, రంగస్థల, సినిమా నటుడు.
💖1911: బోయి భీమన్న, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుగ్రహీత, పద్మభూషణ పురస్కార గ్రహీత. (మ.2005)
💖1924: కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (మ.2010)
💖1929: బి.వి. కారంత్, కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు. (మ.2002)
💖1935: మౌలానా అబ్దుల్ రహీం ఖురేషీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్‌లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (మ.2016)
💖1965: సునీతా విలియమ్స్, యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి, నాసా వ్యోమగామి.
💐మరణాలు💐
🍁1719: రెండవ షాజహాన్, 11వ మొఘల్ చక్రవర్తి. (జ.1698)
🍁1965: బల్వంతరాయ్ మెహతా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (జ. 1900) .
🍁2014: ఉప్పలపు శ్రీనివాస్, మాండలిన్ విద్వాంసుడు. (జ.1969)
🍁2015: నడిచే గణితవిజ్ఞాన సర్వస్వంగా పేరుగాంచిన ఆచార్య నల్లాన్ చక్రవర్తుల పట్టాభిరామాచార్యులు, తన 82వ ఏట, వరంగల్లులో చనిపోయాడు. (చూ. సాక్షి, తే.21-9-2015) ఆయన వరంగల్లు లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.ఐ.టి.) లో గణిత ఆచార్యునిగా పదవీ విరమణ చేశాడు (జ.1933).
🇮🇳జాతీయ / దినాలు🇮🇳
👉 తెలుగు మాధ్యమాల దినోత్సవం.
Comments
Post a Comment