నవ్వుల వెలుగులో ఉన్న ప్రతీ వాడికీ...
ఏదో వైపున పొంచి ఉంటుంది.
నీడ లేని మనిషి..
సమస్య లేని జీవితం ఉండదు.
బాధపడి, భయపడి పారిపోతే...
దూరమయ్యేది నీ నీడ కాదు!
నీతో ఉన్న వెలుగు
భయం నిన్నే కాదు, నీతో పాటు నీ కుటుంబాన్నీ అగాధంలోకి నెట్టేస్తుంది...
ఇన్ని వేల జీవరాశుల్లో...
మాట, మనసు, బుద్ది, ఆలోచన
ఉన్నది... కేవలం మనిషి జన్మకు మాత్రమే!
అలాంటి జన్మ ఎత్తాక..
చేతనైతే సమాజం గురించి ఆలోచించాలి..
చేత కాకపోతే, కనీసం కుటుంబం గురించయినా ఆలోచించాలి..
కష్టమైనా, సుఖమైనా.. పంచుకునేందుకు ఒక బంధం ఉండాలి. అలాంటి బంధాలను పక్కన పెట్టి..
ఎవరికీ ఏమీ చెప్పలేక, చెప్పుకోలేక..
నీలో నువ్వే యుధ్దం చేస్తుంటే..
నిన్ను నువ్వే ఓడించుకొంటుంటే..
ఎవరు నిన్ను ఓదార్చేది? ఎవరు నిన్ను గెలిపించేది?
ఆశలకు ఉరి వేసి.. ఊపిరిని ఆపేసి..
నిన్ను నమ్మిన వాళ్లకి ద్రోహం చేసేసి..
నీ వాళ్లని రోడ్డున పడేసి..
బతుకు బండిని ఆపేసి..
ఏం సాధిద్దామని ??
ధైర్యంగా ఉండాలి..
ధైర్యాన్ని పంచాలి..
సమస్య లతో సమరం చేస్తూ...
గెలుపోటముల బ్రతుకాటల్లో,
సంతోషం గా బ్రతకాలి.
అదే జీవితం.. అది మాత్రమే జీవితం..
-శంకర్ జి.
It's good motivation
ReplyDeleteSuper
ReplyDelete