🌸జవాబు: మనకు షాక్ కొట్టాలంటే మన శరీరంలో రెండు ప్రాంతాలు (సాధ్యమైన నిడివి దూరంలో, ఉదా: కాళ్లు ఒక చివర, చేతులు మరో చివర) వేర్వేరు విద్యుత్‌శక్మం(electrical potential) ఉన్న ధ్రువాలను (poles) తాకాలి. అపుడు శరీరం గుండా విద్యుత్ ప్రవహించడం వల్ల శరీరంలో అవాంఛనీయమైన ప్రక్రియలు జరిగి షాక్ కొడుతుంది. అయితే ఎలక్ట్రిక్ రైలులో కేవలం ఇంజన్ మాత్రమే ఎలక్ట్రిక్ వైర్లకు సంధానిస్తారు. బోగీలను కాదు. అయితే బోగీలకు, ఇంజనుకు మధ్య అనుసంధానం ఉంటుంది కాబట్టి, బోగీల్లో కూడా విద్యుత్
ప్రవాహం ఉంటుందని మీ అనుమానం. కానీ విద్యుత్ తీగ ఒకటి మాత్రమే రైలు పైన ఉంటుంది. రెండు ధ్రువం భూమి (ground).
ప్రవాహం ఉంటుందని మీ అనుమానం. కానీ విద్యుత్ తీగ ఒకటి మాత్రమే రైలు పైన ఉంటుంది. రెండు ధ్రువం భూమి (ground).
ఇది పట్టాల మీదుగా భూమికి సంధానంలో ఉంది. విద్యుత్ ఎపుడూ అత్యల్ప నిరోధం(lowest electrical resistance) ఉన్న దారిగుండా ప్రయాణిస్తుంది. మొత్తం బోగీ ప్రధానంగా లోహం కాబట్టి మనతో సంబంధంలేకుండా విద్యుత్ ప్రవాహం పైనున్న తీగ నుంచి యంత్రం గుండా పట్టాల ద్వారా భూమిని చేరుకుంటుంది. రైల్లో ఉన్నపుడు మన శరీరం ఎపుడూ ఏమాత్రం రెండు వేర్వేరు శక్మాలున్న ధృవాల మధ్య ఉండదు. కాబట్టి విద్యుత్ ప్రవాహం శరీరం గుండా ఉండదు. అంటే షాక్‌కు అవకాశం లేదు.
Comments
Post a Comment