Skip to main content

నేటి మోటివేషన్... మనిషి విలువ నోరు చెబుతుంది "



- చక్కనికథ 

ఒకసారి విక్రమాదిత్య మహారాజు తన సైనికులతోను, మంత్రితోను కలిసి వేటకై అడవికి వెళ్ళాడు. వేటాడుతూ ...... వేటాడుతూ ....... 
అడవిలో ఒకరికొకరు దూరమైనారు. 

ఒకచోట చెట్టు క్రింద నీడలో అంధుడు, వృద్ధుడు అయిన ఒక సాధువు కూర్చొని ఉండగా ........
అతన్ని చూసిన విక్రమాదిత్యుడు ...... 
" సాధు మహరాజ్........ ఇటువైపుగా ఎవరైనా ఇంతకుముందు వెళ్ళారా....... ? అని అడిగాడు.

ఆ అంధ సాధువు ఇలా అన్నాడు: 
" మహారాజా......! అందరికంటే ముందు మీ సేవకుడు వెళ్ళాడు. అతని వెనుక మీ సేనా నాయకుడు వెళ్ళాడు. సేనానాయకుని తరువాత మీ మంత్రి 
కూడా ఇంతకుముందే వెళ్ళాడు "

అంధుడైన ఆ సాధువు చెప్పిన సమాధానం విని విక్రమాదిత్యుడు ఆశ్చర్యంతో, ఆసక్తితో ...... 
 " మహాత్మా........ మీకు నేత్రాలు కనిపించవు కదా! 
నా సేవకుడు, సేనానాయకుడు, మంత్రి ఇక్కడినుండి ఇప్పుడే వెళ్లినట్లు ఎలా గ్రహించారు? నేను రాజునైనట్లు కూడా ఎలా కనుగొన్నారు....? " అని అడిగారు .

అంధుడైన సాధువు ఇలా చెప్పాడు: 

" మహారాజా....! నేనా ముగ్గురినీ, మిమ్ములను 
మీ మాటలు విని కనిపెట్టాను. 

అందరికంటే ముందు సేవకుడు వచ్చి నాతో, 
"ఏమిరా, గుడ్డివాడా.....! ఇటు ఎవరైనా వచ్చారా?" అని అడిగాడు. 

కొంతసేపటికి సేనానాయకుడు వచ్చి, 

"సూర్ దాస్! ఇటు ఎవరైనా వెళ్ళారా....?" అని అడిగాడు.

చివరకు మీ మంత్రి వచ్చి ,
" సూర్ దాస్ జీ ! ఇటు ఎవరైనా వెళ్ళారా......? " 
 అని అడిగారు

ఇప్పుడు మీరు వచ్చి , 
" సాధు మహరాజ్! ఇటు ఎవరైనా బాటసారులు వచ్చి వెళ్ళారా ...... ?" అని అడిగారు.

"మహారాజా! ఒక వ్యక్తి యొక్క నోటి నుండి వచ్చే మాటల ద్వారా అతని పదవి, అతని ప్రతిష్ఠ ఏమిటో గుర్తించవచ్చు" అని ఆ సాధువు వివరించారు...

🗣 మనం మాట్లాడే తీరుని బట్టి మనస్థాయి సంస్కారం తెలుస్తుంది కదా...

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺