భయం ... స్టేజి మీదకు ఎక్కి మాట్లాడాలంటే భయం. ఏదన్నా ఓక కొత్త పని చేయాలంటే భయం. పబ్లిక్ లో కొత్త వారితో మాట్లాడాలంటే భయం.
ఎందుకు భయం ?? ఒక్క విషయం గుర్తుంచుకోండి భయపడడం , భాదపడడం వీటి వాళ్ళ ఏదైనా సాధించగలరా ??
భయపడితే నీ సమస్య దూరం అవుతుందా?? భాదపడితే దానికి పరిష్కారం దొరుకుతుందా??
ఒకసారి నీకు నువ్వు ప్రశ్నించుకో.
సైకిల్ లేదా బైక్ నేర్చుకోన్నే మొదటి రోజుని బాగా నేర్చుకున్న తర్వాత ఒక రోజుని గుర్తుతెచ్చుకోండి. ఒకటే మార్పు..మొదటి రోజు పడిపోతానేమో అని ఒక చిన్న భయం బాగా నేర్చుకున్న తర్వాత ఆ భయం ఉండదు. గమనించారా ! భయం ఉంటే ఎలా ఉంటుందో లేకపోతే ఎలా ఉంటుందో. భయం ఒక ఊర కుక్క లాంటిది .భయపడి పరుగు పెడితే వెంట పడుతుంది . దైర్యంగా నిలబడితే అదే భయపడి పారిపోతుంది.
స్టేజి మీదకు ఎక్కి మాట్లాడాలంటే భయం. ఎందుకు?? ఇతరులు ఏమనుకుంటారో ,వాళ్ళు నన్ను హేళన చేస్తారేమో, నా సిగ్గు తెసేస్తరేమో అని భయం. ఒక విషయం గుర్తుంచుకోండి. నువ్వు ఈ పని చేసిన చేయకపోయినా ఎవరో ఒకరు ఎదో ఒకటి అంటూనే ఉంటారు. ఉదాహరణకు ఎక్కువగా నవ్వితే పిచ్చివాడు అంటారు
నవ్వకపోతే ఎప్పుడు కోపంగా ఉంటాడు
ఏడిస్తే పిరికివాడు అంటారు ఏడవక పోతే వీడికి అసలు మనస్సే లేదు అంటారు మర్యాదగా ఉంటే అమాయకుడు అంటారు
జ్ఞానం ప్రదర్శిస్తే గర్విష్టి అంటారు
ఒంటరిగా ఉంటే ఏకాకి అంటారు
అందరితో తిరిగితే తిరుగుబోతూ అంటారు
ఎదేమైతే నాకేంటి అనుకుంటే స్వార్ధపరుడు అంటారు .
ఇలా ఏ పని చేసిన చేయకపోయినా ఎదో ఒకటి అంటునే ఉంటారు.మరి వాళ్ళ గురించి ఆలోచించడం అవసరమా ??
మీకు మీరు ప్రశ్నించుకోండి?? మీరు ఏదన్నా మంచి పని చేసేటప్పుడు ఎవరు ఏమన్నా పటించుకోకండి.వాళ్ళు అనేది వినండి నచ్చి , మంచి ఉంటే స్వికరించండి. లేకపోతే అసలు పటించుకోకండి.
✨
కొత్త వారిని అడిగి ఏదన్నా తెలుసుకోవాలంటే భయం ఎందుకు ?? వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని భయం. అలాగే వాళ్ళు అనుకుంటారు. చివరికి ఇద్దరు భాదపడతారు. ఏదన్నా తెలియక పోతే అడిగి తెలుసుకోండి, తప్పులేదు. భాదపడుతూ ఎప్పుడు ఉండకండి. డి మోటివెటెడ్ గా,నిరాశగా ఎప్పుడు ఉండకండి. అలాంటివారిని లోకం ఎప్పుడు పటించుకోదు. అందరికి ఎప్పుడు సంతోషంగా ఉండి ,వాళ్ళను సంతోషంగా ఉంచే వారే కావాలి. ఎప్పుడు దైర్యంగా ఉండండి. మంచిగా కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. సత్తువ లేని వాడిలా నీరసంగా నడవకండి. నడకలో మన కాన్ఫిడెన్స్ కనపడాలి.
దర్జాగా బతుకు, హ్యాపీగా బతుకు అప్పుడు నిన్ను పదిమంది ఆదర్శంగా తీసుకుంటారు. ఎప్పుడు చురుకుగా, కాన్ఫిడెంట్ గా ఉండండి.
Comments
Post a Comment