ఒక మెకానికల్ ఇంజనీర్ కారులో వెళ్తున్నాడు ఉన్నట్టుండి టైర్ పంచర్ అయ్యింది
అటుగా ఎక్కడా ఎవరి రాకపోకలు లేవు ఎలాగోలా స్టెప్ని టైర్ మార్చడానికి తనే స్వయంగా సిద్ధమయ్యాడు
బోల్టులన్నీ తీసి టైర్ మారుస్తుండగా చెయ్యి జారీ బోల్టులన్నీ పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయినాయి
ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తుండగా
మురికి బట్టలు అందులోనూ అక్కడక్కడా చినిగిపోయిన బట్టలు వేసుకున్న వ్యక్తీ అటుగా వచ్చాడు
ఈయన్ని చూసి అయ్యా ఏమైందని అడిగాడు
అప్పుడు ఆ ఇంజనీర్ కు ఆ కాలువలో దిగడానికి సరైన వ్యక్తి దొరికాడని జరిగిందంతా చెప్పాడు
ఆ కాలువ నుండి బోల్టులు తీసిస్తే ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పాడు
అప్పుడు ఆ వ్యక్తి
అయ్యా!!
కాలువలో దిగడానికి నాకు ఎటువంటి ఇబ్బంది
లేదు కానీ అంతకంటే సులభమైన మార్గం ఉంది.
మిగతా మూడు టైర్ ల నుండి ఒక్కో బోల్టు తీసి ఈ టైర్ కు వేయండి తరువాత వచ్చే మెకానిక్ షాప్ లో నాలుగు బోల్టులు తీసి వేసుకుంటే సరిపోతుంది అన్నాడు అంతే..! ఇంత చదువుకున్న నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదా ? అని ఆశ్చర్యపోయాడు
మనిషిని చూసి తక్కువ అంచనా వేయకండి చిన్నచూపు చూడకండి.
ఇప్పుడున్న చదువులు విజ్ఞానాన్ని పెంచి జ్ఞానాన్ని సూన్యం చేస్తున్నాయి
అన్ని తెలివితేటలు ఉన్నా ఏ సమయంలో ఏది ఎప్పుడు ఎక్కడ వాడాలో తెలియడం లేదు
ప్రాణాలతో ఉన్న పక్షికి చీమలు ఆహరం
చచ్చిన పక్షి చీమలకు ఆహారం
పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు
ఎవరిని తక్కువ చేసి చూడకండి.
సేకరణ.
Super
ReplyDelete