సెప్టెంబర్ 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 273వ రోజు (లీపు సంవత్సరములో 274వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 92 రోజులు మిగిలినవి.
సంఘటనలు
1955: రాష్ట్రాల పునర్విభజన సంఘం నివేదికను ఫజలాలీ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చింది.
1971: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు పదవిని చేపట్టాడు.
1993: మహారాష్ట్ర లోని లాతూర్ భూకంపం, సుమారు 10,000 ప్రజలు మరణించారు.
2008: రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో చాముండీ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 మంది భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు.
2012: హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణా మార్చి (కవాతు) జరిగింది.
జననాలు
1207: జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి, పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త, సూఫీ. (మ.1273)
1828: లాహిరి మహాశయులు, భారత యోగీశ్వరుడు, మహావతార్ బాబాజీకి శిష్యుడు. (మ.1895)
1893: వి. పి. మెనన్, భారత స్వాతంత్ర్య సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి. (మ.1965)
1961: చంద్రకాంత్ పండిత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1964: మోనికా బెల్లూచి ఇటలీ నటి, ఫ్యాషన్ మోడల్ జననం.
1980: మార్టినా హింగిస్ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి.
మరణాలు
1955: జేమ్స్ డీన్, అమెరికాకు చెందిన నటుడు (జ.1931).
1990: శంకర్ నాగ్, కన్నడ సినిమాలో పాపులర్ నటుడు, దర్శకుడు సుప్రసిద్ధ నవలా రచయిత (జ.1954).
2012: కాసరనేని సదాశివరావు, శస్త్రవైద్య నిపుణుడు (జ.1923).
పండుగలు , జాతీయ దినాలు
అంతర్జాతీయ అనువాద దినోత్సవం.
Comments
Post a Comment