Skip to main content

SALUTE TO ALL FATHERS



నాన్నలందరికి అంకితం 
నాన్న_మనకోసం 
ఏం_చేశాడో 
ఏం_కోల్పోయాడో  
మనకు_తెలియదు..!

జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ, వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి. 
తండ్రి తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో కోల్పోతాడు. 
నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు. 
ఎందుకంటే.. నాన్న ఎవరికీ చెప్పడు. పిల్లలకి, భార్యకి అసలు చెప్పడు. 
అమ్మలా ప్రేమను బయటికి చూపించడం నాన్నకు రాదు. 
నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు. 
బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు. 
‘ఎప్పుడూ పనేనా? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా..’ అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం. 
పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు. 
నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు. 
పెళ్లై, పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు. 
మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి. 
చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు.
ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. 
వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు. వృద్ధాప్యం ఇంకా రాలేదు.. 
మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు. 
నాన్న డాక్టర్‌ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే.. ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు. 
తన పిల్లలు గొప్ప వాళ్లు అవుతారని నాన్నకు విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసి చదివిస్తాడు. 
ఆఫీసుకు సెలవు పెట్టి, స్కూల్‌లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిల్చుంటాడు. 
మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. 
పిల్లలు ఏదో సాధించేస్తారని ఆశ. 
ఆస్తులు అమ్మేసి కూతురి పెళ్లి ఘనంగా చేస్తాడు. 
ఎక్కడ, ఎన్ని సంతకాలు పెడతాడో మనకు తెలియదు.
కొన్ని వందలసార్లు అమ్మ ఏడ్వడం చూశాం కానీ, నాన్న ఏడ్వడం ఎప్పుడైనా చూశారా?.. నాన్న కూడా ఏడుస్తాడు. కానీ మీ ముందు ఏడ్వడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు. 
పిల్లలు పెద్దయి, ఏదో పని చేసుకునే సమయానికి.. 
నాన్న అన్నీ అమ్ముకుని, అంతా ఆరిపోయి, అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు. 
అప్పుడే పిల్లలు నాన్నకు ఎదురుచెప్పడం మొదలుపెడతారు. 
‘ఇన్నాళ్లూ వీళ్ల కోసం ఇంత చేశానా?, నేను ఎవరి కోసం బతికాను?’ అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి. 
‘నా కోసం నేను ఏదీ దాచుకోలేదే..’ అనుకుంటాడు. 
నిజానికి ‘నేను’ అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు. 
ఉన్న రెండు ఎకరాలు నాన్న పోగొట్టాడు అనుకుంటాం. ఎందుకంటే అమ్మ అలాగే చెబుతుంది కాబట్టి. 
ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో నాన్నను ఏడిపిస్తాడు. నాన్న గుండెలపై తంతాడు. అప్పటికి ఏడ్వడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు. అవి ఎప్పుడో ఆవిరైపోయుంటాయి. 
కొడుకు ఎంత మంచివాడు, ప్రయోజకుడైతే తండ్రిని అంత బాధ పెడతాడు. వాడికి ఎంత సక్సెస్‌ వస్తే.. అంత ఎక్కువగా తండ్రిని ఏడిపిస్తాడు. ఇది నిజం. 
మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి. బర్త్‌డే వస్తే, పిల్లల్ని ఆహ్వానిస్తాం. కానీ, మీ నాన్న స్నేహితులు ఎవరో మీకు తెలియదు. అసలు మీ నాన్న పుట్టినరోజు కూడా మీకు గుర్తుండదు. ఎందుకంటే మీ పిల్లలే మీ భవిష్యత్తని ఫీల్‌ అవుతారు. నాన్న మీ భవిష్యత్తు కాదు. కానీ నాన్నకు మీరే భవిష్యత్తు. 
మీ కోసం రిస్క్‌ తీసుకోలేక, ధైర్యం సరిపోక మీ నాన్న తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. 
మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న ఎనర్జీ పోయింది. 
ఎక్స్‌ట్రార్డినరీ అవ్వాల్సిన ఎంతో మంది నాన్నలు జీవితంలో తమ పిల్లల కోసం ఆర్డినరీగా మిగిలిపోయారు..’
_Salutes_to_Every_Father
Copy
🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups