Skip to main content

నేటి మోటివేషన్... తప్పక చదవలసిన విషయం



బంధాలు వాటంతటవే దూరం కావు , వ్యక్తిత్వం వల్లనో ప్రవర్తన వల్లనో ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వల్లనో అవి దూరమవుతాయి .

      నిజాలు మాట్లాడే వారు ఎప్పుడూ ఒంటరిగా మిగిలిపోతారూ నిజాయితీగా ప్రేమించే వారి ప్రేమను ఎప్పుటికి పొందలేరూ బంధాలు ప్రేమించే వారు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారూ కుటుంబం కోసం కష్ట పడేవారినీ ఎప్పటికి సుఖ పడనివ్వరూ . పదిమంది కోసం పాటుపడే వారు నిందలపాలు అవుతూనే ఉంటారు . కానీ మనిషి గా మంచివారి మనస్సులలో శాశ్వతంగా ఉంటారు .

     డబ్బు మనిషిని పైకి తీసుకెళ్ళ గలదు , అందులో ఎటువంటి అనుమానం లేదు , కానీ!.మనిషి పైకి వెళ్ళేటప్పుడు డబ్బుని తీసుకెళ్ళలేడు ఇందులోను ఎంటువంటి అనుమానం లేదు ! ఐనా మనిషి ఆకలి కోసం చేసే పోరాటం కన్నా పైసలు కోసం చేసే పోరాటమే ఎక్కువైంది. ఇది పచ్చి నిజం

    ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయి . ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి . అందుకే గతం మరిచిపోవద్దు నేస్తమా . సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనషుల విలువలను కూడా సంపాదించాలి కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెకించే వారిని సంపాదించాలి భాదల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి,
మన మనసుకి హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు , మన మనసు నొచ్చుకునేలా మాట్లాడే వారు మరికొందరు మనతో మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు మన అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం .
     దైర్యం అంటే ఎవరో నీకు తోడు వున్నానని చెప్పడం కాదు ! ఎవరు లేకున్న నాకు నేను వున్నానని చెప్పుకోవడమే అసలైనా దైర్యం.

    ఈ రోజుల్లో మోయలేనంత డబ్బులు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు కానీ ! చివరికి మనల్ని మోయల్సిన నలుగుర్ని సంపాదించుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు ఈ కరోనా వైరస్ వలన .

    మనం దేనినైనా పోగొట్టుకోవడం చాలా సులువు కానీ ! దానిని సంపాదించడమే చాలా కష్టం అది సంపద అయినా ప్రేమ అయినా స్నేహమైనా నమ్మకమైనా . 

     మన చేతిలో ఏది ఉండదు ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు , ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు నేస్తమా !

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

వెలుగులు నింపే ఉపాధి యజ్ఞంలో నేను సైతం అంటూ స్పందించిన మానవ దైవాలు...

చేయూత వార్షికోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాది వారితో కలిసి... జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమంలో భాగస్వాములం అవుతున్నాం... గత ఏడాది ఆసరా లేక అక్షరం ఆగుతున్న చోట ఇద్దరు చిన్నారులకు మన ద్వారా ఫీజు చెల్లించిన విషయం మీకు విదితమే కదా... ఈ ఏడాది కూడా... ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం మనకు వచ్చింది... వివరాల్లోకి వెళితే... ఇద్దరు ఒంటరి మహిళలు.. ఇద్దరు వితంతువులు... ఇద్దరిది చిన్న వయసు... ఒకరు ఒకవైపు కోల్పోయిన జీవితంతో పోరాడుతూ... అంగ వైకల్యం గల చిన్నారి ని పోషిస్తూ... ఒక బట్టలు కుట్టే షాపులో రోజు కూలీగా పనిచేస్తున్నారు... మరొకరిది కూడా ఇంత కన్నా దీనమైన పరిస్థితి... ఇద్దరి కష్టాన్ని తరచి చూస్తే.... మనం ఇద్దరికీ ఏమైనా రెండు కుట్టు మిషన్లు సమకూర్చగలిగితే వారి కాళ్ల పై వారు నిలబడగలరు.. వచ్చిన కొద్ది మొత్తం తో కుటుంబాన్ని కూడా పోషించుకోగలరు... ఇన్నాళ్లు సమస్య అన్నప్రతీసారి స్పందించాం... ఇప్పుడు కూడా రెండు కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం మన ముంగిట నిలబడింది... ఒకరుగా చేయలేం... కానీ ఒకరికి ఒకరు జత కలిస్తే... ఒకటిగా చేయగలం... ఒక్కొక్క ఎలక్ట్రానిక్ సదుపాయం గల కుట్టు మిషన్ ఖరీదు 12,000/ రూపా...

ఫ్లాష్ ఫ్లాష్... ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల...

10th results link: 1 10th results link: 2 Direct link 10th results link: 3 10th results link: 4 10th results link: 5  100% working link use this all 10th results link: 6  most searched link 10th results link: 7 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺