Skip to main content

నేటి మోటివేషన్... సూసైడ్ కాదు మర్డర్

నాతో మాట్లాడు ... కం టాక్ విత్ మీ.... మాట్లాడితే సరిపోతుంది గా...సూసైడ్ చేసుకోడం దేనికి .... ఇలా అందరూ ఇప్పుడు బానే సొల్లు కబుర్లు చెప్పేస్తున్నారు ... కానీ వాడు నీ దగ్గరకి ఎప్పటికీ రాడు..... చచ్చినా రాడు... ఎందుకంటే...
వాడికి తెలుసు....!!

ఒకవేళ బయటకి నువ్వు ఎదో వాడిని అప్పటికప్పుడు సాటిస్ఫయ్ చేయడంకోసం నాలుగు మోటివేటింగ్ మాటలు మాట్లాడినా, వాడు వెళ్ళిపోయాకా వాడి బాధని చూసి నవ్వుకుంటావని... వాడి బలహీనతని చూసి వెక్కిరిస్తావని వాడికి తెలుసు...!!

వాడికి నువ్వు జ్ఞాన బోధచేసేసి వాడి జీవితాన్ని నిలబెట్టేసినంత ఫోజ్ కొట్టి ఆ తర్వాత నుండి వాడి మీద నువ్వు నీ వ్యక్తిత్వాధిపత్య గర్వాన్ని చూపించడం మొదలు పెడతావని వాడికి తెలుసు....!!

అప్పటిదాకా నీతో సమానంగా అన్ని విషయాల్లో పాలుపంచుకున్నవాడు... కొన్ని కొన్ని సార్లు నీకంటే బాగా ఆలోచించి నిన్ను ఇబ్బంది పెట్టిన వాడు ఒక్కసారి నీ దగ్గరకి వచ్చి వాడి బాధలు చెప్పుకుంటే...ఆకలి మీద ఉన్న పులికి దొరికిన ఆహారం లా వాడిని నువ్వు మీద పడి కొరికి కొరికి తినేసి నీ ఆకలి తీర్చుకుంటావని వాడికి తెలుసు..!!

నువ్వు నీ ఈగో సాటిస్ఫయ్ చేసుకుంటూ వాడి తప్పులను జడ్జి చేస్తూ నోటికొచ్చిన పనికిమాలిన సలహాలన్ని ఇచ్చి వాడి పై ఈ ఆటలో నువ్వు గెలిచేసినట్టు ప్రగల్భాలు పలికి చివరికి వాడినే ఓడగొడతావని వాడికి తెలుసు...!!

వాడి ఈగో తో కట్టుకున్న పేక మేడని ఒకేసారి నీ ఈగో అనే తుఫాను తో కూల్చిపాడేస్తావని వాడికి తెలుసు...!!
అందుకే వాడు రాడు... చస్తాడు గాని నీ దగ్గరకి మాత్రం రాడు..!! 

ఎందుకో తెలీదు... ఏడుపు ని బాధపడటాన్ని ఈ సమాజం జీవితం లో ఒక భాగం గా చూడదు. దాన్ని ఒక వ్యక్తిత్వలోపం గా చేతకానితనం గా లెక్క కట్టి మనస్ఫూర్తిగా ఏడ్చి భారం తీర్చుకునే స్వాతంత్య్రం కూడా లేకుండా చేస్తుంది....!

నా దృష్టి లో వాడిది సూసైడ్ కాదు మర్డర్....మొత్తం సమాజం అంతా కలిసి చేసిన మర్డర్...!!
అది ఈ సమాజం అర్ధం చేసుకున్న రోజునైనా... ఈ సూసైడ్ లు అనబడే హత్యలు ఆగుతాయేమో వేచి చూడాలి...😢

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺