Skip to main content

తెలుసుకుందాం గోరింటాకు ఎలా పండుతుంది❓


జవాబు: గోరింటాకు అరచేతులు , అరికాళ్ల మీద పండినంత ఎర్రగా మిగిలిన శరీర భాగాలమీద పండకపోవడం గమనించే ఉంటారు. అసలు ఈ ఆకుల వల్ల మన చర్మం మీద ఎర్రగా ఎలా పండుతుంది అనుకుంటున్నారా?
ఆకులోని లాసోన్ అనే పదార్థం చర్మంలోని స్త్రామ్ కార్నియం పొరలోని మృతకణాల ద్వారా లోపలకు ఇంకి చర్మానికి ఎరుపు రంగునిస్తుంది. లాసిన్‌తో పాటు మేనైట్ యాసిడ్, మ్యుసిలేజ్, గాలిక్ యాసిడ్, నాఫ్టాక్వినొన్ లాంటి రసాయనాలు కూడా ఇందులో ఉండటం వల్ల ఇది మంచి కలర్ డైగా వాడుకలో ఉంది. మన శరీరము వెలుపల ఉండే కెరోటిన్‌ కి అంటుకునే గుణము ఈ గోరింటాకుకు ఉంది. మన శరీరంలోని వెంట్రుకలు, గోళ్లు, అరచేతులు, అరికాళ్లు వంటి భాగాలలో కెరోటిన్‌ ప్రోటీన్‌ అధికం. అందుకే ఆ భాగాలలో బాగా పట్టి పండుతుంది. 

👉 మన దేశంలో పెళ్లికి, గోరింటాకుకు విడదీయలేని అనుబంధం ఉంది అని చెప్పవచ్చు. పెళ్లి లేని గోరింటాకు ఉండవచ్చునేమో కానీ గోరింటాకు లేని పెళ్లి సందడి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఉత్తర భారతీయులైతే పెళ్లికి ముందు మెహెంది అని గోరింటాకు పెట్టుకోవడానికే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అబ్బాయి తరఫు నుంచి వచ్చిన గోరింటాకుతో పెళ్లి కూతురుకు అందమైన డిజైన్లు దిద్దుతారు. కొన్ని సంప్రదాయాలలో కొత్త పెళ్లి కూతురి చేతి గోరింటాకు వదిలేవరకు వంటింట్లోకి రాకూడదని అంటారు. అమ్మాయిని అంత అపురూపంగా చూసుకుంటారన్నమాట. 

👉 గోరింటాకు రంగు మార్చాలంటే దానిలో కాఫీపొడి లేదా టీ డికాక్షన్‌ వంటివి కలుపుతారు. మన శరీరంలో చర్మంలోని కెరోటిన్‌తోనే గోరింటాకు రియాక్ట్ అవడం వల్ల... కాలంతో కెరటిన్‌ మృతకణాలు రాలిపోతాయి. దానితో పాటే గోరింటాకు రంగూ పోతుంది. అందుకే గోరింటాకు పెట్టుకున్న తరువాత కొద్దిరోజులే ఆ రంగు ఉంటుంది.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

వెలుగులు నింపే ఉపాధి యజ్ఞంలో నేను సైతం అంటూ స్పందించిన మానవ దైవాలు...

చేయూత వార్షికోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాది వారితో కలిసి... జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమంలో భాగస్వాములం అవుతున్నాం... గత ఏడాది ఆసరా లేక అక్షరం ఆగుతున్న చోట ఇద్దరు చిన్నారులకు మన ద్వారా ఫీజు చెల్లించిన విషయం మీకు విదితమే కదా... ఈ ఏడాది కూడా... ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం మనకు వచ్చింది... వివరాల్లోకి వెళితే... ఇద్దరు ఒంటరి మహిళలు.. ఇద్దరు వితంతువులు... ఇద్దరిది చిన్న వయసు... ఒకరు ఒకవైపు కోల్పోయిన జీవితంతో పోరాడుతూ... అంగ వైకల్యం గల చిన్నారి ని పోషిస్తూ... ఒక బట్టలు కుట్టే షాపులో రోజు కూలీగా పనిచేస్తున్నారు... మరొకరిది కూడా ఇంత కన్నా దీనమైన పరిస్థితి... ఇద్దరి కష్టాన్ని తరచి చూస్తే.... మనం ఇద్దరికీ ఏమైనా రెండు కుట్టు మిషన్లు సమకూర్చగలిగితే వారి కాళ్ల పై వారు నిలబడగలరు.. వచ్చిన కొద్ది మొత్తం తో కుటుంబాన్ని కూడా పోషించుకోగలరు... ఇన్నాళ్లు సమస్య అన్నప్రతీసారి స్పందించాం... ఇప్పుడు కూడా రెండు కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం మన ముంగిట నిలబడింది... ఒకరుగా చేయలేం... కానీ ఒకరికి ఒకరు జత కలిస్తే... ఒకటిగా చేయగలం... ఒక్కొక్క ఎలక్ట్రానిక్ సదుపాయం గల కుట్టు మిషన్ ఖరీదు 12,000/ రూపా...

ఫ్లాష్ ఫ్లాష్... ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల...

10th results link: 1 10th results link: 2 Direct link 10th results link: 3 10th results link: 4 10th results link: 5  100% working link use this all 10th results link: 6  most searched link 10th results link: 7 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺