Skip to main content

నేటి మోటివేషన్... నాకు బలం లేదు' అనుకోవటమే బలహీనత



ఓపిగ్గా చదవండి  కధ 
ఒక అడవిలో ఒక తల్లి ఎలుక ఉంది. దానికో పిల్ల ఎలుక. ప్రపంచంలో అందరి కంటే శక్తిమంతుడైన వాడిని వెతికి తెచ్చి పెళ్లి చేయాలని తల్లి ఎలుకకొక బుల్లి కోరిక. అలాంటి పెళ్లి కొడుకు ఎక్కడ దొరుకుతాడా అని పుట్టలు, గుట్టలు ఎక్కి వెతికింది. ఆకాశంలోకి చూసింది. తన తేజస్సుతో లోకమంతా కాంతులు నింపుతున్న సూర్యుడు కనిపించాడు. "నాయనా సూర్యుడా! సృష్టిలో అందరికంటే శక్తిశాలివి నువ్వు. మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తాను" అంది. "అసలు సృష్టిలో నేను అందరికంటే శక్తిశాలిని అనే నీ అభిప్రాయమే తప్పు. దట్టమైన మేఘం కమ్మితే, శక్తి మాట దేవుడెరుగు, నేను కనపడకుండా పోతాను" అన్నాడు సూర్యుడు. 

టక్కున మేఘం దగ్గరికి పరుగెత్తింది తల్లి ఎలుక. "నాదేమి శక్తి, వానాకాలం శక్తి. గట్టిగా గాలి కొడితే నిలవలేక ఎగిరిపోయేవాడిని" అంది మేఘం. నిజమే కదా అనుకుంటూ గాలి దగ్గరికి పరిగెత్తింది ఎలుక. గాలి నీరసంగా, దిగులుగా నవ్వుతూ, "నాదొక శక్తా? అదిగో, ఆ కనిపించే చిన్ని కొండను పడేయాలని ఎన్నాళ్ళనుంచో కిందా మీదా పడుతున్నాను. నా శక్తి అంతా ఉపయోగించినా, ఒక్క అంగుళం కూడా కదల్చలేక పోయాను" అంది. 

ఎలుక కొండను పట్టుకుంది. "నాదొక పెద్ద శక్తి కాదు, తెల్లవారుతుందంటే భయం. ఊళ్ళో ఆంబోతు వచ్చి, తన కొమ్ములు నా రాళ్ళకు రుద్ది రుద్ది చంపుతుంది. దాని కొమ్ములు పదునవుతున్నాయి కానీ నా రాళ్ళు మాత్రం నుగ్గి నుగ్గి అయిపోతున్నాయి. నువ్వు ఆ ఆంబోతుని పట్టుకుంటే బాగుంటుంది" అన్నది కొండ. 
తీరా ఆ ఆంబోతుని కదిలిస్తే "నాది మాత్రం ఏమి శక్తీ? నాలుగు తాళ్ళు తెచ్చి కట్టేస్తే, నేనలా పడి ఉండాల్సిందే, నా కంటే ఆ తాడుకే ఎక్కువ బలం" అంది. 
"నాదేమి బలం, చిన్న ఎలక పిల్ల కూడా నన్ను పట పటా కోరికేయగలదు కదా" అంది తాడు. 

తల్లి ఎలుకకు జ్ఞానోదయం అయింది, అందమైన ఎలుక వరుడిని చూసి, తన కూతురునిచ్చి పెళ్లి చేసింది. 

ఈ లోకంలో ఎవరి బలం, శక్తియుక్తులు వాళ్ళవి. 'నాకు బలం లేదు' అనుకోవటమే బలహీనత. 'నా అంత బలం మరెవరికీ లేదు' అనుకోవటం మరీ గొప్ప బలహీనత.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

  1. సృష్టి ధర్మం ప్రకారం నడవాలని అర్థమవుతున్నది.

    ReplyDelete

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...