Skip to main content

నేటి మోటివేషన్... Take Control of your Life



జీవితం వ్యక్తిగతమైనది కావాలి.... జీవన విధానం సమాజ సమ్మతమైనది కావాలి.

మన జీవితం ఎప్పుడూ మన చేతుల్లోనే ఉండాలి. ఎవరి acceptance కోసమో మన జీవితాన్ని నరకం చేసుకోకూడదు. అలాగని విచ్చలవిడితనానికి అలవాటు పడకూడదు.

ఈ రెండు లైన్లు అర్థమైతే జీవితం మొత్తం చాలా సాఫీగా, సంతోషంగా ఉంటుంది.

నా చిన్నప్పటి నుండి నాకు ప్రధాన శత్రువు సొసైటీ. తెలిసీ తెలియని వయస్సులో చాలా ఫైట్ చేశా సొసైటీ గురించి.. సొసైటీని చూసి భయపడ్డాను, బాధపడ్డాను, చాలాసార్లు ఏడ్చాను.. అన్నీ అయ్యాక ఫైనల్‌గా సొసైటీని జయించాను. ఇప్పుడు నాకు గుంపుల గుంపుల మనుషుల అభిప్రాయాలతో పనిలేదు. నా ఆలోచనల్లో స్పష్టత ఉన్నంత వరకూ నేనెవరి acceptance కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు.

యెస్.. సొసైటీ మనలో చాలామందికి అజ్ఞాత శత్రువు. అనుకునే వాళ్లు చాలామందే ఉంటారు.. మనం ఏం చేసినా.. నోటికొచ్చింది అనేసుకుంటారు.. వాళ్లకు పోయేదేముంది..?

తిన్నగా ఉన్నా అనుకుంటారు, వంకరగా ఉన్నా అనుకుంటారు.. ఎలాగున్నా అనుకునే వాళ్లు అనుకుంటారని డిసైడ్ అయిపోయి బరితెగించకూడదు. అస్సలు మనం బ్రతకాల్సింది సొసైటీ గురించి కాదు.. మన లైఫ్ ఇది. మన లైఫ్‌లో ఫస్ట్ మనకు అన్నీ అర్థం అవ్వాలి. ఎలాంటి కన్‌ఫ్యూజన్లు ఉండకూడదు. ఓ తప్పు చేస్తుంటే ఆ తప్పు మన మనఃసాక్షికి ఆమోదయోగ్యం అయితే ఇంకెవరి పర్మిషన్లూ అవసరం లేదు. కానీ మనఃసాక్షి ఏ తప్పునూ క్షమించదు. సో మనస్సు ఇచ్చే జడ్జిమెంట్లని మాత్రమే మనం లెక్కలోకి తీసుకోవాలి.

ఆఫ్టరాల్ మనుషులు.. ఇవ్వాళ ఉంటారు, రేపు పోతారు, మళ్లీ ఎల్లుండి వస్తారు. ఇళ్లంతా కళకళలాడుతున్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చే చుట్టాల్లాంటి వాళ్లు.. వీళ్లదేముంది? చాలామందికి మనం అస్సలు అర్థం కాము. అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు. అయినా జనాలు క్యూరియాసిటీ చూపిస్తారు అంతే. అది మానవ నైజం. సో ఎవరికో అర్థం కావడం కోసం వెధవ explanations ఇస్తూ... అందర్నీ సంతృప్తిపరుస్తూ.. మీరు నలిగిపోతూ బ్రతికేయాల్సిన పనిలేదు.

ఫస్ట్ మీ కంట్రోల్ దాటిపోయి జనాల మైండ్‌సెట్లలోకి వెళ్లిపోయిన మీ జీవితాన్ని మీ కంట్రోల్‌లోకి తీసుకోండి. మనుషుల్నీ, సొసైటీని వదిలేయండి.. మీతో లాభం ఉందనుకున్న రోజున ప్రతీ ఒక్కరూ మీ వెంట వస్తారు. మీరు అవసరం లేదనుకున్న రోజున ఖచ్చితంగా మీరెవరో తెలీనట్లు ప్రవర్తిస్తారు. వాళ్లు అలా బిహేవ్ చెయ్యడం స్వార్థమనుకోకండి.. మీరైనా, నేనైనా, ఎవరమైనా అంతే.

మనకు పని ఉంటేనే మనిషి గుర్తొస్తారు. పని లేకపోతే మనిషి అస్సలు అవసరం లేదు. ఇది జనరల్ హ్యూమన్ సైకాలజీ. దీని గురించి బాధపడాల్సిన పనిలేదు. హాపీగా సొసైటీ నుండి మీ జీవితాన్ని మీ కంట్రోల్‌లోకి తీసుకోండి. మనుషుల వెచ్చని స్పర్శల నడుమ సెక్యూర్డ్‌గా ఉంటామన్న భ్రమలో కూరుకుపోకండి. ఆ వెచ్చటి స్పర్శల కన్నా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫైర్, మన జీవితం కోసం మనం చేసే పోరాటం.. మనలోకి మనం తొంగి చూసుకునే పరిశీలనా చాలా చాలా చాలా పవర్‌ఫుల్.

Take Control of your Life..

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Post a Comment

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺