చిన్న పిల్లాడి నుండి పెద్దవాళ్ళ వరకు అందరికి గెలవడం అంటే ఇష్టం. ఒక క్రికెట్ ఆడే పిల్లవాడు ఆట లో ఓడిపోయాడని అన్నం తినడం మానేసే రోజులివి.ఇంక పెద్ద వాళ్ళ సంగతి చెప్పనవసరం లేదు.వాళ్ళు కూడా మినహాయింపేమికాదు.
కొన్నిసార్లు పెద్దవారు కూడా ఓటమిని సంతోషంగా స్వీకరించలేరు.అసలు గెలుపు గురించి కొన్ని నిజాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
అసలు గెలుపనేది మీరు పది మందికి సహాయం చేసినప్పుడు ఇంకా వారికి బ్రతకడానికి చేయూతనిచ్చినపుడు వచ్చేది .అంతేకాని తాత్కాలిక సంతోషాన్ని కోరుకుంటూ పక్కవాళ్ళని ఓడించడం కాదు.
ఒకవేళ మీరు గెలుపంటే డబ్బు సంపాదించడమో లేక పేరు ప్రఖ్యాతలు సాధించడమో అనుకుంటే ఎన్నటికీ మీరు నిజమైన గెలుపుని అనుభవించలేరు.మనం గెలుపు వైపు పరుగులు తీస్తూ ఉంటే ఆనందాన్ని పొందలేం.
ఎదుటి వారిని ఓడించి అహంకారంతో నేనే గొప్ప అని బ్రమపడేకంటే గెలుపు ఓటములు జీవితంలో సహజమని తెలుసుకొని అందరి మేలు కోరే వాడే నిజమైన విజేత.
అతడు మాత్రమే ఈ ప్రపంచంలో అందరికన్నా మంచి జీవితాన్ని అనుభవిస్తాడు.మీరు ఇంకా గెలుపు ఓటములని మీ ఆలోచన శైలిలో చూస్తే,ఈ జన్మకి మీరు సత్యాన్ని గ్రహించలేరు.మీ ఆలోచనని మార్చుకొని అసలైన ఆనందాన్ని సంపాదించుకోండి.....!!!
Comments
Post a Comment