Skip to main content

నేటి మన టీమ్ లక్ష్య కార్యక్రమం... మీ ఇంటి పండుగను కూడా ఇలా చేసుకోండి.... పదిమంది ఆకలి తీర్చండి...



వేడుక ఏదైనా..
ఆత్మీయతను పంచడమే లక్ష్యం..

పండగ ఏదైనా...
పది మందికీ ఆకలి తీర్చడమే లక్ష్యం...అంటూ...

నేడు ఆశయంతో అడుగులు వేసిన మిత్రులకు టీమ్ లక్ష్య సలాం చేస్తుంది...
తనింట జరిగే పుట్టిన రోజు వేడుక వెలుగుల్ని..
పది మందికీ పంచుతూ...
వెలకట్టలేని విలువల్ని..
వేలు పట్టుకుని మరీ తన చిన్నారి అక్షయకు నేర్పుతూ...
మా అందరికీ ఆదర్శంగా నిలిచిన శ్రీహరిత మరియు రాజేష్ కుమార్ రెడ్డి గార్ల దంపతులకు టీమ్ లక్ష్య తరుపున అభినందనలు తెలుపుతూ..🙏

చిన్నారి అక్షయ..
పేరుకు తగ్గట్టుగానే..
ఆకలి అన్న వారికి అక్షయపాత్ర గా మారి ఆకలి తీర్చాలని...

ఆయుః ఆరోగ్యాలతో..
సిరి సంపదలతో...
నిండు నూరేళ్లు వర్ధిల్లమని టీమ్ లక్ష్య తరుపున ఆశీర్వదిస్తూ....
మీ ఇంట జరిగే వేడుక వెలుగుల్ని..
పది మందికి పంచాలనుకునేవారు దిగువ నంబర్ ని సంప్రదించగలరు...
9848956595

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Post a Comment