Skip to main content

చరిత్రలో ఈ రోజు మే / - 24



🔎సంఘటనలు🔍

🌸1689: ఇంగ్లాండ్ పార్లమెంట్ ప్రొటెస్టెంట్లకి మతస్వేచ్ఛ గురించి హామీ ఇచ్చింది.

🌸1726: సారాయి (జిన్/ బ్రాంది) పై పన్ను పెంచినందుకు ప్రజలు తిరగబడి ఆందోళన చేసారు.

🌸1815: ఆస్ట్రేలియా లోని లచ్‌లాన్ నదిని, 'జార్జి ఇవాన్స్' కనుగొన్నాడు.

🌸1830: అమెరికాలో మొట్టమొదటి ప్రయాణీకుల రైలు ప్రయాణించింది (బాల్టిమోర్, ఎల్లియట్స్ మిల్, మేరీలాండ్)

🌸1844: మొట్టమొదటి టెలిగ్రాఫు సందేశాన్ని శామ్యూల్ మోర్స్ అను శాస్త్రవేత్త వాషింగ్టన్ డీ.సీ. నుండి బాల్టిమోర్ కు ప్రసారము చేశాడు.

🌸1862: లండన్ లోని థేమ్స్ నది మీద 'వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్'ని ప్రారంభించారు.

🌸1875: సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ స్కూల్ ను స్థాపించాడు. ఇదే 1920లో అలీఘర్ ముస్లిం యూనివర్శిటీగా అవతరించింది.

🌸1899: మొట్టమొదటి 'ఆటో రిపేర్ షాపు' బోస్టన్లోమొదలుపెట్టారు.

🌸1902: బ్రిటన్లో మొట్టమొదటి సారిగా 'ఎంపైర్ డే' జరుపుకున్నారు.1959లో 'ఎంపైర్ డే' పేరు 'కామన్ వెల్త్ డే' గా మార్చారు.

🌸1915: థామస్ ఆల్వా ఎడిసన్ టెలిఫోన్ సంభాషణలను రికార్డ్ చేయడానికి 'టెలిస్క్రైబ్' ని కనుగొన్నాడు.

🌸1916: ఆఖరి 'బ్రిటిష్-ఇండియన్ కాంట్రాక్టు' పనివాళ్ళు సురినాంకి వచ్ఛారు.

🌸1921: ఉత్తర ఐర్లాండ్ తన మొదటి పార్లమెంట్ ని ఎన్నుకొంది.

🌸1922: నెదర్లాండ్స్లో 1922 'మే' నెలలో చాలా ఎక్కువ వేడి (అత్యధిక ఉష్ణోగ్రత) నమోదైంది (35.6 °C సెంటిగ్రేడ్).

🌸1926: 3000 మీటర్ల పరుగు పందెంలో ' పావొ నుర్మి' 8:25.4 (8నిమిషముల 25.4 సెకన్లు) సమయంలో పరిగెట్టి, సరికొత్త రికార్డు స్థాపించాడు.

🌸1930: ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా కు, ఒంటరిగా, 'అమీ జాన్సన్' అనే మహిళ విమానంలో ప్రయాణించింది.

🌸1930: బ్రాడ్‌మాన్ 290 నిమిషాలలో, 29 ఫోర్స్ (నాలుగులు) లలో 252 పరుగులు సాధించాడు (ఆస్ట్రేలియా వెర్సస్ 'సర్రీ' )

🌸1931: మొట్టమొదటి 'శీతలీకరణ రైలు' ప్రవేశ పెట్టారు (బాల్టిమోర్, ఓహియో రైలు మార్గంలో)

🌸1941: హెచ్.ఎమ్.ఎస్. హుడ్, అనే బ్రిటిష్ యుద్ధనౌకను జర్మనీ యుద్ధనౌక డి.కె.ఎమ్. 'బిస్మార్క్' ముంచివేసింది. 1416 మంది మరణించారు.బ్రతికి బట్ట కట్టిన వారు ముగ్గురే ముగ్గురు.

🌸1951: అమెరికా 'ఎన్వెటక్' అనేచోట వాతావరణంలో 'అణుపాటవపరీక్ష' ను చేసింది.

🌸1954: భూమి నుంచి 241 కి.మీ (150 మైళ్ళ) పైకి రాకెట్ మొట్ట మొదటిసారిగా వెళ్ళింది (ఎగిరింది). (న్యూమెక్సికో లోని 'వైట్‌సాండ్స్'. ఇది ఎడారి ప్రాంతం).

🌸1954: జర్మన్ ఎయిర్ లైన్స్ లుఫ్తాన్సా పుట్టిన రోజు.

🌸1954: ఐ.బి.ఎమ్. కనుగొన్న, వాక్యూం ట్యూబ్ 'ఎలెక్ట్రానిక్' బ్రెయిన్, ఒక గంటలో 10 మిలియన్ (ఒక కోటి) పనులు (ఆపరేషన్స్) చేయగలదని ప్రకటించింది

🌸1957: తైవాన్ లోని 'తైపే' లో అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళన చేసారు.

🌸1957: కొలంబియాలో భయంకరమైన భూకంపం వచ్చింది.

🌸1959: ఇంగ్లాండ్లో 'ఎంపైర్ డే' పేరు 'కామన్ వెల్త్ డే' గా మార్చారు. 1902లో 'ఎంపైర్ డే' ని మొదటిసారిగా జరుపుకున్నారు.

🌸1961: అమెరికా పంపిన 'ఎక్స్‌ప్లోరర్ (12) ' ఉపగ్రహం భూకక్ష్యను చేరలేక, పడిపోయింది.

🌸1964: పెరు దేశంలోని 'లిమా సాకర్ స్టేడియంలో జరిగిన ప్రమాదంలో 300 మంది మరణించారు.

🌸1972: అమెరికా నెవడా అణు పరీక్ష కేంద్రంలో, అణుబాంబు పేల్చి పరీక్షించింది (అణుపాటవపరీక్ష).

🌸1975: రష్యాకు చెందిన 'సోయుజ్ 18బి' ఇద్దరు రోదసీయాత్రికులను 'సాల్యూట్ 4' 'స్ఫేస్ స్టేషను (రోదసీ కేంద్రం) కి తీసుకువెళ్ళింది.

🌸1977: యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) అధ్యక్షుడు 'పోడ్‌గొర్నీ' రాజీనామా చేసాడు.

🌸1985: బంగ్లాదేశ్లో వచ్చిన తుఫానుకి 10,000 మంది ప్రజలు మరణించారు.

🌸1988: నిమిషానికి 586 మాటలు మాట్లాడి, 'జాన్ మస్చిట్ట' రికార్డు స్థాపించాడు.

🌸1993: మైక్రోసాఫ్ట్ 'విండోస్ ఎన్.టి' (Windows NT) విడుదల చేసింది.

🌸1999: ఉక్రెయిన్ లో, గని లోపల, 'గాస్' వలన జరిగిన పేలుడు లో, 39 మంది గని కార్మికులు మరణించారు.

🌸2001: షెర్పా తెంబా (టెంబా) త్సెరి, అతి చిన్న వయస్సు (15వ ఏట) లో, ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు.

🌼జననాలు🌼

💝0015: జూలియస్ సీజర్, జెర్మానికస్, రోమ్ దేశపు సైన్యాధిపతి (మ.0019).

💝1686: 'డేనియల్ గాబ్రియల్ ఫారెన్‌హీట్' అతి కచ్చితంగా వేడిని కొలిచే 'థర్మామీటర్' (1714లో మెర్క్యురీ (పాదరసం) థర్మామీటర్) ని కనుగొన్నాడు. 1709 లో ఆల్కహాల్ థర్మామీటర్ ని కనుగొన్నాడు. (మ.1736).

💝1819: బ్రిటన్ రాణి విక్టోరియా, బ్రిటీషు మహారాణి. (మ.1901).

💝1911: ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2006)

💝1933: పి.జె.శర్మ, డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.2014)

💐మరణాలు💐

🍁1543: నికొలస్ కోపర్నికస్, ఖగోళ పరిశోధకుడు, పోలాండ్లోమరణించాడు.

🍁1997: నల్లమల గిరిప్రసాద్, కమ్యూనిస్టు నేత. (జ.1931)

🍁2013: రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, రచయిత, సాహితీ వేత్త. (జ.1928)

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉కామన్వెల్త్ దినోత్సవం 

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

🚨🚨 FLASH FLASH – AP SPECIAL TET 2026 HALL TICKETS 🚨🚨

📢 ఆంధ్రప్రదేశ్ స్పెషల్ టెట్ (AP SPECIAL TET) 2026 హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నిర్వహించనున్న AP Special TET 2026 పరీక్షకు హాజరుకానున్న ఇన్‌ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం హాల్ టికెట్లను అక్టోబర్ 5, 2026న విడుదల చేయనున్నారు. 📌 ముఖ్యమైన వివరాలు: 🔹 పరీక్ష పేరు: AP Special TET 2026 🔹 హాల్ టికెట్ల విడుదల తేదీ: 05-10-2026 🔹 పరీక్ష తేదీలు: 11-10-2026 నుంచి 21-10-2026 వరకు 🔹 పరీక్ష విధానం: ఆన్‌లైన్ (CBT) 🔹 అర్హులు: ఇన్‌ సర్వీస్ ఉపాధ్యాయులు 🌐 హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే వెబ్‌సైట్: https://tet2dsc.apcfss.in/ 📌 డౌన్‌లోడ్ విధానం: 1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 2. Candidate Login పై క్లిక్ చేయండి. 3. మీ Username, Password నమోదు చేయండి. 4. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. 5. ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి. ⚠️ అభ్యర్థులు తమ హాల్ టికెట్‌లోని పేరు, పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం, సమయం తదితర వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. 🙏 పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు! 📲 ఈ సమాచారాన్ని మీ ఉపాధ్యాయ మిత్రులకు కూడా షేర్ చేయండి. #APSpecialTET20...

హార్ట్‌ ఎటాక్‌ ముప్పు ఆల్కహాల్‌ వల్ల కాదండోయ్‌!..... మీరు ఎంతగానో ఇష్టపడి త్రాగే ఇదే...

ఎనర్జీ డ్డ్రింక్స్ వల్ల అని చెబుతున్నారు నిపుణులు! ఎనర్జీ డ్రింక్స్ హానికరం కాదని మీరు అనుకుంటున్నారా?  ఒకటి తాగిన తర్వాత మీ హృదయ స్పందన రేటు పెరుగుతుందా?  ఈ సందేహాలు మీకూ ఉన్నాయా?  'హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ డక్' గా పిలువబడే ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్ డిమిత్రి యారనోవ్ మీ సందేహాలకు సమాధానం ఇస్తున్నారు.  ఎనర్జీ డ్రింక్ వినియోగం యువకుల గుండె జబ్బులతో ముడిపడి ఉంటుంది.  అధిక ఎనర్జీ డ్రింక్ వినియోగం తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని అతను అంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ఉన్న రోగులను తాను ఎక్కువగా చూస్తున్నానని.. 20, 30 ఏళ్లలోపు యువకులు, ఆరోగ్యవంతులు అకస్మాత్తుగా గుండె వైఫల్యంతో బాధపడుతున్నారు. ధూమపానం అలవాటు లేదు, కుటుంబ చరిత్ర కూడా లేదు. కానీ వీరందరిలో ఓ ఉమ్మడి అలవాటు ఉంది. అది వారు ప్రతిరోజూ 3-4 డబ్బాల ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ రక్తపోటును పెంచుతాయని, అసాధారణ గుండె లయలకు కారణమవుతాయని, కాలక్రమేణా గుండె కండరాలను బలహీనపరుస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక కెఫిన్, ఉత్తేజకాలు గుండెను ఓవర్‌డ్రైవ్‌కు గురి చేస్తాయి...