Skip to main content

చరిత్రలో ఈ రోజు మే / - 18



🔎సంఘటనలు🔍

🌸1642: కెనడా దేశంలోని రెండవ పెద్ద నగరమైన మాంట్రియల్స్థాపించబడింది.

🌸1804: ఫ్రెంచ్ సెనేట్ నెపోలియన్ బోనపార్టెను చక్రవర్తిగా ప్రకటించింది

🌸1830 : కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి సెప్టెంబరు 3, 1831వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన ఏనుగుల వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.

🌸1860: చికాగో లో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశం లో, అబ్రహం లింకన్ ని అమెరికా అధ్యక్షుడుగా ప్రతిపాదించారు (నామినేటెడ్ ).

🌸1910: హేలీ తోకచుక్క భూమి మీద నుంచి కనిపించి, సూర్యుని వైపు తరలిపోయింది.

🌸1914: పనామా కాలువ ద్వారా కార్గో (సరుకు/సామాను) తో ప్రయాణించిన మొట్ట మొదటి స్టీం బోటు (ఆవిరితో నడిచే పడవ) పేరు మారినర్ .

🌸1933: టెన్నెసీ వేలీ అథారిటీ (టి.వి.ఏ) ని ఏర్పాటు చేసారు., దీని ఉద్దేశాలు.. టెన్నేస్సీ నది వలన వచ్చే వరదలను కట్టడి చేయటానికి, టెన్నెస్సీ లోయ లోని భూములలో అడవులను పెంచటము, గ్రామాలకు విద్యుత్తును అందించటము. టెన్నెసీ వేలీ అథారిటీ ఏడు రాష్ట్రాలలో పనిచేస్తుంది.

🌸1953:: జాక్వెలిన్ కోచ్రన్ నార్త్ అమెరికన్ ఎఫ్-86 కనడేర్ విమానం రోజర్స్ డ్రై లేక్ (కాలిఫోర్నియా) మీదగా నడిపిన మొట్టమొదటి మహిళ. ఎఫ్-86 చేసే శబ్దానికి స్త్రీలు తట్టుకోలేరన్న వాదనను పటాపంచలు చేసింది.

🌸1969: రోదసీ నౌక అపొలో 10 ని, ముగ్గురు రోదసీ యాత్రికుల (1. యూజీన్ ఎ. సెమన్, 2. థామస్ పి. స్టాఫర్డ, 3. జాన్ డబల్ యు. యంగ్) తో రోదసీ లోకి ప్రయోగించారు.

🌸1980: 93 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న, 9,677-అడుగుల ఎత్తున్న మౌంట్ సెయింట్ హెలెన్స్ అగ్నిపర్వతం (వాషింగ్టన్ రాష్ట్రము) పేలింది. అగ్నిపర్వతం పేలుడు హిరోషిమా పై వేసిన అణుబాంబు కంటే ఐదు వందల రెట్లు అధిక శక్తివంతమైనది. అగ్ని పర్వతం చిమ్మిన, ఆవిరి, బూడిద ఆకాశంలో 11 మైళ్ళఎత్తు దాటి, 160-మైళ్ళ వ్యాసార్ధములో ఆకాశం అంతా చీకటి మయం అయింది. అగ్నిపర్వతం చుట్టూ ఉన్న అడవులు అంటుకుని, ఆర్పటానికి సాధ్యం కాలేదు. ఈ పేలుడులోను, తరువాత మరణించిన వారు 67 మంది.. ఈ పేలుడు, 1300 అడుగుల ఎత్తున పర్వతం మీద జరిగి, 57 మంది మరణించటమో, కనపడకుండా పోవటమో జరిగింది

🌸1991: సోవియట్ సోయుజ్ అంతరిక్ష నౌకలో హెలెన్ షర్మన్ (మొట్ట మొదటి బ్రిటన్ మహిళ) అంతరిక్షంలోకి వెళ్ళింది.

🌸1995: నటి ఎలిజబెత్ మాంట్ గోమెరి, లాస్ ఏంజిల్స్ లో మరణించింది.

🌸2005: కువాయిట్ పార్లమెంట్ ఆడవారికి ఓటు హక్కుఇచ్చింది.

🌸2006: నేపాల్ రాజు యొక్క అధికారాలను తగ్గించటానికి, నేపాల్ పార్లమెంట్ ఒక తీర్మానం చేసింది

🌸2006: అంగోలా లో కలరా వ్యాపించింది.

🌸2006: భారత దేశపు, స్టాక్ మార్కెట్ అధఃపాతాళాన్ని తాకింది. సెన్సెక్స్ 826 పాయింట్లు, నిఫ్టీ 246 పాయింట్లు కోల్పోయాయి.

🌸2007: అంటార్కిటిక్ సముద్రం లో 700 కొత్త జీవులను కనుగొన్నారు.

🌸2011: స్పేస్ షటిల్ ఎండీవర్ ఆఖరి సారిగా ‍ (చివరి ప్రయాణం) రోదసీలోకి వెళ్ళింది.

🌸2012: అమెరికా కు చెందిన నాస్ డాక్ స్టాక్ ఎక్స్చేంజీలో, ఫేస్ బుక్ (సోషల్ నెట్ వర్క్ సంస్థ) 2012 మే 18 నాడు నమోదు అయింది.

🌸2012: రూపాయి మారకం విలువ డాలరు తో పోలిస్తే 54.90 స్థాయికి పడిపోయింది. రూపాయి – డాలరు మారకం విలువ చరిత్రలో, ఇది, అత్యంత తక్కువ స్థాయి.

🌼జననాలు🌼

💖1850: ఆలివర్ హీవిసైడ్, భౌతిక శాస్త్రవేత్త. అయనోస్పియర్ అనేది ఒకటి ఉందని, అది రేడియో తరంగాలను పరావర్తింప చేస్తుందని ఊహించి చెప్పిన శాస్త్రవేత్త.

💖1877: కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (మ.1923)

💖1883: జర్మన్ ఆర్కిటెక్ట్ (భవన నిర్మాత) వాల్టర్ గ్రోపియస్, బౌహౌస్ స్కూలు స్థాపకుడు జననం.

💖1914: సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘసేవకురాలు. (మ.2010)

💖1932: దూపాటి సంపత్కుమారాచార్య, సత్తుపల్లి లోని శారదా విద్యానికేతన్ కులపతి, రచయిత, శతావధాని

💐మరణాలు💐

🍁1886: అక్షయ్ కుమార్ దత్తా, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనమునకు ఆద్యులలో ఒకరు. (జ.1820)

🍁1986: కె.ఎల్.రావు, ఇంజనీరు, రాజకీయ నాయకుడు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. (జ.1902)

🍁2013: కళాధర్, చిత్ర కళా దర్శకుడు. (జ.1915)

🍁2014: పి.అంకమ్మ చౌదరి, హేతువాది, మానవతావాది. మానవతా విలువలున్న న్యాయమూర్తి.

🍁2018: పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కథారచయిత (జ.1938)

🍁2018: యద్దనపూడి సులోచనారాణి, నవలా రచయిత్రి. (జ.1940)

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉 అంతర్జాతీయ వస్తు ప్రదర్శనశాల దినోత్సవం
🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

🚨🚨 FLASH FLASH – AP SPECIAL TET 2026 HALL TICKETS 🚨🚨

📢 ఆంధ్రప్రదేశ్ స్పెషల్ టెట్ (AP SPECIAL TET) 2026 హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నిర్వహించనున్న AP Special TET 2026 పరీక్షకు హాజరుకానున్న ఇన్‌ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం హాల్ టికెట్లను అక్టోబర్ 5, 2026న విడుదల చేయనున్నారు. 📌 ముఖ్యమైన వివరాలు: 🔹 పరీక్ష పేరు: AP Special TET 2026 🔹 హాల్ టికెట్ల విడుదల తేదీ: 05-10-2026 🔹 పరీక్ష తేదీలు: 11-10-2026 నుంచి 21-10-2026 వరకు 🔹 పరీక్ష విధానం: ఆన్‌లైన్ (CBT) 🔹 అర్హులు: ఇన్‌ సర్వీస్ ఉపాధ్యాయులు 🌐 హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే వెబ్‌సైట్: https://tet2dsc.apcfss.in/ 📌 డౌన్‌లోడ్ విధానం: 1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 2. Candidate Login పై క్లిక్ చేయండి. 3. మీ Username, Password నమోదు చేయండి. 4. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. 5. ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి. ⚠️ అభ్యర్థులు తమ హాల్ టికెట్‌లోని పేరు, పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం, సమయం తదితర వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. 🙏 పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు! 📲 ఈ సమాచారాన్ని మీ ఉపాధ్యాయ మిత్రులకు కూడా షేర్ చేయండి. #APSpecialTET20...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

హార్ట్‌ ఎటాక్‌ ముప్పు ఆల్కహాల్‌ వల్ల కాదండోయ్‌!..... మీరు ఎంతగానో ఇష్టపడి త్రాగే ఇదే...

ఎనర్జీ డ్డ్రింక్స్ వల్ల అని చెబుతున్నారు నిపుణులు! ఎనర్జీ డ్రింక్స్ హానికరం కాదని మీరు అనుకుంటున్నారా?  ఒకటి తాగిన తర్వాత మీ హృదయ స్పందన రేటు పెరుగుతుందా?  ఈ సందేహాలు మీకూ ఉన్నాయా?  'హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ డక్' గా పిలువబడే ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్ డిమిత్రి యారనోవ్ మీ సందేహాలకు సమాధానం ఇస్తున్నారు.  ఎనర్జీ డ్రింక్ వినియోగం యువకుల గుండె జబ్బులతో ముడిపడి ఉంటుంది.  అధిక ఎనర్జీ డ్రింక్ వినియోగం తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని అతను అంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ఉన్న రోగులను తాను ఎక్కువగా చూస్తున్నానని.. 20, 30 ఏళ్లలోపు యువకులు, ఆరోగ్యవంతులు అకస్మాత్తుగా గుండె వైఫల్యంతో బాధపడుతున్నారు. ధూమపానం అలవాటు లేదు, కుటుంబ చరిత్ర కూడా లేదు. కానీ వీరందరిలో ఓ ఉమ్మడి అలవాటు ఉంది. అది వారు ప్రతిరోజూ 3-4 డబ్బాల ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ రక్తపోటును పెంచుతాయని, అసాధారణ గుండె లయలకు కారణమవుతాయని, కాలక్రమేణా గుండె కండరాలను బలహీనపరుస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక కెఫిన్, ఉత్తేజకాలు గుండెను ఓవర్‌డ్రైవ్‌కు గురి చేస్తాయి...