Skip to main content

చరిత్రలో ఈ రోజు మే / - 12



🔎సంఘటనలు🔍

🌸0254: పోప్ లూసియస్-I తరువాత పోప్ సెయింట్ స్టీఫెన్-I, 23వ కేథలిక్ పోప్ అయ్యాడు.

🌸1364: 'కాసిమిర్ III', పోలాండ్ రాజు 'జగీల్లోనియన్ యూనివర్సిటీ' (పోలాండ్ లోని అత్యంత ప్రాచీనమైన విశ్వవిద్యాలయం)ని నెలకొల్పమని, 'రాజ పత్రం' (రాయల్ ఛార్టర్) ఇచ్చాడు.

🌸1459: 'సన్ సిటీ ఇండియా' గా పేరుగాంచిన జోధ్‌పూర్ ని, రాథోర్ (డ్) వంశానికి చెందిన, రాజ్‌పుట్ ప్రముఖుడు, 'రావు జోధ్' స్థాపించాడు.

🌸1701: నెదర్లాండ్ లోని 'డ్రెన్త్' అనే ప్రాంతం గ్రెగొరియన్ కేలండర్ ని అమలు చేసింది (నిన్నటి రోజు తేది 1701 ఏప్రిల్ 29 నుంచి నేటి తేది 1701 మే 12 కి తేదీలు మారాయి. అంటే ఈ మధ్య రోజులు అన్నీ మాయమయ్యాయి అన్న మాట)

🌸1777: మొట్టమొదటి 'ఐస్ క్రీం' ప్రకటన (ఫిలిప్ లెంజి - న్యూయార్క్ గెజెట్ లో ప్రకటించారు).

🌸1792: నియమిత సమయంలో దానంతట అదే శుభ్రం చేసుకునే మరుగుదొడ్లు (టాయిలెట్స్ ఫ్లషింగ్) పేటెంటు హక్కులు పొందారు.

🌸1835: ఛార్లెస్ డార్విన్ ఉత్తర ఛిలి దేశంలో ఉన్న రాగిగనులను చూడటానికి వెళ్లాడు.

🌸1908: 'నాథన్ బి. స్టబ్‌ల్‌ఫీల్డ్' 'వైర్‌లెస్ రేడియో ప్రసారానికి' పేటెంట్ హక్కులు తీసుకున్నాడు.

🌸1921: మొట్ట మొదటి 'నేషనల్ హాస్పిటల్ డే' ని అమెరికాలోజరుపుకున్నారు.

🌸1926: బ్రిటన్‌లో కార్మిక సంఘాలు చేసిన 9 రోజుల సాధారణ సమ్మెను విరమించారు.

🌸1937: కింగ్ జార్జి VI పట్టాభిషేకం గ్రేట్ బ్రిటన్లో జరిగింది.

🌸1942: 1500 మంది యూదులను 'ఆస్చ్‌విట్జ్ కాన్సెంట్రేషన్ కేంపు' లో విషవాయువు ద్వారా చంపేసారు. ఈ కేంపు నాజీ జర్మనీ ఆక్రమించిన పోలాండ్ లో ఉంది.

🌸1942: అమెరికాకు చెందిన రవాణానౌకను, మిస్సిసిపి నదీ ముఖద్వారం దగ్గర, నాజీ లకు చెందిన యు-బోటుముంచేసింది.

🌸1943: జర్మన్ సైన్యం, ఉత్తర ఆఫ్రికాలో లొంగిపోయింది.

🌸1949: అమెరికాలో మొట్ట మొదటి మహిళా రాయబారిగా శ్రీమతి విజయలక్ష్మి పండిట్ ని భారతదేశం నియమించింది.

🌸1951: మొదటి ఉదజని బాంబు (హైడ్రోజన్ బాంబు)ను'ఎనెవెటక్ అటోల్' అనే చోట పరీక్షించారు.

🌸1952: 'గజ్ సింగ్' జోధ్‌పూర్ మహారాజుగా కిరీట ధారణ జరిగింది.

🌸1956: తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్) తీవ్రమైన తుఫాను, ఎత్తైన సముద్రపు అలలతో, అతలాకుతలమైంది.

🌸1965: సోవియట్ యూనియన్ ప్రయోగించిన రోదసీనౌకలూనా 5 చంద్రుని నేల మీద నెమ్మదిగా దిగలేక కూలిపోయింది. ప్రయోగం విఫలమైంది.

🌸1982: 'యు.ఎస్. ఫుట్‌బాల్ లీగ్' ఏర్పడింది.

🌸1984:ఫ్రాన్స్ అణుబాంబును పరీక్షించింది.

🌸1984: నెల్సన్ మండేలా,దక్షిణాఫ్రికాలో ఖైదు చేయబడిన 22 సంవత్సరాల తరువాత తన భార్యను చూసాడు.

🌸1986: అమెరికాకు చెందిన 'ఫ్రెడ్ మార్ఖం' తన రెండుచక్రాల సైకిలు పై, గంటకు 65 మైళ్ళ (104.607 కి.మీ) వేగం సాధించాడు.

🌸1991: పసిఫిక్ ప్రాంతపు వాయవ్య దిక్కులో దొరికే, అరుదైన మూలికతో కేన్సర్ వ్యాధికి ఒక కొత్త మందును కనుగొన్నారు.

🌸1992: ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొదటి బెల్జియం దేశ మహిళ 'ఇన్‌గ్రిడ్ బేయెన్స్'.

🌸1997: ఆస్ట్రేలియాకు చెందిన 'సుసాన్ జీన్ (సుసీ) మరోనీ' (22 సంవత్సరాలు),క్యూబా నుంచి ఫ్లోరిడా స్ట్రెయిట్స్ (అమెరికా) వరకూ (180 కి.మీ - 112 మైళ్ళు) ఈత కొట్టిన మొదటి మనిషి, మొదటి మహిళ. ఈమె సెరిబ్రల్ ఫాల్సీవ్యాధితో పుట్టింది.

🌸2002: మాజీ అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ 5 రోజుల క్యూబా పర్యటనకు వెళ్లాడు. 1959 లో, క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో తిరుగుబాటు చేసిన తరువాత పర్యటించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్.

🌸2008: చైనాలోని సిచుయాన్లో రెక్టర్ స్కేల్ మీద 8.0 మేగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం వచ్చి, 69,000 మంది మరణించారు.

🌸2010: బ్రిటన్ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన డేవిడ్ కామెరాన్ ప్రమాణస్వీకారం చేశాడు.

🌸2010: 'ఆఫ్రిఖియా ఏర్‌వేస్' కి చెందిన విమానం కూలి అందరూ మరణించారు ఒక్కడు తప్ప.

🌸2012: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయొజెనిక్ ఇంజిన్ ప్రయోగం సఫలమైంది. దీనిని, ఉపగ్రహ ప్రయోగ వాహకం జి.ఎస్.ఎల్.వి-డి5 లో బిగించుతారు. భారతదేశం, అమెరికాను ఈ ఇంజిన్లు అడిగినప్పుడు భారత దేశానికి ఇవ్వకుండగా, భారత దేశానికి అనేకమైన అడ్డంకులను కల్పించింది.

🌼జననాలు🌼

💖1401 : షొకొ చక్రవర్తి, జపాన్ 101వ చక్రవర్తి (మ. 1428)

💖1820: ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లారెన్స్ నైటింగేల్, సమాజ సేవకురాలు, నర్సు. (మ. 1910)

💖1895: జిడ్డు కృష్ణమూర్తి, భారతీయ తత్వవేత్త. (మ. 1986)

💖1899: ఇంద్రా దేవి, లాట్వియన్ యోగా గురువు (మ. 2002)

💖1920: వింజమూరి అనసూయ, జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత

💖1924: షేక్ చిన మౌలానా, నాదస్వర విద్వాంసులు (మ.1999)

💖1926: భాట్టం శ్రీరామమూర్తి, జర్నలిస్టు, రాజకీయవేత్త.

💖1937: జార్జ్ కార్లిన్, అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు,, రచయిత. (మ.2008)
💖1945: కె. జి. బాలకృష్ణన్, భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి.

💖1950: షోజొ ఫుజీ, జూడో ఛాంపియన్

💖1951: గున్నార్ లార్సన్ స్వీడెన్, 200 మీటర్లు / 400 మీటర్లు ఈతగాడు (1972 లో ఒలింపిక్ బంగారుపతకాన్ని గెలిచాడు).

💖2003: ప్రిన్స్ సద్రుద్దిన్ ఆగా ఖాన్, ఫ్రెంచి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫొర్ రెఫ్యూజీస్ (కాందిశీకులకు) (జ.1933)

💐మరణాలు💐

🍁1871: జాన్ ఎఫ్.డబ్లు. హెర్షెల్, బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త (నెబ్యులాలను కేటలాగ్ లో ప్రకటించాడు. (నక్షత్ర మేఘాల పట్టిక తయారుచేసిన వాడు)).

🍁1922: మాస్టర్ సి.వి.వి., భారతీయ తత్త్వవేత్త, యోగి, గురువు.(జ.1868)

🍁1946: ధారా వెంకట సుబ్బయ్య, భక్త ప్రహ్లాద, వేణీ సంహారం, భీష్మ నిర్యాణం, గయోపాఖ్యానం, పాండవోద్యోగ విజయాలు మొదలైన నాటకలను రసవంతంగా ప్రదర్శించేవారు

🍁2009: గుత్తి రామకృష్ణ, కథకుడు, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1915)

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉 'నేషనల్ హాస్పిటల్ డే' ని 1921 నుంచి అమెరికాలోజరుపుకుంటున్నారు.

👉 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

ఫ్లాష్ ఫ్లాష్ NEET UG 2026 ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET UG 2026 పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఆన్సర్ కీతో పాటు రికార్డ్ చేసిన స్పందనలు (Response Sheet) పరిశీలించవచ్చు. ఆన్సర్ కీలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే, నిర్ణీత గడువులోగా అధికారిక విధానం ప్రకారం ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం నిపుణుల పరిశీలన తర్వాత తుది ఆన్సర్ కీ విడుదల చేసి, ఫలితాలను ప్రకటిస్తారు. NEET అభ్యర్థులు ఆలస్యం చేయకుండా తమ ఆన్సర్ కీని పరిశీలించి అవసరమైతే అభ్యంతరాలు నమోదు చేసుకోవాలని సూచించబడుతోంది. Click here to get key Lakshya Educational Groups

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...