▪️మూడు రంగుల్లో ఉన్న జెండాకు కాంగ్రెస్ పార్టీ 1921 లో సరిగ్గా ఇదే రోజు అధికారిక గుర్తింపునిచ్చింది. స్వాతంత్ర్య వచ్చిన అనంతరం కొన్ని మార్పులతో ఇదే జెండానే భారతదేశ త్రివర్ణ పతాకంగా గుర్తించారు. ఈ జెండాను పింగలి వెంకయ్య తయారుచేశారు. జెండా భారతదేశంలోని రెండు ప్రధాన మతాలను సూచించే ఎరుపు, ఆకుపచ్చ రంగులను కలిగి ఉన్నది. ఈ జెండాను గాంధీజీకి చూపించగా.. జెండాలో తెలుపు రంగు, నూలు వడికే చక్రం ఉంచాలని పింగలికి సూచించారు. తెలుపు రంగు భారతదేశంలోని మిగిలిన మతాలను, చర్ఖా స్వదేశీ ఉద్యమాన్ని సూచిస్తుంది.
▪️1923 లో నాగ్‌పూర్‌లో జరిగిన శాంతియుత నిరసన సందర్భంగా వేలాది మంది ప్రజలు ఈ జెండాను చేతిలో పట్టుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో సుభాష్ చంద్రబోస్ కూడా ఈ జెండాను ఉపయోగించారు. అదే సమయంలో జెండా రంగులను మతాలతో అనుసంధానించడంపై వివాదం చెలరేగింది. జెండాకు పసుపు రంగును చేర్చాలని లేదంటే అన్ని మత చిహ్నాలను తొలగించాలని సిక్కులు డిమాండ్ చేశారు.
▪️స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ జెండా కొన్ని మార్పులు చేసి భారతదేశ పతాకంగా మార్చాలని రాజ్యాంగ కమిటీ నిర్ణయించింది. జెండా మధ్యలో ఉన్న నూలు వడికే చర్ఖా స్థానంలో అశోక చక్రం వచ్చి చేరింది. జెండాను మొదట అధికారికంగా 1947 జూలై 22 న ఎగురవేశారు.
👉 మరికొన్ని ముఖ్య సంఘటనలు..
ఇవాళ ప్రపంచ పొగాకు రహత దినోత్సవం
👉 2017: భారత్‌ను ప్రిఫరెన్షియల్ ట్రేడింగ్ జాబితా నుంచి తొలగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
👉 1962: వేలాది మంది యూదులను చంపాడన్న ఆరోపణలపై అడాల్ఫ్ ఇక్మాన్‌ను ఉరితీసిన ఇజ్రాయెల్
👉 1961: స్వతంత్ర దేశంగా రూపుదిద్దుకున్న దక్షిణాఫ్రికా
👉 1959: టిబెట్ నుంచి బహిష్కరించిన తర్వాత భారత్‌లో ఆశ్రయం పొందిన బౌద్ధ మత గురువు దలైలామా
👉 1935: పాకిస్తాన్లోని క్వెట్టా నగరంలో భూకంపం, 50 వేలకు పైగా ప్రజలు దుర్మరణం
👉 1927: తన ప్రసిద్ధ కారు మోడల్ టీ ఉత్పత్తిని నిలిపివేసిన కార్ల తయారీదారు ఫోర్డ్ సంస్థ
👉 1907: అమెరికా న్యూయార్క్ నగరంలో మొదటిసారి అందుబాటులోకి ట్యాక్సీ సేవలు
👉 1725: హోల్కర్ రాజవంశం రాణి అహల్యాబాయి హోల్కర్ జననం
Comments
Post a Comment