Skip to main content

నేటి మోటివేషన్... వాళ్లేందులోను తక్కువ కాదు...



గౌతమ్....!మనం సంబంధంచూసి వచ్చిన అమ్మాయి ని నా కోడలి గా చేసుకోవడం నాకు ఇష్టం లేదు రా ....!ఏ అమ్మా ? అమ్మాయి నచ్చలేదా ? ఎందుకు నచ్చలేదు ?మీ నాన్న వాళ్ళ ఫామిలీ గురించి ఎంక్వయిరీ చేసారు. వాళ్ళ నాన్న తన చిన్నప్పుడే ఇల్లొదిలి వెళిపోయాడట. వాళ్ళ అమ్మ ఎవడినో ఉంచుకుందట. ఇలాంటి ఫామిలీ నుండి కోడల్ని తెచ్చుకుంటే మన కుటుంభం పరువు పోతుంది. ఒక్క గానొక్క కొడుకువి నీకు వచ్చే ఫామిలీ చాల పద్దతి కలదై ఉండాలి. వెంటనే ఆ అమ్మాయికి ఫోన్ చేసి మా పారెంట్స్ వొద్దు అంటున్నారు అని ఎదో ఒకటి చెప్పి ఆ అమ్మాయితో మాట్లాడటం మానెయ్ అంది కోపంగా.అందుకే ఈ మ్యాట్రిమోని, ఆన్లైన్లో వచ్చే సంబంధాలని నమ్మకూడదు అంటారు. వాళ్ళ కుటుంభం ఇలాంటిదని దాచి పెట్టి ఎదో ఆన్లైన్ లో మాటలు కలిపి సంబంధం కలిపేసుకుందాం అనుకున్నారు.చి చి ....! మనం ఎంక్వయిరీ చేయబట్టి సరిపోయింది. లేదంటే ఎంత పరువు పోయేది. ఇక ఆ కుటుంబం గురించి, ఆ అమ్మాయి గురించి మర్చిపో సరేనా ...! అంటూ పూజ గురించి నిష్ఠురంగా మాట్లాడుతుంది గౌతమ్ తల్లి.ఇది అంత విని గౌతమ్కూల్ గా పూజ నా దగ్గర ఏది దాచి పెట్టలేదు. కాల్ చేసిన మొదటి రోజే అన్ని చిప్పింది.. మీకు ఇష్టం అయితేనే మిగతావి మాట్లాడండి అని క్లియర్ గా చెప్పింది. చి చి మా అమ్మ ఎవడినో ఉంచుకుంది ఐన నన్ను నువ్వు చేసుకో అని సిగ్గు లేకుండా ఆ పిల్ల చెప్పడం దానికి నువ్వు ఎదో గొప్ప పని చేసినట్టు ఈ సంబంధం ఒప్పుకోవడం ఏంటి రా నువ్వు? నిన్ను ఇలాగేనా నేను పెంచింది ...! సిగ్గుండాలి అలంటి ఇంటి పిల్లని చేసుకుంటా అని చెప్పడానికి. అప్పటిదాకా కూల్ గా ఉన్న గౌతమ్ కి కోపం వచ్చింది ఆపమ్మా ఇంకా ...! ఎం తెలుసనీ నువ్వు ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడుతున్నావ్ ?ఇంకేం తెలుసుకోవాలిరా తల్లే సరిగా లేకపోతె పిల్ల ఎలా ఉంటదో తెలియదా ? అంటూ రెట్టించి మాట్లాడింది గౌతమ్ తల్లి.చూడమ్మా వాళ్ళ అమ్మ తప్పు చేసింది అని నువ్వు అంటున్నవ్ ...! కానీ చేసిందా లేదా ? ఎం చేసింది ? ఎందుకు చేసింది ఏంటి అనేది ఆలోచించవా ? ఇంకేంటి రా ఆలోచించేది ఈవిడ గురించి తెలిసే వాళ్ళ ఆయన వదిలి పోయుంటాడు అన్నది చిరాకుగా. అమ్మ పూర్తి గా తెలుసుకోకుండా మాట్లాడకు. నీలాగ ఏమి తెలియకుండా చెప్పిన వాళ్ళ మాటలు విని అందరు వాళ్ళ ఫామిలీని అపార్థం చేసుకుంతున్నారు.మరి నీకు తెలిసినది ఏంటో చెప్పారా ? చెప్పు ..!చెప్తా విను ...!పూజ వాళ్ళు 5 మంది ఆడపిల్లలు. పూజ వాళ్ళ అమ్మ వొద్దన్న వినకుండా అబ్బాయి కావాలి అని స్తోమత లేకపోయినా 5 మంది పిల్లల్ని కనిపించాడు వాళ్ళ నాన్న. చివరికి నా పెళ్ళానికి ఇంకా మగ పిల్లాడు పుట్టాడు అని నిర్దాక్షణ్యంగా కట్టుకున్న భార్యని, 5 గురు ఆడపిల్లల్ని నడిరోడ్డు మీద వదిలేసి పోయాడు.కూలి పని చేసిన ఆ పిల్లలకి కడుపునిండా అన్నం పెట్టలేని దుస్థితి వాళ్ళ అమ్మది. ఈ రోజుల్లో లాగ ఆ రోజుల్లో ఆడపిల్లకి చదువెక్కడిదమ్మ ? ఏ పని చేసిన వాళ్ళకి సరిపడే తిండి లేదు, అందరు చిన్న పిల్లలు, ఒక ఆడది ఆ రోజుల్లో వాళ్ళ కడుపు నింపటానికి ఎంత కష్టపడాలి ఆలోచించు. నా అనే వాళ్లు లేక, కట్టుకున్న భర్త నడి రోడ్డున వదిలేస్తే దిక్కులేని స్థితిలో ఆమెని ఆదుకున్నాడు ఒక వ్యక్తి.ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో విడాకులు, సేటిల్మెంట్స్ లేవు. ఎప్పటికైనా తన భర్త తిరిగొస్తాడని వాళ్ళ అమ్మ ఎదురు చూపులు, ఒక పక్క వీళ్ళ ఆకలి కేకలు. పూజ తల్లి ని ఉక్కిరి బిక్కిరి చేసాయి. మగ దిక్కు లేని సంసారం కావడంతో ప్రతి ఒక్కరు చులకనగా చూసేవాళ్ళు. అప్పుడే కుమార్ గారు ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఆయనొక బ్రహ్మకుమారి సమాజం లో సభ్యుడు. ఆయనకీ పెళ్లి, సంసారం వీటి మీద కోరికలు ఉండవు. ఆయన దగ్గర డబ్బు ఉంది. ఆమే పరిస్థితి చూసి జాలి పడి పిల్లల్ని సాకుతా అని చెప్పాడు. ఇన్నేళ్ళలో ఆయనకీ ఒక పనిమనిషిలా సేవ చేయడానికే వాళ్ళ ఇంటికి వెళ్ళింది తప్పితే మీరనుకున్నట్టు కాదు. పుట్టేది ఆడ, మగ అనేది మగాడి సెల్స్ మీద ఆధారపడి ఉండదని ఆ తండ్రికి తెలియదు, కొడుకే వంశోద్ధారకుడు కానక్కర్లేదు కూతుళ్ళు కూడా కుటుంబాన్ని నడిపిస్తారని ఆ మూర్కపు తండ్రి తెలుసుకోలేక తన దారి తాను చూసుకున్నాడు. ఒక ఆడ మగ పెళ్లి పెటాకులు లేకుండా ఒకే చూరి కింద ఉంటె చూసి అక్రమ సంబంధం అంటగట్టే ఈ సమాజానికి వాళ్ళని ఆదుకోవాలని, ఆ పిల్లల ఆకలి తీర్చాలని ఒక్కరికి అనిపించలేదు. పూజ ఇప్పుడు నర్స్ గా ఎంతో మందికి సేవ చేస్తుంది. తన కాళ్ళ మీద తాను నిలబడింది. మిగిలిన అక్క చెల్లెల్లు ఎదో ఒక ఉద్యోగం చేసుకుంటూ గౌరవంగా బ్రతుకుతున్నారు.
 20 ఏళ్ళ క్రితం వాళ్ళ నాన్న చేసిన తప్పుకి వీళ్ళు ఇంకా శిక్ష అనుభవిస్తున్నారు. ఏంటమ్మా ఇది? ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్స్ని మోసం చేస్తాయి. ఎవడో ఎదో చెప్పాడని పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడొద్దమ్మ. నిజంగా వాళ్ళ కుటుంబం తప్పు చేసి ఉంటె పూజ ముగ్గురు అక్కలకి పెళ్లిళ్లు అయ్యేవి కాదు. సమాజంలో ఇంకా మానవత్వం ఉంది. అది మన ఇంట్లో కూడా అని నేను అనుకుంటున్న. ఇప్పుడు చెప్పు పూజకి ఫోన్ చేయమంటావా? అని అడిగాడు గౌతమ్ చెయ్యు.... ఫోన్ చేసి నా కోడలితో నేను మాట్లాడాలి, టైంకి తినమని చెప్పాలి. మరీ బక్క గా ఉంది పిల్ల అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ నవ్వింది గౌతమ్ తల్లి.
ఫ్రెండ్స్ ఎప్పటిలాగే నేను మీకు యదార్ధ సంఘటనలని కధల రూపంలో అందిస్తున్న. ఇందులో పేర్లు,సందర్భాలు మారవచ్చు కానీ జరిగింది మాత్రం వాస్తవం. పూర్తిగా తెలుసుకోకుండా ఎవరిని నిందించకండి. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు. ఆడ మగ బేధం 20 ఏళ్ళ క్రితం చూపించ బట్టి ఈనాడు ఆ కుటుంభం ప్రతి ఒక్కరికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక తండ్రి చేసిన తప్పుకి ఆ ఆడపిల్లలు ఇప్పటికి శిక్ష అనుభవిస్తున్నారు. అపుడు తెలియక కానీ వదిలేసారు. ఇప్పుడు ఆడ పిల్ల అని తెలిసి చంపేస్తున్నారు. ఇలాగే చేసే మన ముందు తరాలకి ఆడపిల్ల దొరక్క, అబ్బాయి కు ఒక మంచి ఆడ రోబోని చూసి పెళ్లి చేయాల్సిన పరిస్థితి రావొచ్చు. జాగ్రత్త.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

  1. మరిన్ని ఇలాంటివి అందించండి మాకు
    మీరు చేస్తున్న కార్యక్రమాలు చాలా స్ఫూర్తివంతంగా ఉంటున్నాయి... మీకు మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి సార్
    ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాణ వాయువు కోసం సమరంకు నా వంతుగా సహాయం చేశాను సార్...

    ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్... ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల...

10th results link: 1 10th results link: 2 Direct link 10th results link: 3 10th results link: 4 10th results link: 5  100% working link use this all 10th results link: 6  most searched link 10th results link: 7 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺