ఆనంద్ ముసలి వాడు అవుతున్నాడు . తన బిజినెస్ ఎవరో ఒకరికి అప్పచెప్పేసి హృషీకేష్ వెళ్లిపోవాలి అని నిర్ణయించుకున్నాడు .
తన ఇన్ని కోట్ల వ్యాపారం వారసులకు ఇవ్వడమా ? కంపనీ డైరెక్టర్ ల కొడుకులకు ఇవ్వడమా ? ఏమి చెయ్యాలి ?
ఒక రోజు కంపెనీ సిబ్బందిని అందరినీ సమావేశ పరచాడు .
నేను రెండు మూడు నెలల తర్వాత హృషీకేష్ కి వెళ్లిపోవాలి అని నిర్ణయించుకున్నాను . ఈ కంపెనీ చీఫ్ ఎక్జిక్యూటివ్ పోస్టుకు మీలో ఒకరిని నియమించాలి అని నిర్ణయించుకున్నాను . అయితే అందుకు నేను ఒక విధానం ఆలోచించాను
“నేను ఈ రోజు మీలో ప్రతీ ఒక్కరికీ ఒక “విత్తనం” ఇవ్వదలచుకున్నాను . ఆ విత్తనాన్ని మీరు కుండీలో నాటి , నీరు పోసి నెల రోజుల తర్వాత నాకు చూపాలి.. ఎవరు చూపుతారో వారికి ఆ పదవి ఇవ్వాలని నిశ్చయించుకున్నాను . మీకు అంగీకారం అయితే మీరు తీసుకున్న వివరాలు ఆఫీస్ లో నమోదు చేయించుకుని పట్టుకు వెళ్ళండి . సరిగా నెల రోజుల తర్వాత మనం కలుద్దాం”
ఆయన ఇచ్చిన విత్తనాలను అందరూ తీసుకున్నారు. అలాగే ప్రదీప్ కూడా తీసుకున్నాడు . రాధిక తో చెప్పాడు . కుండీ కొని అందులో విత్తనం వేశారు . రోజూ నీళ్ళు పోస్తున్నాడు . ఒక వారం గడిచింది . ఆఫీస్ లో అందరూ తాము పెంచుతున్న మొక్క ఎదుగుదల గురించి చర్చించడం మొదలు పెట్టారు . ప్రదీప్ వాళ్ళ ఇంట్లో వేసిన “విత్తనం” ఇంకా మొలకెత్తలేదు . ప్రదీప్ కి అర్ధం కాలేదు . విత్తనం తీసి చూశాడు . ఉంది . ఇంకా మొలకెత్తలేదు . ఏమయ్యుంటుంది ? అందరి విత్తనాలూ మొలకలు వచ్చి పెద్దవి అవుతున్నాయి . మూడు వారాలు గడచిపోయాయి . కొందరు వేసిన విత్తనాలు పెరిగి పెద్దవి అయ్యి పూలు వస్తున్నాయి ట .
ప్రదీప్ ఇంటిలో వేసిన “విత్తనం” లో ఎటువంటి మార్పూ రాలేదు .
పోటీలో ఓడిపోయాను . ఎక్కడో లోపం జరిగింది . ప్రదీప్ లో నిరాశ !
ఎవరితోనూ ఏమీ చెప్పలేదు ప్రదీప్ .
నాలుగో వారం వచ్చేసింది
మళ్ళీ అందరూ సమావేశం అయ్యారు . కొందరు తమ మొక్కను ప్రత్యేకం ఆటో లలో తీసుకు వచ్చారు . ఆ రోజు ప్రదీప్ కి ఆఫీస్ కి వెళ్ళాలి అనిపించలేదు.
మీరేమీ లోటు చెయ్యలేదు . మీరూ వెళ్ళండి . మీరు వేసిన “విత్తనం” ఎందుకు మొలకెత్తలేదో తెలుస్తుంది కదా ! అన్న రాధిక సాంత్వన తో ఆఫీస్ కి బయలుదేరాడు . తాను వేసిన “విత్తనం” కుండీని చిన్న బేగ్ లో పెట్టుకుని
ఆఫీస్ రకరకాల మొక్కలతో నందన వనం లా కళకళలాడుతోంది . తాను తెచ్చిన కుండీ ఎక్కడ పెడితే ఎవరు ఏమంటారో అని తలుపు వారగా పెట్టాడు . ఆ కుండీని చూసిన కొందరు జాలిగా చూశారు . కొందరు వెక్కిరిస్తున్నట్టు చూశారు .
ఒక మూలగా తాను కూర్చున్నాడు .
ఆనంద్ రూమ్ లోకి వచ్చాడు .
అందమైన ఆ మొక్కలను చూశాడు .
"ఓహ్ ! ఎంత అందమైన గొప్ప గొప్ప మొక్కలను పెంచారు ? ఈ రోజు మీలో ఒకరు ఈ కంపెనీ అధికారి కాబోతున్నారు . ప్రదీప్ ! నువ్వేమిటి ఖాళీ కుండీ తెచ్చావు ?
ప్రదీప్ ఒక్కసారి ఊపిరి పీల్చాడు . జరిగిన కధను యధాతధం గా వివరించాడు .
ఆనంద్ “ ఫ్రెండ్స్ ! అందరూ కూర్చోండి . మీకు నేను మీ కంపెనీ సి ఈ ఓ ని చూపబోతున్నా ! ఆ వ్యక్తి మిస్టర్ ప్రదీప్ !”
అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు
“అదేంటి సర్ ? అతడు మొక్కను పెంచలేదుగా ?”
ఆనంద్ అన్నాడు ,
‘ ఫ్రెండ్స్ ! మిమ్మల్ని నేను విత్తనం పట్టుకు వెళ్లి నాటి నీళ్ళు పోసి నెలరోజుల తర్వాత తీసుకు రమ్మన్నాను. నేను మీకు విత్తనాలు ఇచ్చినపుడు అవి కొద్దిగా వేడి చేసి ఇచ్చాను . వాటిలో జీవ శక్తి లేకుండా చేసి ఇచ్చాను . అవి దగ్ధ బీజాలు . అవి మొలకేత్తవు అని నాకు తెలుసు .”
“అందుచేత ప్రదీప్ ని నేను ఈ కంపెనీ సి . ఈ . ఓ గా నియమిస్తున్నాను”
• మీరు నిజాయతీని నాటితే నమ్మకాన్ని పొందుతారు
• మంచిని నాటితే మిత్రులను పొందుతారు
• నిగర్వం నాటితే గొప్పదనం పొందుతారు
• వినయాన్ని నాటితే తృప్తిని పొందుతారు
• పరిశీలన దృక్పధం నాటితే మంచి దృష్టి పొందుతారు
• శ్రమను నాటితే విజయం పొందుతారు
• క్షమను నాటితే సయోధ్యను పొందుతారు
• ప్రార్ధనలు నాటితే భగవానుని పొందుతారు
* If you plant honesty, you will reap trust
* If you plant goodness, you will reap friends
* If you plant humility, you will reap greatness
* If you plant perseverance, you will reap contentment
* If you plant consideration, you will reap perspective
* If you plant hard work, you will reap success
* If you plant forgiveness, you will reap reconciliation
* If you plant faith in God, you will reap a harvest
మీరు నేడు నాటిన విత్తనం బట్టి రేపు మీరు పొందే వృక్షం ఉంటుంది.
మీరు ఇచ్చేదే మీకు తిరిగి వస్తుంది
Comments
Post a Comment