Skip to main content

నేటి మోటివేషన్... ప్రతి ఒకరి హృదయాన్ని కదిలించే కథ.. మన ఇంటి 'ఆడ' కూతురు .



ఓ చిన్న కధ .
చాలా బాగుంటుంది ...
తన కూతురును ప్రేమించే ప్రతి తండ్రి చదవాల్సిన - అధ్బూత కధనం తప్పకుండా చదవండి .

అమ్మాయి పెళ్ళికై నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు, ఆరోజున !

అది గొప్పింటి సంబంధం కావడంతో కుటుంబం ఎంతో సంతోషించింది.
తండ్రి శర్మగారు ఎంతగనో ఆనందించాడు.
పిల్లవాడు, అతని తల్లిదండ్రులు చాల మంచివారు. దాంతో శర్మగారికి ఎంతో భారం తగ్గినట్లనిపించింది. 

పెళ్ళికిముందు ఒకరోజు పెళ్ళికూతురు తండ్రి శర్మగారు వియ్యంకుడు వాళ్ళింటికి వెళ్ళాలసివస్తుంది.

అయితే ఆరోజు శర్మగారి ఆరోగ్యం బాగాలేదు. మొదటిసారి కావడం తో కాదనలేకపోయాడు. వరునితరఫువాళ్ళు ఎంతో సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించారు. 

కొద్దిసేపు వచ్చినపని విషయమై మాట్లాడుతుండగానే తేనీరు వచ్చింది.
శర్మగారికి మధుమేహం ఉండడంతో చక్కెర పదార్ధాలకు దూరంగా ఉంటున్నారాయన.

అయితే మగపెళ్ళివారింటిలో శర్మగారు మొహమాటంతో ఇచ్చిన టీ కప్పును చేతిలోనికి తీసుకున్నారు తాగడానికై.

మొదటిగుటక వేస్తూనే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

అందులో పంచదార లేదు సరికదా,
తనకిష్టమైన యాల కులపొడి వేశారు.

మాఇంటిపధ్ధతిలోనే చేసిన టీ వీరింటిలోనూ తాగుతున్నారే అని అనుకున్నారాయన.

మధ్యాహ్నం భోజనం చేశారు,
అదీ అచ్చు తమ ఇంటివంట లాగానేఉంది.

వెంటనే ఏం బయలు దేరుతారు,
కొంచెంవిశ్రాంతి తీసుకోండి అంటూ పడకగదికి తీసుకెళ్ళారు.
అచ్చటి దుప్పటి తను కప్పుకునే దుప్పటి లాగ పలచటిది.
కునుకుతీసి లేచేటపపటికి రాగిచెంబులో నీరిచ్చారు తాగడానికి.

బయలుదేరేముందు ఇక అడగకుండా ఉండలేకపోయేరు శర్మగారు...'నేను ఏం తింటాను,
ఎలా తాగుతాను,
నా ఆరోగ్యానికి ఏది మంచిది ...
ఇవన్నీ మీకెలాతెలుసు?' అని.

అమ్మాయి అత్త గారు ఇలా అంది....
'నిన్నరాత్రి మీఅమ్మాయిఫోన్ చేసి మీగురించి అన్నీ చెప్పింది.
మానాన్నగారు మొహమాట పడతారు.
వారిగురించి మీరే శ్రధ్ధ తీసుకోవాలనికోరింది.'

శర్మగారి కళ్ళల్లో నీరు తిరిగింది.

శర్మగారు ఇంటికి రావడంతోనే భార్యను పిలిచి ఇలా అన్నారు...
'లలితా, మా అమ్మ చనిపోలేదు.'

'ఏవిటండీ మీరు మాటాడుతున్నది'

'అవును లలితా,
నన్ను కంటికి రెప్పలా చూసుకొనే నా తల్లి బతికేఉంది..
నాకూతురు రూపంలో' అని జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు శర్మగారు కన్నీరు
నిండిన కళ్ళతో.

అమ్మాయి 'ఆడ'పిల్ల అనుకొంటాము,
మన ఇల్లు వదిలి పోతుందని.
తను ఎక్కడికీ పోదు,తలిదండ్రుల హృదయాలలోనే ఉంటుంది.
తన మనస్సులో తనవారి జ్ఞాపకాలను నింపుకుని.

ఆడ పిల్లను బతకనిస్తే .....
అమ్మను గౌరవించినట్లే.....

అడకూతుర్లు గురించి ఓ మంచి ఆర్టికల్ ఇదీ .

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Post a Comment

Popular posts

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

వెలుగులు నింపే ఉపాధి యజ్ఞంలో నేను సైతం అంటూ స్పందించిన మానవ దైవాలు...

చేయూత వార్షికోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాది వారితో కలిసి... జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమంలో భాగస్వాములం అవుతున్నాం... గత ఏడాది ఆసరా లేక అక్షరం ఆగుతున్న చోట ఇద్దరు చిన్నారులకు మన ద్వారా ఫీజు చెల్లించిన విషయం మీకు విదితమే కదా... ఈ ఏడాది కూడా... ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం మనకు వచ్చింది... వివరాల్లోకి వెళితే... ఇద్దరు ఒంటరి మహిళలు.. ఇద్దరు వితంతువులు... ఇద్దరిది చిన్న వయసు... ఒకరు ఒకవైపు కోల్పోయిన జీవితంతో పోరాడుతూ... అంగ వైకల్యం గల చిన్నారి ని పోషిస్తూ... ఒక బట్టలు కుట్టే షాపులో రోజు కూలీగా పనిచేస్తున్నారు... మరొకరిది కూడా ఇంత కన్నా దీనమైన పరిస్థితి... ఇద్దరి కష్టాన్ని తరచి చూస్తే.... మనం ఇద్దరికీ ఏమైనా రెండు కుట్టు మిషన్లు సమకూర్చగలిగితే వారి కాళ్ల పై వారు నిలబడగలరు.. వచ్చిన కొద్ది మొత్తం తో కుటుంబాన్ని కూడా పోషించుకోగలరు... ఇన్నాళ్లు సమస్య అన్నప్రతీసారి స్పందించాం... ఇప్పుడు కూడా రెండు కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం మన ముంగిట నిలబడింది... ఒకరుగా చేయలేం... కానీ ఒకరికి ఒకరు జత కలిస్తే... ఒకటిగా చేయగలం... ఒక్కొక్క ఎలక్ట్రానిక్ సదుపాయం గల కుట్టు మిషన్ ఖరీదు 12,000/ రూపా...