Skip to main content

నేటి మోటివేషన్... బంధాలు -- విలువలు



ఒక వ్యాపారికి తన 45 సంవత్సరాల వయసులో హఠాత్తుగా అతని భార్య మరణించింది.

అతని బంధువులు, స్నేహితులు, 
తనని 2వ వివాహము చేసుకొని స్థిరపడమని 
పరి పరి విధాల 
చెప్పి చూచారు..

కానీ, తనకు, 
తన భార్య 
తీపి బహుమతిగా 
ఒక కుమారుడు ఉన్నాడని, వానిని సక్రమంగా పెంచి పెద్ద చేయాలని, 
వాడి అభివృద్ధే తన ధ్యేయమని, 
చెప్పి, 
ఎవరూ నొచ్చుకోకుండా సున్నితంగా తిరస్కరించాడు.

అతని కుమారుడు, విద్యాబుద్ధులు నేర్చి, సక్రమంగా పెరిగి 
పెద్దవాడైన తదుపరి, అతనికి అంగరంగ వైభవంగా 
పెళ్లి జరిపించి, 
తను కష్ట పడి వృద్ధిచేసిన వ్యాపారాన్ని కూడా అప్పగించి, 
తన వృద్ధాప్య జీవితం గడపటం మొదలు పెట్టాడు...

అలా కొంత కాలం 
గడచి పోయింది.

ఒకరోజు, 
వృద్ధుడైన వ్యాపారి 
భోజన సమయం లో 
తన కోడలిని 

"కొంచెం పెరుగు వుంటే వేయమని" అడిగాడు.

దానికి కోడలు 
"అయ్యో పెరుగు లేదండీ" అని చెప్పింది.

అప్పుడే లోపలికి వస్తున్న కొడుకు ఆ సంభాషణ విన్నాడు..

భోజనం పూర్తి చేసి 
తండ్రి వెళ్లిపోయిన తరువాత, 
కొడుకు, కోడలు 
భోజనానికి కూర్చున్నారు...

వారి భోజనంలో సరిపడినంత పెరుగు ఉండటం కొడుకు గమనించాడు..
భార్యను ఏమీ అనలేదు. మౌనంగా వ్యాపారానికి వెళ్ళిపోయాడు.

కానీ పని మీద మనసు లగ్నం చేయ లేక పోయాడు. 

రాత్రి పగలు 
తన తండ్రి అడిగిన 
ఒక కప్పు పెరుగు విషయమే మనసును తొలుస్తున్నది.

తనకొఱకు 
తన తండ్రి చేసిన త్యాగం, ప్రేమతో పెంచిన తీరు, కష్టపడి వృద్ధిచేసి అందించిన, 
వడ్డించిన విస్తరి లాంటి వ్యాపారం.. 
అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి..

తన తండ్రి జీవితమంతా చేసిన కష్టం, 
ఒక కప్పు పెరుగును ఇవ్వలేక పోయిందా అనే బాధను తట్టుకోలేక పోయాడు..

తండ్రికి ఇపుడు ఇంకొక వివాహం చేస్తే, 
ఆ భార్య అతని బాగోగులు బాగా చూచుకొన గలదు.. 
కానీ ఇపుడు తండ్రి ససేమిరా ఒప్పుకోడు..

భార్యను దండించితే మనసు మారుతుందన్న నమ్మకం లేదు...

ఎంత ఆలోచించినా 
మార్గం తోచలేదు. 

చివరకు ఒక నిర్ణయానికి వచ్చి, 
మరుసటి రోజు 
హఠాత్తుగా తన తండ్రిని వేరొక ఊరు తీసికొని వెళ్లి మంచి ఇల్లు చూసి అన్ని సదుపాయాలు ఏర్పరచి తండ్రిని అక్కడవుంచి 
తిరిగి వచ్చేసాడు. 

మామగారు 
అంత హఠాత్తుగా 
ఎక్కడికి, 
ఎందుకు వెళ్లాడో 
కోడలికి అర్ధం కాలేదు..

భర్తను అడిగింది గానీ తనకు కూడా తెలియదని చెప్పటంతో ఆలోచనలో పడింది.   

ఒక వారం గడిచిపోయింది..
మామగారి విషయం తెలియటం లేదు. 

భర్తను అడిగే ధైర్యం చేయలేక పోయింది. సహజంగానే ఆతృత పెరిగింది.

ఆరోజు ఉదయం భర్త వెళ్లిన తరువాత, 
ఏదో పని మీద గుమాస్తా ఇంటికి వచ్చాడు.. 
కోడలు మామ గారి గురించి ఆరా అడిగింది.. 

ఏమి జరిగిందో 
తెలియదు గాని...
పెద్దాయనగారు పెళ్లి చేసుకోబోతున్నారని... ఏర్పాట్లు పూర్తయ్యాయని, 
వ్యాపారాన్ని కూడా 
తనే చూచు కుంటారని, ఆయన కొత్త కాపురం 
ఈ ఇంట్లోనే ఉంటారని, కొడుకు తన కాపరాన్ని 
ఒక అద్దె ఇంటి లోనికి మార్చ బోతున్నారని,
అందరూ చెప్పుకుంటున్నారనీ..
గుమాస్తా చెప్పిన విషయం
విని నివ్వెర పోయింది..

ఒక్కసారిగా కోడలి కంటిముందు, 
తన భావి జీవితం కనపడింది..

తాను చేస్తున్న తప్పు తెలిసింది.. 
ఇపుడు కొత్త అత్తగారు వస్తే తన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకుంది.

గుమాస్తాను,  
మామగారు ప్రస్తుతం ఉంటున్న చోటు 
గురించి అడిగి
తెలుసుకొని 
పరుగున వెళ్ళి 
ఆయన కాళ్లపై పడి క్షమాపణ కోరింది. 

తన తప్పు తెలుసు కున్నానని, 
ఇకనుండి 
తన తండ్రిలా చూచుకుంటానని 
ప్రాధేయ పడింది.

ఈవిషయాలేవీ 
తెలియని మామగారికి పరిస్థితి అర్ధం కాలేదు..

అపుడు వచ్చాడు కొడుకు..
తల్లిదండ్రుల విలువ...
కప్పు పెరుగు విషయంలో
తాను పడిన బాధ
కోడలికి 
తెలియ జెప్పటానికి 
తాను ఇలా
చేయవలసి 
వచ్చిందని 
వివరించాడు. 

తనకు తానుగా 
మార టానికి , 
భర్త పడిన కష్టం 
చూచి సిగ్గుపడింది..

"వృద్దాప్యంలోని తల్లిదండ్రులు 
పిల్లలకు ATM కార్డులాంటి వారు"...

"అదే సమయంలో పిల్లలు వారికి ఆధార్ కార్డ్ లాంటి వారు"...

ఈ సంబంధ బాంధవ్యాలు...
మమతానుబంధాలు...
బాధ్యతలు  
తెలుసుకుంటే 
కుటుంబ బంధాలు 
ఎంత సహజంగా పరిమళిస్తాయో 
ఒక్కసారి ఆలోచించండి...🙏

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

🚨🚨 FLASH FLASH – AP SPECIAL TET 2026 HALL TICKETS 🚨🚨

📢 ఆంధ్రప్రదేశ్ స్పెషల్ టెట్ (AP SPECIAL TET) 2026 హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నిర్వహించనున్న AP Special TET 2026 పరీక్షకు హాజరుకానున్న ఇన్‌ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం హాల్ టికెట్లను అక్టోబర్ 5, 2026న విడుదల చేయనున్నారు. 📌 ముఖ్యమైన వివరాలు: 🔹 పరీక్ష పేరు: AP Special TET 2026 🔹 హాల్ టికెట్ల విడుదల తేదీ: 05-10-2026 🔹 పరీక్ష తేదీలు: 11-10-2026 నుంచి 21-10-2026 వరకు 🔹 పరీక్ష విధానం: ఆన్‌లైన్ (CBT) 🔹 అర్హులు: ఇన్‌ సర్వీస్ ఉపాధ్యాయులు 🌐 హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే వెబ్‌సైట్: https://tet2dsc.apcfss.in/ 📌 డౌన్‌లోడ్ విధానం: 1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 2. Candidate Login పై క్లిక్ చేయండి. 3. మీ Username, Password నమోదు చేయండి. 4. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. 5. ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి. ⚠️ అభ్యర్థులు తమ హాల్ టికెట్‌లోని పేరు, పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం, సమయం తదితర వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. 🙏 పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు! 📲 ఈ సమాచారాన్ని మీ ఉపాధ్యాయ మిత్రులకు కూడా షేర్ చేయండి. #APSpecialTET20...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

హార్ట్‌ ఎటాక్‌ ముప్పు ఆల్కహాల్‌ వల్ల కాదండోయ్‌!..... మీరు ఎంతగానో ఇష్టపడి త్రాగే ఇదే...

ఎనర్జీ డ్డ్రింక్స్ వల్ల అని చెబుతున్నారు నిపుణులు! ఎనర్జీ డ్రింక్స్ హానికరం కాదని మీరు అనుకుంటున్నారా?  ఒకటి తాగిన తర్వాత మీ హృదయ స్పందన రేటు పెరుగుతుందా?  ఈ సందేహాలు మీకూ ఉన్నాయా?  'హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ డక్' గా పిలువబడే ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్ డిమిత్రి యారనోవ్ మీ సందేహాలకు సమాధానం ఇస్తున్నారు.  ఎనర్జీ డ్రింక్ వినియోగం యువకుల గుండె జబ్బులతో ముడిపడి ఉంటుంది.  అధిక ఎనర్జీ డ్రింక్ వినియోగం తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని అతను అంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ఉన్న రోగులను తాను ఎక్కువగా చూస్తున్నానని.. 20, 30 ఏళ్లలోపు యువకులు, ఆరోగ్యవంతులు అకస్మాత్తుగా గుండె వైఫల్యంతో బాధపడుతున్నారు. ధూమపానం అలవాటు లేదు, కుటుంబ చరిత్ర కూడా లేదు. కానీ వీరందరిలో ఓ ఉమ్మడి అలవాటు ఉంది. అది వారు ప్రతిరోజూ 3-4 డబ్బాల ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ రక్తపోటును పెంచుతాయని, అసాధారణ గుండె లయలకు కారణమవుతాయని, కాలక్రమేణా గుండె కండరాలను బలహీనపరుస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక కెఫిన్, ఉత్తేజకాలు గుండెను ఓవర్‌డ్రైవ్‌కు గురి చేస్తాయి...