Skip to main content

చరిత్రలో ఈ రోజు మే / - 02



🔎సంఘటనలు🔍

🌸1837: మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి.) ఇండియన్ పీనల్ కోడ్ మీద రిపోర్ట్ ఇచ్చాడు.

🌸1945: రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోతున్న సమయంలో, రష్యన్ సైన్యం, బెర్లిన్ని జయించింది.

🌸1952: ప్రపంచంలోని మొట్టమొదటి జెట్ లైనర్ (ది డె హావిల్లాండ్ కామెట్ 1) లండన్ నుంచి జోహన్నెస్ బర్గ్ కి తన మొట్టమొదటి ప్రయాణం చేసి, 'జెట్ యుగాని' కి తెరతీసింది.

🌸1982: ఫాక్ లేండ్ యుద్దం (అర్జెంటీనా - ఇంగ్లాండుల మధ్య ఫాక్ లేండ్ దీవుల కోసం జరిగిన యుద్ధం) లో బ్రిటన్కి చెందిన రాయల్ నేవీ సబ్ మెరీన్, అర్జెంటీనాకు చెందిన యుద్ధనౌకను (పేరు: ది జనరల్ బెల్ గ్రానో) ముంచేసింది. అందులో 1000 మంది ఉన్నారని అనుకున్నారు.

🌸1986: రష్యాలోని చెర్నోబిల్ అణు రియాక్టరు నుంచి ప్రమాదవశాత్తు బయటపడిన అణుధార్మికత (రేడియేషన్) ఫ్రాన్స్, బ్రిటన్ లకు పాకింది.

🌸1995: రాజేంద్ర కుమారి పాండిచ్చేరి గవర్నరుగా నియామకం.

2007: ఆంధ్ర ప్రదేశ్ విధాన మండలి 22 సంవత్సరాలు తరువాత పునరుద్దించబడిన రోజు

🌼జననాలు🌼

💕1729: కేథరిన్ ది గ్రేట్

💕1904: బింగ్ క్రాస్ బీ, అమెరికన్ గాయకుడు, నటుడు.

💕1911: పి.పుల్లయ్య, తెలుగు చిత్ర నిర్మాత, దర్శకుడు. (మ.1985)

💕1919: పాగ పుల్లారెడ్డి, గద్వాల పురపాలక సంఘ చైర్మెన్ గా, బాలభవన్ లాంటి సంస్థల అభివృద్ధికి పాటుపడ్డాడు. (మ.2010)

💕1921: సత్యజిత్ రే, భారత దేశ సినిమా దర్శకుడు. (మ.1992)

💕1929: పెనుమర్తి విశ్వనాథశాస్త్రి, ఆంధ్రప్రభ దినపత్రిక విజయవాడలో ఛీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేశారు, "స్వప్న లిపి" పేరుతో వెలువరించిన వీరి కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది

💕1943: దేవిక, అందాల తారగా తెలుగు, తమిళ సినీరంగాలలో వెలుగొందింది. తెలుగు, తమిళ, మలయాళంలలో 150కి పైగా సినిమాలలో నటించింది.

💕1947: కోడెల శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సినియర్ నేత, తొలి శాసనసభాపతి.

💕1964: నారాయణం నరసింహ మూర్తి, అంతర్జాతీయ పేరొందిన పర్యవరణ వేత్త. ఆయన పర్యావరణ కవితోద్యమం అనే ఉద్యమాన్ని తెలుగు నాట 2008 లో ప్రారంభించారు.

💕1969: బ్రియాన్ లారా, వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు.

💕1980: ట్రాయ్ మర్ఫీ, అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాడు.

💐మరణాలు💐

🍁1519: లియొనార్డో డావిన్సి, గణిత శాస్త్రజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీత కళాకారుడు. (జ.1452)

🍁1975: పద్మజా నాయుడు, సరోజిని నాయుడు కుమార్తె. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నరు. (జ.1900)

🍁2011: బిన్ లాడెన్ ను అమెరికన్ సి.ఐ.ఏ. కాల్చి చంపింది.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...