Skip to main content

ప్రాణ వాయువు కోసం లక్ష్య టీమ్ చేస్తున్న సమరం


ఆక్సిజన్...ఆక్సిజన్...
ఎటు చూస్తున్నా..
ఎటు పయనిస్తున్నా..

ప్రస్తుతం మనకు వినబడుతున్న మాట...

కాదు..కాదు..
మన కళ్లకు కనబడుతున్న మాట...

తల్లి కోసం కొడుకు..
భార్య కోసం భర్త..
కొడుకు కోసం తండ్రి..
అక్క కోసం తమ్ముడు..
తమ్ముడు కోసం చెల్లి..
ఆయాసపడుతూ నడి రోడ్డుపై పరుగులు తీస్తున్నారు...

తమ శ్వాసను ఊపిరిగా మార్చి అయినా...
వారికి ఊపిరినివ్వడానికి ప్రయత్నిస్తున్న వేళ..

కళ్ల ముందే, తన వారు కను మూస్తుంటే..
ఒడిలోనే వారు ప్రాణం వదులుతుంటే..
పెనవేసుకున్న అనుబంధం, ప్రాణాలతో పెనుగులాడుతూ.. అమాంతం నేలకొరిగిపోతుంటే..

నా బంధం ఇంతవరకే..
నా అదృష్టం కొంతవరకే...
నా తలరాత ఇంతేననుకుంటూ..

ఆ దేవుడి వింత ఆటలో.. ప్రాణాలను నిలపలేక, ఓడిపోతున్న తన ప్రయత్నంతో..

నిట్టనిలువునా కూలిపోతున్నారు..

కడసారి చూపులను చూసుకుని.. జ్ఞాపకాలను మూట కట్టుకుంటున్నారు..🙏🏻

సరిగ్గా అలాంటి చోట..

మన టీమ్ లక్ష్య...

గుండె చప్పుడుగా మారి..
కనీసం ఒక ఊపిరినైనా నిలపాలని..
ఒక కుటుంబాన్ని అయినా నిలబెట్టాలని.. తన అడుగును వేస్తుంది..

చివరి దశలో ఊపిరి కోసం..
పెనుగులాడుతున్న వారికి..
ప్రాణ వాయువుని అందివ్వడానికి..

ఒక ఆక్సిజన్ కాన్సెన్ ట్రేటర్ ను అయినా సమకూర్చాలని ఆశగా పయనిస్తోంది..
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
కాన్సన్ ట్రేటర్ వివరాలు:

👉 దీని వెల (ప్రస్తుతం..) అక్షరాలా 80,000/- నుండి లక్ష రూపాయల వరకూ ఉంది..

👉 కరెంటుతో పని చేస్తూ నిమిషానికి 7 లీటర్ల ఆక్సిజన్ ను గాలి నుండి సేకరించి రోగికి అందిస్తుంది..

👉 ఆక్సిజన్ లెవెల్స్ 88 - 89 శాతం కి పడిపోయిన రోగికి ఇది వాడితే ఆక్సిజన్ లెవెల్స్ ని ఒక్కసారిగా 98 శాతం తీసుకువచ్చి ప్రాణాన్ని నిలబెడుతుంది..

ప్రాణ వాయువు కోసం జరుగుతున్న ఈ సమరంలో.. నేను సైతం అంటూ అడుగులు వేసే మానవ దైవాల కోసం.. ఎదురుచూస్తూ..🙏🏻


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
మీ గుండె చప్పుడు పంపవలసిన మా చిరునామా..
■■■■■■■■■■■■■■■■■■■■■■■■■■■■■■■■
లక్ష్య
ఫోన్ పే/ గూగుల్ పే నం.
9848956595
లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ
🛡️ACCOUNT NUMBER:
          50200054999726
🛡️IFSC CODE:
            HDFC0003326
■■■■■■■■■■■■■■■■■■■■■■■■■■■■■■■■
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

మీ
టీమ్ లక్ష్య

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

నెలల వారీగా తేదీ ---- ప్రత్యేకత

జనవరి » 10 - ప్రపంచ నవ్వుల దినోత్సవం   » 19 - ప్రపంచ శాంతి దినోత్సవం   » 25 - అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం   » 26 - అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం   ఫిబ్రవరి » రెండో ఆదివారం - ప్రపంచ వివాహ దినోత్సవం  ఫిబ్రవరి రెండో ఆదివారం - ప్రపంచ వివాహ దినోత్సవం » 14 - ప్రేమికుల దినోత్సవం » 21 - ప్రపంచ మాతృభాషా దినోత్సవం   మార్చి » 8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం  మార్చి 8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం » 15 - ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం » 21 - ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం   » 22 - ప్రపంచ నీటి దినోత్సవం   » 23 - ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెటలర్జికల్ డే   » 24 - ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం   ఏప్రిల్ » 1 - ఆల్ ఫూల్స్ డే   » 7 - ప్రపంచ ఆరోగ్య దినోత్సవం   » 12 - ప్రపంచ అంతరిక్ష యాత్ర, విమానయాన దినోత్సవం   » 16 - ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం   » 18 - ప్రపంచ సాంస్కృతిక దిన...