Skip to main content

నేటి మోటివేషన్... స్నేహమనేది ఒకరోజు కాలక్షేపం కాదు... స్వచ్ఛమైన అనుబంధానికి చిరునామా.



సెలవు రోజున సరదాగా షికారుకెళ్లిన ఇద్దరు స్నేహితులకు ఏదో విషయంపై మాట తేడా వచ్చింది. 

వాదన పెరిగింది. దీంతో మొదటి స్నేహితుడు, రెండోవాడ్ని చెంపపై కొట్టాడు.

 దెబ్బతిన్న స్నేహితుడు అక్కడే వున్న ఇసుకపై 'ఈరోజు నా స్నేహితుడు నా చెంపపై కొట్టాడు' అని రాశాడు.

 మరికొంత దూరం వెళ్లిన తర్వాత, ఇద్దరికీ దాహం వేసి ఓ మడుగు దగ్గర ఆగారు. చెంప దెబ్బ తిన్న వాడు ముందుగా నీళ్ల లోకి దిగాడు. 

అక్కడ ఊబి వుండడంతో అందులో కూరుకుపోతుండగా, మొదటి మిత్రుడు తన ప్యాంటు విప్పి, ఊబిలో కూరుకుపోతున్న స్నేహితునికి అందించి బయటికి లాగాడు.

 ప్రాణాపాయం నుండి బయటపడ్డ రెండో స్నేహితుడు- 'ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు..'

 అని ఓ బండరాయిపై చెక్కాడు.మొదటి విషయాన్ని ఇసుకపై, రెండోదాన్ని రాతిపై ఎందుకు రాశావని మొదటి మిత్రుడు అడిగాడు. 

'ఇసుక మీద రాసింది గాలి వీస్తే చెరిగిపోతుంది. స్నేహితుల పొరపాట్లు కూడా అలాంటివే. వాటిని మనసులో నిలుపుకోకూడదు. 

అలాగే... సహాయం చేసినపుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. అందుకే రాయిపై రాశాను. ఈ అక్షరాలు ఎప్పటికీ వుంటాయి' అన్నాడట. 

స్నేహం గురించి ఒక చిన్నారి రాసిన కథ ఇది. అంటే- స్నేహితుల మధ్య వచ్చే తప్పిదాలు ఇసుక మీద రాతల్లాంటివి.

 ఎవరు తప్పు చేసినా క్షమించి మర్చిపోవాలి. రాతిపై రాసిన రాతలా స్నేహితుడి సహాయాన్ని కలకాలం గుర్తుంచుకోవాలి.

 అందుకే అంటారు'ఇచ్చింది మర్చిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం' అని. 

స్నేహమనేది ఒకరోజు కాలక్షేపం కాదు... స్వచ్ఛమైన అనుబంధానికి చిరునామా.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

ఫ్లాష్ ఫ్లాష్ NEET UG 2026 ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET UG 2026 పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఆన్సర్ కీతో పాటు రికార్డ్ చేసిన స్పందనలు (Response Sheet) పరిశీలించవచ్చు. ఆన్సర్ కీలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే, నిర్ణీత గడువులోగా అధికారిక విధానం ప్రకారం ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం నిపుణుల పరిశీలన తర్వాత తుది ఆన్సర్ కీ విడుదల చేసి, ఫలితాలను ప్రకటిస్తారు. NEET అభ్యర్థులు ఆలస్యం చేయకుండా తమ ఆన్సర్ కీని పరిశీలించి అవసరమైతే అభ్యంతరాలు నమోదు చేసుకోవాలని సూచించబడుతోంది. Click here to get key Lakshya Educational Groups

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...