Skip to main content

నేటి మోటివేషన్... కొంత మంది నాకు టైం బాగాలేదు అలా ఇలా అంటూ ఉంటారు, అలా ఏమి ఉండదు, చేసేపనిని బట్టి అనుకునే టైం మీకే సహకరిస్తుంది.



విచిత్రం.. చాలా విచిత్ర మైనది జీవితం.. నాకు అనిపించింది...
అందులో మొదటిది, ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి..

కానీ ఏం కావాలి తెలియదు ఏం వాడులుకున్తున్నమో కూడా తెలియదు. వచ్చినప్పుడు కానీ అర్థం అవ్వదు ఏమి వదులుకున్నాం అని.. కొంచెం గజిబిజి ఉంటుంది. చదివితే అర్ధం అవుతుంది.

 కాని ఈ సమయం ఉంది చూసారు.. వాడుకున్న వారికి వాడుకునేంత దొరుకుతుంది.. ఉపయోగించని వారికి ఆలోచన వచ్చాక మాత్రమే దూరం అవుతుంది..  

 ఈ విచిత్ర జీవితంలో.. అనుకోని సంఘటనలు.. తెలియని బాధలు.. ఊహించని విజయాలు.. ఎదురుపడుతూ ఉంటాయి.. ఇంత మంది చుట్టూ ఉన్నా కొన్ని కొన్ని సార్లు ఒంటరి తనం కనిపిస్తూ ఉంటుంది.. అదే విచిత్రం..మనం ఆలోచన చేసినట్టు వాళ్ళు ఉండరు.. వాళ్ళు అనుకున్నట్టు మనకీ తెలియదు. 

మనుషులు ఎలా తయారయ్యారంటే చెప్పనవసరం లేదు.. అందరికి తెలిసిందే..!! 

ఒకరికి డబ్బు కావాలి.. మరొకరికి వ్యక్తిత్వం.. ఇంకొకరికి ఇంకొకటి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి..

మనిషి చూపించిన బేదం డబ్బు ఏనాడూ చూపించలేదు.. ఈరోజు బిచ్చగాడికి వేసే నోటు రేపు బ్యాంకు నుండి మల్లి వేరే వాడికి వెళ్తుంది తప్ప ఆ పళ్ళెం లో మాత్రం ఉండదు.. అది ఎందుకు తెలుసుకోరో తెలియదు.. నేను ఎవరిని తప్పు పట్టడంలేదు. గొప్పోడి దగ్గర ఉన్నది స్తాయి లేని వారి దగ్గర ఉన్నది ఒకే డబ్బు.. అంటే మనిషిలో ఉన్న తారతమ్యం వాళ్ళు సంపాదించే డబ్బుకి మాత్రం లేదన్నమాట... కుటుంభాలే విడిపోతున్నాయి. మనుషులను ప్రేమించడం నేర్చుకోండి. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం..

 విచిత్రం... మనం కోరుకున్న వాళ్లకు మన విలువ తెలియదు.. వాళ్ళు కోరుకునే వాళ్ళకి మనిషి విలువ తెలియదు !.. ఆలోచిస్తే తెలుస్తుంది అర్థం ఏంటి అని..!!

 
ప్రతి ఒక్కరి జీవితంలో ఓ కష్టం ఓ సుఖం ఉంటాయి. కొంతమంది జీవితాల్లో సుఖం లేదు అన్ని కష్టాలే అవమానాలు అని భావిస్తూ ఉంటారు. అలా ఎన్నటికి ఆలోచన చేయద్దు. ప్రతి భాధ ఓ గమ్యపు మైలురాయి. ప్రతి అవమానం ప్రతి కష్టం ఇవన్నీ దారిలో ఎదురుపడే మైలురాళ్లు.. అందుకే ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎంత కష్టం లో ఉన్నా మీ ఆలోచన మార్చుకోవద్దు మంచిదారిలో ఉంటే..!! ఎవరికి అయినా కష్టపడే తీరును బట్టి గెలుపుకు దగ్గర అవుతారు. 

 
ఏనాటికైనా మనిషికి మనిషే తోడు కానీ.. డబ్బు కాదు..

సమయం అందరికి ఒకటే.. ఒకే సమయంలో ఒకరు పడుకుంటారు.. మరొకరు మేల్కొని ఉంటారు..
ఒకరు ఆనందిస్తారు.. మరొకరు కష్టపడతారు.. ఒకరు ఈ భూమి మీద ఉంటారు మరొకరు ఈ భూమిలో కలుస్తారు.
ఒకరు అదే సమయాన్ని ఉపయోగించుకుంటారు. మరొకరు అదే సమయాన్ని ఏం తెలియక వృధా చేస్తారు.
ఇక్కడ సమయాన్ని తెలుసుకున్నవారికే విలువ దక్కుతుంది.. కాని అందరికి అదే సమయం.

మరి గొప్ప ఎక్కడ. లేని తనం ఎక్కడ..!!! విచిత్రమే కథా..!!

 
డబ్బుతో ఖరీదైన మంచం అయితే కొనగలం కానీ మంచి ప్రసాంతత నిద్రను కాదు. 
విలువైన గడియారం కొనగలం కానీ సమయాన్ని దాని కున్న విలువని కాదు..
పెద్ద అందమైన ఇల్లును కొనగలం లేదా కట్టగలం కానీ అందులో ఉంచే కుటుంబాన్ని కాదు..

ఇది చాలదా ఉదాహరణ.. విచిత్రమైన జీవితం అంటే అదే..

ఎంత సమయం వృధా ఐతే అంత వెనుకబడి ఉన్నామని అర్థం...!! ఎంతో విచిత్రం.. మన ఈ జీవితం..

 ఇలాంటివి ఎన్నో నాకు ఇంట్లో చిన్ననాటి నుండి అమ్మ నాన్నా నేర్పిస్తూ అలాగే చూపిస్తూ పెంచారుఅప్పుడు తెలియదు ఇంత అర్థం ఉంటుంది అని..

సమయం వృధా అవ్వితే కానీ నాకు అర్థం అయ్యే రోజులు రాలేదు.. ఇప్పుడు ఆ దారిలో ఉన్నా కాని అప్పుడు ఉన్న సమయం ఇప్పుడు లేదు..

 అదే విచిత్రమైన జీవితం అంటే.. అప్పుడు లేనిది ఇప్పుడు వచ్చింది..

ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి.. కొందరు మోసం చేసి వెళ్తారు.. అది తెలివి అనుకుంటారు మన మంచితనం అని గుర్తించలేరు, మన విలువ తెలిసే సమయానికి వాళ్ళు ఆ నమ్మకాన్ని కోల్పోతారు..

ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది.. అసలు కష్టం లేకుండా ఎవరులేరు ఎవరి స్తాయికి వాళ్ళ వరకు కష్టాలు తప్పకుండా ఉంటాయి. మనకు తెలియదు కాని, అంబానికి కూడా ఎదో ఓ ఇబ్బంది బాధ ఉంటుంది అది కుటుంభ పరంగా అవ్వచ్చు లేదా వ్యాపార నిమిత్తం కావచ్చు. డబ్బుంటేనే సుఖం అని మాత్రం అనుకోవద్దు. కాని మనం వాడుకునే సమయం బట్టి తీసుకునే నిర్ణయం బట్టి మీ జీవితం ఆధారపడి ఉంటుంది అని మాత్రం మర్చిపోకండి.

కుటుంబ సమస్యలు ఎన్నో..!! చదువుకునే రోజుల్లో సమస్యల్యు మరెన్నో.. ! జీవితలో పైకి వచ్చే సమయం లో ఇంకెన్నో.. పోరాడి నెగ్గాలి కాని సమస్యను చూసి వెనక్కు అడుగేయకూడదు. ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఏ స్తాయి లో ఉన్నారు ఎలాంటి పరిస్తితిలో ఉన్నారు అని. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది అలా లేదు అంటే మీరు మీ సమయాన్ని వృధా చేస్తున్నారు అని అర్ధం. ఆలోచిస్తే ఇందులో ఉన్న అర్దం తెలుస్తుంది.

 
ఒకటే గురుతుపెట్టుకోండి అందరికి సమయం ఒక్కటే ఎవరికీ వేరు వేరు కాదు, ఆలోచనలు మాత్రమే వేరు,. ఈరోజు మీరే గోప్పకావచ్చు రేపు అని ఒకటి ఉంది, దాన్ని ఎవరూ మార్చలేరు. సమయాన్ని వినియోగించుకుని రేపు అని దానిని మార్చుకునే ప్రయత్నం చేస్తారా లేక రేపు ఉంది కదా అని అనుకుంటూ కాలం గడిపేస్తారా.. మీ ఆలోచనకే వదిలేస్తున్నాను
..

ఇట్లు 
మీ శ్రేయోభిలాషి..

నోట్ : ఎవరిని ఉద్దేశ్యించి కాదు , ఇది కేవలం నా అభిప్రాయం అలాగే కొందరికి ఆలోచనలు.. ఎవరి మనస్సును అయినా నొప్పించి ఉంటె మన్నించగలరు. కొంత మంది నాకు టైం బాగాలేదు అలా ఇలా అంటూ ఉంటారు, అలా ఏమి ఉండదు, చేసేపనిని బట్టి అనుకునే టైం మీకే సహకరిస్తుంది.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺