Skip to main content

చరిత్రలో ఈ రోజు మే / - 21



🔎సంఘటనలు🔍

🌸0143: అమెరికా చరిత్రకారులకు తెలిసిన అతిపురాతనమైన సంవత్సరం. ఈ రోజున 'మాయా నాగరికత' కన్నా ముందు పాలించిన రాజు 'కింగ్ హర్వెస్ట్-బెర్‌గ్వోర్‌స్ట్' సింహాసనం ఎక్కిన సంవత్సరం.

🌸1502: సెయింట్ హెలెనా దీవిని పోర్చుగీస్ కి చెందిన నౌకాదళాధికారి అడ్మిరల్ జో డ నోవా కనుగొన్నాడు.

🌸1819: మొట్టమొదటి 'సైకిల్' (రెండుచక్రాల వాహనం) (స్విఫ్ట్ వాకర్) ని అమెరికా లోని న్యూయార్క్ నగరంలో ప్రవేశపెట్టారు.

🌸1829: సికింద్రాబాదు కు ఆ పేరు రావటానికి కారణమైన సికిందర్ ఝా అసఫ్ జాహి మరణించాడు.

🌸1851: దక్షిణ అమెరికా లోని కొలంబియాలో బానిసత్వాన్ని రద్దుచేసారు.

🌸1871: యూరప్ లో మొట్టమొదటి రైలు (స్విట్జర్లాండ్ అందాలను చూడటానికి రిగి కొండ 'రిగి రైల్వేస్ (రిగి-బాహ్నెన్) ఏర్ఫాటు చేసారు. ('రేక్' టెక్నాలజీని వాడారు).

🌸1881: క్లారా బార్టన్ 'అమెరికన్ రెడ్ క్రాస్' ని స్థాపించాడు.

🌸1894: ఇంగ్లాండ్ లో 'మాంచెస్టర్ షిప్ కెనాల్' ని విక్టోరియా మహారాణి అధికారికంగా ప్రారంభించి, ఆ కాలువను డిజైన్ చేసిన 'సర్ ఎడ్వర్డ్ లీడర్ విలియమ్స్' కి 'నైట్‌హుడ్' బిరుదు ఇచ్చింది.

🌸1908: మొట్టమొదటి హర్రర్ సినిమా (డాక్టర్ జెకీల్ అండ్ మిస్టర్ హైడ్) చికాగో (అమెరికా)లో విడుదల అయ్యింది.

🌸1916: 'సమ్మర్ టైమ్' (డేలైట్ సేవింగ్ టైమ్) ని బ్రిటన్అమలులో పెట్టింది.

🌸1929: మొట్ట మొదటి సారి, న్యూయార్క్ లోని 'స్టాక్ ఎక్స్‌చేంజి' లో 'ఆటోమాటిక్ ఎలెక్ట్రిక్ స్టాక్ కొటేషన్ బోర్డ్' ఏర్పాటు చేసారు.

🌸1934: తన మునిసిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరి వేలిముద్రలు సేకరించిన మొట్టమొదటి అమెరికన్ మునిసిపాలిటి 'ఒస్కాలూసా (అమెరికాలోని అయోవారాష్ట్రంలో ఉంది).

🌸1937: ఆర్కిటిక్ మహాసముద్రం మంచు ఖండాల మీద సోవియట్ రష్యా తన మొట్టమొదటి వైజ్ఞానిక పరిశోధక కేంద్రం మొదలు పెట్టింది.

🌸1938: 'ఆస్ట్రేలియ-సర్రీ' క్రికెట్ మాచ్ లో బ్రాడ్‌మన్ 143 పరుగులు సాధించాడు. (198 నిమిషాలు 11 ఫోర్లు (ఫోర్స్)).

🌸1958: బ్రిస్టల్ ప్రాంతంలో 'సబ్‌స్క్రైబర్ డయలింగ్ సిస్టం (ఎస్.టి.డి)' ని 1958 డిసెంబరు నుంచి ప్రవేశపెడుతున్నట్లు, యునైటెడ్ కింగ్‍డం పోస్ట్ మాస్టర్ జనరల్ ఎర్నెస్ట్ మార్‌ప్లెస్ ప్రకటించాడు.

🌸1990: రిపబ్లిక్ ఆఫ్ యెమెన్గా కలిసి పోవటానికి రెండు దేశాలు 'డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ యెమెన్', 'నార్త్ యెమెన్' లు అంగీకరించాయి.

🌸1990: డౌ జోన్స్ (అమెరికన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ - మన నిఫ్టీ, సెన్సెక్స్ లాగ) 2844.68 స్థాయిని తాకింది.

🌸1991: రాజీవ్ గాంధీ, మాజీ భారత ప్రధాన మంత్రిని, 'నళిని' అనే మహిళ తన నడుముకి కట్టుకున్న బాంబును పేల్చి ('ఎల్.టి.టి.ఇ' కి చెందిన ఆత్మాహుతి దళ సభ్యురాలు) హత్య చేసింది.

🌸1994: భారత దేశానికి చెందిన సుస్మితా సేన్,18 సంవత్సరాల వయసులో, 43వ మిస్ యూనివర్స్గా ఎన్నికైంది.

🌸1996: టాంజానియా కి దగ్గరలో ఉన్న విక్టోరియా సరస్సు లోఎమ్.వి. బుకొబ ములిగి పోయింది. 1000 మంది మరణించారు.

🌸2003: ఉత్తర అల్జీరయాలో భూకంపం వచ్చి 2000 మందికి పైగా ప్రజలు మరణించారు.

🌸2007: కడప జిల్లాలో కోటి టన్నుల సామర్ద్యము గల ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం అప్పటి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వము గాలి జనార్ధన రెడ్డికి చెందిన బ్రహ్మణి ఇండస్ట్రీస్ తో ఒప్పందం చేసుకుంది

🌸2009: జర్మనీ అధ్యక్షుడిగా హర్ట్స్ కొహ్లర్ రెండోసారి ఎన్నికయ్యాడు.

🌼జననాలు🌼

💝0427 బి.సి. : ప్లాటో (అరిస్టోక్లెస్), ఏథెన్స్ (?)

💝1688: అలెగ్జాండర్ పోప్ పద్దెనిమిదవ-శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి, తన వ్యంగ్య పద్యాలకు, తన హోమెర్ అనువాదాలకు మంచి గుర్తింపు పొందాడు. (మ.1744)

💝1893: ఏకా ఆంజనేయులు, సాహితీ పోషకుడు, భువనవిజయం సాహితీరూపక రూపశిల్పి.

💝1941: భమిడి కమలాదేవి, సంగీత విద్వాంసురాలు.

💝1961: రాళ్ళబండి కవితాప్రసాద్, తెలుగు అవధాని, కవి. (మ.2015)

💝1991: జాని తక్కెడశిల, తెలుగు కవి, రచయిత, విమర్శకులు

💐మరణాలు💐

🍁1786: కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే, జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. (జ.1742)

🍁1940: కౌతా ఆనందమోహనశాస్త్రి, వీరు వివిధ శైలీభేదాలను అనుసరించి నూటికి పైగా చిత్రాలను చిత్రించారు. (జ.1908)

🍁1991: రాజీవ్ గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (జ.1944)

🍁2019: బొద్దులూరి నారాయణరావు తెలుగు కవి, పండితుడు. (జ.1925)

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉 చిలీ దేశపు నేవీ డే (నౌకాదళ దినోత్సవము) (1879 లో జరిగిన ఇంక్విక్ యుద్ధం).

👉 సెయింట్ హెలెనా దినోత్సవము (1502 లో ఇదేరోజున ఈ దీవిని కనుగొన్నారు)

👉 ప్రపంచ సాంస్కృతిక దినోత్సవము (వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్‌మెంట్ (ఇంటర్నేషనల్)

👉 జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

🚨🚨 FLASH FLASH – AP SPECIAL TET 2026 HALL TICKETS 🚨🚨

📢 ఆంధ్రప్రదేశ్ స్పెషల్ టెట్ (AP SPECIAL TET) 2026 హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నిర్వహించనున్న AP Special TET 2026 పరీక్షకు హాజరుకానున్న ఇన్‌ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం హాల్ టికెట్లను అక్టోబర్ 5, 2026న విడుదల చేయనున్నారు. 📌 ముఖ్యమైన వివరాలు: 🔹 పరీక్ష పేరు: AP Special TET 2026 🔹 హాల్ టికెట్ల విడుదల తేదీ: 05-10-2026 🔹 పరీక్ష తేదీలు: 11-10-2026 నుంచి 21-10-2026 వరకు 🔹 పరీక్ష విధానం: ఆన్‌లైన్ (CBT) 🔹 అర్హులు: ఇన్‌ సర్వీస్ ఉపాధ్యాయులు 🌐 హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే వెబ్‌సైట్: https://tet2dsc.apcfss.in/ 📌 డౌన్‌లోడ్ విధానం: 1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 2. Candidate Login పై క్లిక్ చేయండి. 3. మీ Username, Password నమోదు చేయండి. 4. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. 5. ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి. ⚠️ అభ్యర్థులు తమ హాల్ టికెట్‌లోని పేరు, పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం, సమయం తదితర వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. 🙏 పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు! 📲 ఈ సమాచారాన్ని మీ ఉపాధ్యాయ మిత్రులకు కూడా షేర్ చేయండి. #APSpecialTET20...

హార్ట్‌ ఎటాక్‌ ముప్పు ఆల్కహాల్‌ వల్ల కాదండోయ్‌!..... మీరు ఎంతగానో ఇష్టపడి త్రాగే ఇదే...

ఎనర్జీ డ్డ్రింక్స్ వల్ల అని చెబుతున్నారు నిపుణులు! ఎనర్జీ డ్రింక్స్ హానికరం కాదని మీరు అనుకుంటున్నారా?  ఒకటి తాగిన తర్వాత మీ హృదయ స్పందన రేటు పెరుగుతుందా?  ఈ సందేహాలు మీకూ ఉన్నాయా?  'హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ డక్' గా పిలువబడే ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్ డిమిత్రి యారనోవ్ మీ సందేహాలకు సమాధానం ఇస్తున్నారు.  ఎనర్జీ డ్రింక్ వినియోగం యువకుల గుండె జబ్బులతో ముడిపడి ఉంటుంది.  అధిక ఎనర్జీ డ్రింక్ వినియోగం తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని అతను అంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ఉన్న రోగులను తాను ఎక్కువగా చూస్తున్నానని.. 20, 30 ఏళ్లలోపు యువకులు, ఆరోగ్యవంతులు అకస్మాత్తుగా గుండె వైఫల్యంతో బాధపడుతున్నారు. ధూమపానం అలవాటు లేదు, కుటుంబ చరిత్ర కూడా లేదు. కానీ వీరందరిలో ఓ ఉమ్మడి అలవాటు ఉంది. అది వారు ప్రతిరోజూ 3-4 డబ్బాల ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ రక్తపోటును పెంచుతాయని, అసాధారణ గుండె లయలకు కారణమవుతాయని, కాలక్రమేణా గుండె కండరాలను బలహీనపరుస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక కెఫిన్, ఉత్తేజకాలు గుండెను ఓవర్‌డ్రైవ్‌కు గురి చేస్తాయి...