Skip to main content

నేటి మోటివేషన్... ఉన్నదానితో తృప్తిపడు..



ఒక పెద్ద మనిషి ఓ బ్యాంకులోంచి డబ్బులు తీసుకుని డబ్బుల పెట్టెను భుజాన వేసుకుని ద్విచక్రవాహనంలో వెళ్తున్నాడు. ఆ పెట్టెలో వంద రూపాయల కట్టలు దాదాపు వంద ఉన్నాయి. అయితే మార్గమధ్యంలో గతుకుల రోడ్డుపై వెళ్తుండడంతో పెట్టె మూత కొద్దిగా తెరచుకుంది. అందులోంచి ఓ వంద రూపాయల కట్ట కింద పడిపోయింది. అది చూసుకోకుండానే అతను వేగంగా వెళ్ళిపోతున్నాడు.
కిందపడిన నోట్ల కట్టలోంచి ఒక్క నోటు మాత్రం బయటికొచ్చి గాల్లో ఎగిరెళ్ళి కాస్తంత దూరంగా పడిపోయింది.

ఆ నోటు పడిన పక్కగా ఒకతను నడుచుకుంటూ వచ్చాడు. అతను ఆ ఒక్క నోటూ తీసుకుని దగ్గర్లో ఉన్న ఇరానీ కేఫ్‌కి వెళ్ళాడు. ప్లేటు దోసె, ప్లేటు ఇడ్లీ తిని, ఒక కాఫీ తాగాడు. ఆ తర్వాత అక్కడికి దగ్గర్లో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళాడు. అక్కడి హుండీలో ఓ పదిరూపాయల నోటు వేసి, దేవుడికి కృతజ్ఞతగా దణ్ణం పెట్టుకున్నాడు.సంతోషంతో ఇంటికి చేరాడు.పడిపోయిన నోట్ల కట్టలో 99 అక్కడే ఉన్నాయి. ఆ దార్లో కాస్సేపటికి ఒకడు వచ్చాడు.అతను ఆ నోట్ల కట్ట తీసుకున్నాడు. వెంటనే లెక్కపెట్టాడు.వంద రూపాయల నోట్లు 99 ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ లెక్కించాడు.ఎన్నిసార్లు లెక్కించినా 99 ఉన్నాయి.
బ్యాంకులో 99 నోట్లున్న కట్ట ఇవ్వరు. కనుక మిగిలిన నోటు ఆ పక్కనే ఎక్కడో పడి ఉండవచ్చని అనుకుని వెతకడం మొదలుపెట్టాడు.చాలాసేపు వెతికాడు. కానీ ఫలితం లేకపోయింది. అయినా వెతుకులాట మానలేదు.

ఈ కథను చెప్పి గురువు ఫకాలున నవ్వాడు.ఒక్కనోటు దొరికిన వ్యక్తి దర్జాగా హోటల్‌ కు వెళ్ళి ఇడ్లీ తిన్నాడు. కాఫీ తాగాడు.కానీ 99 నోట్లు దొరికిన వ్యక్తి వాటిని ఖర్చు పెట్టుకోక మరో నోటు కోసం వెతకడం మొదలుపెట్డాడు.మనలో చాలా మంది ఈ తరహానే.లభించిన దానినో ఉన్నదానినో అనుభవించరు. దాంతో తృప్తిపడరు.లేని దానికోసం బుర్రలు పాడుచేసుకుంటారు. ఉన్నదాని పట్ల శ్రద్ధ ఉండదు. దేహం ఓ వైపు లాగుతుంటే మనసు మరోవైపు పోతుంటుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకుంటే ఎంతున్నా అసంతృప్తి తప్పదు.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...

TET and DSC Very important topics...

Lakshya Educational Groups