Skip to main content

భూగోళ శాస్త్ర ఇంపార్టెంట్ బిట్స్


పగలు, రాత్రులు ఎక్కడ సమానంగా ఉంటాయి?

1. కింది వాటిలో 'భూభ్రమణ ఫలితం' కానిది ఏది?
1. పోటు-పాటులు ఏర్పడటం
2. పగలు-రాత్రులు ఏర్పడటం
3. రాత్రి, పగలు సమయాల్లో తేడాలు
4. పవనాలు, సముద్ర ప్రవాహాల దిశలో మార్పులు సంభవించడం

2. భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి పట్టే సమయం ఎంత?

1. 24 గంటలు 56 నిమిషాల 4.09 సెకన్లు
2. 365 రోజుల 6 గంటల 10 సెకన్లు
3. 965 రోజుల 10 గంటలు
4. 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు
3. భూమి తన అక్షాన్ని ఆధారంగా చేసుకొని పశ్చిమం నుంచి తూర్పునకు గంటకు ఎంత వేగంతో తన చుట్టూ తాను తిరుగుతుంది?

1. 965 కి.మీ. 2. 1610 కి.మీ.
3. 365 కి.మీ. 4. 24 కి.మీ.

4. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1. భూ పరిభ్రమణ ఫలితంగా రుతువులు ఏర్ప డుతాయి
2. భూమి కక్ష్య పొడవు 695 కి.మీ.
3. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళుతున్న కొద్దీ భూమి చుట్టుకొలత తగ్గుతుంది
4. భూమి అక్షం నిట్టనిలువుగా కాకుండా 23 1/20 కోణంతో తూర్పు వైపునకు వాలి ఉంటుంది

5. జతపరచండి.
జాబితా-1 జాబితా-2
1. భూమధ్య రేఖపై సూర్య ఎ. జూన్‌ 21
కిరణాలు నిట్టనిలువుగా పడే రోజు
2. కర్కట రేఖపై సూర్య బి. జనవరి 3
కిరణాలు నిట్టనిలువుగా పడే రోజు
3. మకర రేఖపై సూర్యకిరణాలు సి. డిసెంబర్‌ 22
నిట్ట నిలువుగా పడే రోజు
4. పరిహేళి సంభవించే రోజు డి. మార్చి 21
1. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2. 1-డి, 2-ఎ, 31బి, 4-సి
3. 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
4. 1-బి, 2-సి, 3-డి, 4-ఎ

6. 'రవి ఉచ్ఛస్థితి' అంటే ఏమిటి?
1. సూర్యుడికి భూమి దూరంగా వచ్చేస్థానం
2. సూర్యకిరణాలు కర్కటరేఖపై నిట్టనిలువుగా పడటం
3. సూర్యుడికిరణాలు ధ్రువాలపై నిట్టనిలువుగా పడటం
4. భూమి.. సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు సూర్యుడికి దగ్గరగా వచ్చేస్థానం

7. కింది వాటిలో సరికానిది ఏది?
1. అపహేళి-జులై 4
2. అవహేళి రోజున భూమి, సూర్యుడి మధ్య ఉండే దూరం- 152 మి.కి.మీ
3. రవి నీచస్థానం- జనవరి 3
4. భూమి-సూర్యుడి మధ్య సగటు దూరం- 147 మి.కి.మీ

8. కింది వాటిలో 'ఉత్తరాయనాంతం' సంభవించే రోజు?
1. జులై 4 2. మార్చి 21
3. జూన్‌ 21 4. డిసెంబర్‌ 22

9. భారత్‌లో సుదీర్ఘ పగలు ఉండే రోజు ఏది?
1. జూన్‌ 23 2. జూన్‌ 21
3. డిసెంబర్‌ 22 4. జులై 21

10. దక్షిణాయన కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది?
1. డిసెంబర్‌ 22 నుంచి జూన్‌ 21
2. జూన్‌ 21 నుంచి డిసెంబర్‌ 22
3. సెప్టెంబర్‌ 23 నుంచి మార్చి 21
4. సెప్టెంబర్‌ 21 నుంచి మార్చి 23

       11. ప్రపంచంలో ఎక్కువ 'కాల మండలాలు' ఉన్న దేశం ఏది?
1. కెనడా 2. జర్మనీ
3. రష్యా 4. ఆస్ట్రేలియా

12. అంతర్జాతీయ కాల ప్రామాణిక రేఖ కింది వాటిలో ఏ దేశం మీదుగా వెళ్లదు?
1. ఘనా 2. మాలి
3. స్పెయిన్‌ 4. పోలండ్‌

13. కింది ఏ దేశం ద్వారా భూమధ్య రేఖ వెళ్లదు?
1. జాంబియా 2. ఉగాండా
3. కొలంబియా 4. ఈక్వెడార్‌

14. ఈకింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1. అక్షాంశాలను ఉపయోగించి భూమిపై ఉన్న వివిధ ప్రాంతాల శీతోష్ణస్థితులను గుర్తించవచ్చు
2. రేఖాంశాలను ఉపయోగించి భూమిపై ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న సమయాన్ని తెలుసుకోవచ్చు
3. అక్షాంశాలు-రేఖాంశాలు ఒకదానితో ఒకటి ఖండించు కోవడం వల్ల ఏర్పడే దాన్ని 'గ్రిడ్‌' అంటారు
4. గ్రిడ్‌ త్రిభుజాకారంలో ఉంటుంది

15. భారతదేశంలో కింద పేర్కొన్న ఏ రాష్ట్రం ద్వారా 82 1/20 తూర్పు రేఖాంశం వెళ్లదు?
1. మధ్యప్రదేశ్‌ 2. బీహార్‌
3. ఒడిశా 4. ఛత్తీస్‌ఘఢ్‌

16. ఏ ఖండం ద్వారా కర్కటరేఖ, మకరvgరేఖ, భూమధ్య రేఖలు వెళుతున్నాయి?
1. ఆసియా 2. ఆస్ట్రేలియా
3. ఆఫ్రికా 4. ఉత్తర అమెరికా

17. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ. మకరరేఖ-23 1/20 దక్షిణ అక్షాంశం
బి. ఆర్కిటిక్‌ వలయం- 66 1/20 ఉత్తర అక్షాంశం
సి. కర్కట రేఖ- 23 1/20 ఉత్తర అక్షాంశం
డి. అంటార్కిటికా వలయం- 66 1/20 దక్షిణ అక్షాంశం
1. ఎ, సి, డి 2. ఎ, బి, సి
3. ఎ, బి, సి, డి 4. బి, సి, డి

18. భూమి.. ఒక గంట సమయంలో ఎన్ని రేఖాంశాలు తిరుగుతుంది?
1. 60 2. 30 3. 4 4. 15

19. 'అంతర్జాతీయ దినరేఖ' కింది ఏ దీవి ద్వారా వెళుతోంది?
1. కిరిబతి 2. టోంగా
3. ఫిజీ 4. పైవన్నీ

20. భారత్‌లో ఉదయం 9.30 గంటలు అయితే ఇంగ్లండ్‌లో ఎంత సమయం అవుతుంది?
1. సాయంత్రం 4.00 గంటలు
2. ఉదయం 4.00 గంటలు
3. ఉదయం 3.30 గంటలు
4. మధ్యాహ్నం 2.30 గంటలు

21. రెండు అక్షాంశాల మధ్య సగటు దూరం?
1. 211 కి.మీ. 2. 311 కి.మీ.
3. 111 కి.మీ. 4. 11 కి.మీ.

22. కింది వాటిలో భూమధ్య రేఖను రెండు సార్లు దాటే నది ఏది?
1. కాంగోనది 2. నైలు నది
3. మిసిసిపీ నది 4. అమెజాన్‌ నది

23. 'సెక్ట్సెంట్‌' అనే పరికరాన్ని దేని కోసం ఉపయోగిస్తారు?
1. భూకంప తీవ్రతను తెలుసుకోవడానికి
2. పీడన ప్రవణతను కొలవడానికి
3. నౌకాయానం చేసేవారు ఏ అక్షాంశంపై ఉన్నారో తెలుసుకోవడానికి
4. సముద్ర లోతు తెలుసుకోవడానికి

24. కింది వాటిలో 'అంతర్జాతీయ దినరేఖ'గా దేన్ని వ్యవహరిస్తారు?
1. 00 అక్షాంశం 2. 00 రేఖాంశం
3. 23 1/20 ఉత్తర అక్షాంశం
4. 1800 తూర్పు, పశ్చిమ రేఖాంశం

25. భూమి తన చుట్టూ తాను ఒక డిగ్రీ దూరం తిరగ డానికి ఎంత సమయం పడుతుంది?
1. 8 నిమిషాలు 2. 4 నిమిషాలు
3. 4 సెకన్లు 4. 4 గంటలు

26. భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది?
1. 23 1/20 ఉత్తర రేఖాంశం
2. 82 1/20 పశ్చిమ రేఖాంశం
3. 82 1/20 తూర్పు రేఖాంశం
4. 23 1/20 దక్షిణ రేఖాంశం

27. ఇంగ్లండ్‌లోని లండన్‌లో రాత్రి 2. గంటలు అయితే భారత్‌లోని హైదరాబాద్‌ నగరంలో ఎంత సమయం అవుతుంది?
1. రాత్రి 7.30 గంటలు
2. రాత్రి 8.30 గంటలు
3. ఉదయం 8.30 గంటలు
4. ఉదయం 7.30 గంటలు

28. కింది వాటిలో ఏ రేఖాంశాన్ని 'గ్రీనిచ్‌ రేఖాంశం' అంటారు?
1. 00 రేఖాంశం 2. 82 1/20 తూర్పు రేఖాంశం
3. 1800 పశ్చిమ రేఖాంశం 4. 1800 తూర్పు రేఖాంశం

29. గ్రీనిచ్‌ రేఖాంశం కింద పేర్కొన్న ఏ పట్టణం ద్వారా వెళ్తోంది?
1. అలహాబాద్‌ 2. న్యూయార్క్‌
3. లండన్‌ 4. జెనీవా

30. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1. రేఖాంశాల ఎత్తును తెలుసుకోవడానికి 'క్రోనోమీటర్‌'ను ఉపయోగిస్తారు
2. రేఖాంశాలను 'మధ్యాహ్న రేఖలు' అని పిలుస్తారు
3. ధ్రువాల వద్ద.. రెండు రేఖాంశాల మధ్య సగటు దూరం 2 కి.మీ.
4. రేఖాంశాలు అర్ధవృత్తాలు

31. దక్షిణార్ధ గోళలో పగటి సమయం ఎక్కువగా ఉండే రోజు ఏది?
1. జూన్‌ 21 2. మార్చి 21
3. సెప్టెంబర్‌ 23 4. డిసెంబర్‌ 22

32. 'సూర్యగ్రహణం' ఎప్పుడు ఏర్పడుతుంది?
1. సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు
2. చంద్రుడికి, భూమికి మధ్య సూర్యుడు అడ్డుగా వచ్చినపుడు
3. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినపుడు
4. పైవేవీకావు

33. ఒక గ్రహణం మళ్లీ అదే రీతిలో ఏర్పడటానికి ఎంత సమయం పడుతుంది?
1. 12 సంవత్సరాల 18 రోజులు
2. 18 సంవత్సరాల 10 రోజులు
3. 10 సంవత్సరాల 25 రోజులు
4. 24 సంవత్సరాల 30 రోజులు

34. ఏడాది కాలంలో గరిష్టంగా ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయి?
1. 4 2. 5 3. 6 4. 7

35. కింది వాటిలో పెద్ద గోళం ఏది?
1. భూమధ్యరేఖ 2. ఉత్తర ధృవీయ వృత్తం
3. కర్కటరేఖ 4. మకరరేఖ

36. అంతర్జాతీయ డేట్‌లైన్‌ ఏది?
1. భూమధ్యరేఖ 2.00 రేఖాంశం
3. 900 తూర్పు రేఖాంశం 4. 1800 రేఖాంశం

37. పగలు, రాత్రులు ఎక్కడ సమానంగా ఉంటాయి?
1. భూమధ్యరేఖ 2. కర్కటరేఖ
3. అంటార్కిటికా 4. ధ్రువాలు

38. భారత ప్రామాణిక రేఖాంశం కింది ఏ నగరం ద్వారా వెళుతోంది?
1. కోల్‌కతా 2. లక్నో
3. అలహాబాద్‌ 4. న్యూఢిల్లీ

39. సంవత్సరంలో అతి తక్కువ పగటి సమయం ఉండే రోజు?
1. డిసెంబర్‌ 25 2. డిసెంబర్‌ 24
3. డిసెంబర్‌ 23 4. డిసెంబర్‌ 22

40. ధ్రువాల వద్ద అత్యధికంగా వెలుతురు ఉండే కాలం ఎంత?
1. 12 గంటలు 2. 24 గంటలు
3. 3 నెలలు 4. 6 నెలలు

41. గ్రీనిచ్‌ కాలమానానికి భారతదేశం ఎంత సమయం ముందుగా ఉంటుంది?
1. 4.30 గంటలు 2. 5.30 గంటలు
3. 6.30 గంటలు 4. 3.30 గంటలు

42. మార్చి 21, సెప్టెంబర్‌ 23న సూర్యుడి కిరణాలు నేరుగా కింది వాటిలో దేనిపై ప్రసరిస్తాయి?
1. ఎక్సోస్పియర్‌ 2. భూమధ్యరేఖ
3. స్టాటో స్పియర్‌ 4. కర్కటరేఖ

సమాధానాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups