Skip to main content

నేటి మోటివేషన్...



ఈ Photo తీసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంట.......,
మీరు ఈ ఫొటో జాగ్రత్తగా చూడండి.ఆ పాప చేతిలో ఆహారం వుంది వెనకాల రాబందు వుంది. ఆ పాప అనుకుంటుంది, రాబందు వచ్చి ఆహారాన్ని ఎత్తుకుపోతుందని. దాచుకొంటుంది. కాని పాపకు తెలియని విషయం ఏంటంటే, రాబందు చూసేది ఆహారం కోసం కాదు ఆ పాప కోసమే అని... ఎందుకంటే తిండి సరిపోక ఆకలితో అలమటించి ఆ పాప చనిపోతే తిందామని..ఈ ఫొటో కెవిన్ అనే ఫొటో గ్రాఫర్ సూడాన్ లో 1990 లో అక్కడి కరువు కాలంలో తిండి లేక ఎంతో మంది చనిపోయిన విషయాన్ని ప్రపంచానికి తెలియజెయ్యాలని తన దేశమైన దక్షిణాఫ్రికా నుండి వెళ్ళి తీసిన ఫొటో. ఈ ఫొటోకి గాను కెవిన్ కు చాలా గుర్తింపు వచ్చింది. సన్మానాలు చాలానే జరిగాయి. ప్రపంచంలో కెవిన్ పేరు మారు మ్రోగిపోయింది. ఆయనను అభినందిస్తూ ఎన్నో ఉత్తరాలు వచ్చాయి. సన్మానాలు చేసుకోడానికి కూడా సమయం చాలక బిజీగా తిరుగుతున్న కెవిన్ కు ఒక సారి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే అవతలి వ్యక్తి....ఆ పాప ఏమయ్యింది సార్, బ్రతికుందా చనిపోయిందా అని అడిగాడు. అప్పుడు కెవిన్ ఇలా అన్నాడు...ఏమోసార్ ఫొటో తీసి వచ్చిన తరువాత తిరిగి వెళ్ళి చూసేంత సమయం నాకు లేదు, ఆ పాప ఏమయ్యందో అని.... అప్పుడు అవతలి వ్యక్తి ఇలా అన్నాడు........... ఆ రోజు అక్కడ వున్నవి రెండు రాబందులు, ఒకటి పాప చనిపోతే తినేద్దాం అనిచూస్తుంటే ఇంకొకటి కెమేరా పట్టుకొని కూర్చుంది.......... అని ఫోన్ పెట్టేసారు.. ఆ మాట ఆయన మీద ఎంత ప్రభావం చూపిందంటే, 1993 లో ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత... అప్పటికి ఆయన వయస్సు 33 సంవత్సరాలే..... ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, సమాజంలో ఇప్పుడు కెవిన్ లాంటి వారు చాలా మంది వున్నారు‌. ప్రతీది ఫొటో తీయడం, అక్కడ మన అవసరం వున్నా
 సహాయం చేయకుండా కెవిన్ లాగా పదిమంది మెప్పు గురించి బ్రతికేవారే ఎక్కువ....ఆరోజు అక్కడ కెవిన్ మరిచింది ఏంటంటే మానవత్వం. ఈరోజుల్లో మనం మరుస్తుంది కూడా మానవత్వమే.. కాబట్టి మీలో వున్న కెవిన్ ని చంపండి.

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺